SpiceJet - DGCA: స్పైస్‌జెట్ ఎయిర్‌లైన్స్‌కి కాస్త ఊరట, ఆ నిబంధనను ఎత్తివేసిన డీజీసీఏ
SpiceJet - DGCA: స్పైస్‌జెట్‌పై విధించిన నిబంధనల్ని డీజీసీఏ ఎత్తివేసింది.

SpiceJet - DGCA:
వింటర్ షెడ్యూల్‌లో భాగంగా..
తరచూ సాంకేతిక సమస్యలు వస్తున్నాయన్న కారణంగా...స్పైస్‌జెట్ సర్వీస్‌లపై Directorate General of Civil Aviation (DGCA) విధించిన ఆంక్షల్ని తొలగించింది. 50% సర్వీస్‌లతోనే నడపాలన్న నిబంధనను ఎత్తివేసింది. ఈ నెల 30వ తేదీ నుంచి వింటర్ షెడ్యూల్ ప్రారంభ మవుతున్న తరుణంలో...ఈ నిర్ణయం తీసుకుంది DGCA.అక్టోబర్ 30 నుంచి వచ్చే ఏడాది మార్చి 25 వరకూ ఈ సీజన్ కొనసాగుతుంది. ఈ సీజన్‌లో డిమాండ్ బాగా ఉంటుంది. అందుకే...50% సర్వీస్‌లు మాత్రమే నడవాలన్న నిబంధనను ఎత్తి వేసింది. ఈ వింటర్ షెడ్యూల్‌లో స్పైస్‌జెట్ ఎయిర్‌లైన్స్ 21,941 విమానాలను దేశీయంగా నడపనుంది. నిజానికి..గతేడాది ఇదే సీజన్‌లో 22,287 విమానాలను నడిపారు. కానీ...ఈ సారి 1.55% మేర తగ్గించింది. మొత్తం 105 ఎయిర్‌పోర్ట్‌లో హాల్ట్‌కి అనుమతులూ వచ్చేశాయి. వీటిలో డియోఘర్, సిమ్లా, రౌర్కెలా ఎయిర్‌పోర్ట్స్ ఉన్నాయి.
DGCA lifts restrictions, SpiceJet to operate with full capacity from October 30: DGCA (Directorate General of Civil Aviation) pic.twitter.com/41fQarV4mQ
— ANI (@ANI) October 21, 2022
జులైలో ఆంక్షలు..
ఈ ఏడాది జులైలో స్పైస్‌జెట్ ఎయిర్‌లైన్స్‌పై DGCA సీరియస్ అయింది. తరచుగా స్పైస్‌జెట్ విమానాలు ప్రమాదానికి గురవుతుండటంతో సంస్థపై ఆంక్షలు విధించింది. 50 శాతం స్పైస్‌జెట్ సర్వీసులకు మాత్రమే డీజీసీఏ అనుమతి ఇచ్చింది. 8 వారాల పాటు ఈ ఆంక్షలు కొనసాగుతాయని పేర్కొంది. లో-బడ్జెట్ విమాన ప్రయాణాలకు కేరాఫ్‌గా నిలిచిన స్పైస్‌జెట్ విమానయాన సంస్థ ఇటీవల చిక్కుల్లో పడింది. ఆ సంస్థకు చెందిన పలు విమానాలు సాంకేతిక లోపాల వల్ల ఎమర్జెన్సీ ల్యాండింగ్ అవడం, ప్రమాదాలకు గురి కావడం జరిగింది. ఒకదానికి కాక్‌పిట్ విండ్ షీల్డ్ క్రేక్ కావడం వల్ల ముంబయిలో ల్యాండ్ చేయగా, మరొక విమానం.. సాంకేతిక లోపం కారణంగా పాకిస్థాన్ కరాచీలో ల్యాండ్ చేయాల్సి వచ్చింది. మొత్తం 17 రోజుల్లో 7 ఎమర్జెన్సీ ల్యాండింగ్‌లు చేసింది స్పైస్‌జెట్ సంస్థ. ఈ ఘటనలపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవీయేషన్ (డీజీసీఏ) దర్యాప్తు చేపట్టింది.
వరుస ప్రమాదాలు:
జులై 5
స్పైస్‌జెట్ విమానం ఒకటి అత్యవసర పరిస్థితుల్లో మంగళవారం కరాచీ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. దిల్లీ నుంచి దుబాయ్‌కి బయలుదేరిన విమానం ఫ్యూయల్ ఇండికేటర్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో అత్యవసరంగా కరాచీ విమానాశ్రయంలో ల్యాండ్ చేసినట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) వెల్లడించింది.
జులై 5
మరో స్పైస్‌జెట్ విమానంలోని ఔటర్ విండ్ షీల్డ్ కాక్‌పిట్ క్రాక్ అవడంతో ముంబయిలో ల్యాండ్ చేశారు.
జులై 2
జులై 2న జబల్‌పుర్-దిల్లీ విమానం క్యాబిన్‌లో పొగలు వచ్చాయి. దీంతో దిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ చేశారు.
జూన్ 25, 24
గత నెల 24,25 తేదీల్లో రెండు వేర్వేరు విమానాల్లో ఫ్యూజ్‌లేజ్ డోర్ వార్నింగ్ తలెత్తింది. దీంతో ఆ రెండు విమాన సర్వీసులు రద్దయ్యాయి.
జూన్ 19
పట్నా నుంచి 185 మంది ప్రయాణికులతో బయలుదేరిన స్పైస్ జెట్ విమానాన్ని నిమిషాల్లోనే అత్యవసర ల్యాండింగ్ చేశారు. పక్షి ఢీ కొట్టడంతో ఇంజిన్ దెబ్బతిన్నది. అదే రోజు జబల్‌పూర్-దిల్లీ విమానంలో మరో సమస్య తలెత్తింది.
Also Read: EC Banned Imran Khan: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు షాక్- 5 ఏళ్లు బ్యాన్ విధించిన ఈసీ!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

