అన్వేషించండి

US Haters: భారతీయులందర్నీ డిపోర్ట్ చేయాలన్న అమెరికా జర్నలిస్ట్ - ఉద్యోగం ఊడగొట్టిన కంపెనీ !

US journalist : అమెరికాలో భారతీయులు ఉన్నత స్థానాల్లోకి వెళ్తూంటే కొంత మంది జాతి విద్వేషకులు తట్టుకోలేకపోతున్నారు. వివాదాస్పదవ్యాఖ్యలు చేస్తూ చిక్కుల్లో పడుతున్నారు.

US journalist  fired after post on Indian Origin CEO  :  అమెరికాలో H-1B వీసా వివాదాలు ,  భారతీయ టెక్ కార్మికులపై  విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసేవారు పెరుగుతున్నారు. భారత మూలాలు ఉన్న  ఓ కంపెనీ సీఈవో  కృతి పటేల్ గోయల్‌పై ద్వేషపూరిత కామెంట్ చేసిన అమెరికన్ జర్నలిస్ట్ మ్యాట్ ఫోర్నీకి ఉద్యోగం పోయింది. ‘ప్రతి భారతీయుడినీ డీపోర్ట్ చేయండి’ అంటూ X (ట్విటర్)లో పోస్ట్ చేశాడు. దీనిపై సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం వచ్చింది. H-1B ,  భారతీయ సమస్యలపై రిపోర్టింగ్ చేయడానికి అతన్ని నియమించిన మీడియా సంస్థ ‘ది బ్లేజ్’ ఒక వారంలోనే అతన్ని తొలగించింది.
 
Etsy కంపెనీ, ప్రపంచంలోని పెద్ద ఆన్‌లైన్ మార్కెట్ ప్లేస్. ఈ కంపెనీ   ప్రెసిడెంట్ , చీఫ్ గ్రోత్ ఆఫీసర్ కృతి పటేల్ గోయల్‌ను జనవరి 1, 2026 నుంచి CEOగా నియమిస్తున్నట్లు ప్రకటించింది. భారత మూలాల గోయల్ మునుపు Depop కంపెనీ CEOగా పనిచేసి, ఆ కంపెనీని TIME మ్యాగజైన్‌లో ‘100 మోస్ట్ ఇన్‌ఫ్లూయెన్షియల్ కంపెనీలు’లో చేర్చారు.  ఆమె  ఇప్పటి వరకూ  Etsyలో చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్, వయాకాం, ప్రొడక్ట్ (RED), మోర్గాన్ స్టాన్లీ, జనరల్ అట్లాంటిక్ పార్ట్‌నర్స్‌లో పని చేసిన అనుభవం ఉంది.   

ఈ విషయంపై కృతి పటేల్ సోషల్ మీడియాలో తన ఆనందాన్ని పంచుకున్నారు. అయితే   జర్నలిస్టు మరో అర్హత లేని భారతీయుడు అమెరికన్ కంపెనీని తీసుకుంటున్నారు.. కంపెనీలో ఆమె మొదటి చర్య అమెరికన్లను తొలగించి, భారతీయులతో భర్తీ చేయడమే.. DEI: ప్రతి భారతీయుడినీ డీపోర్ట్ చేయండి” అని పోస్ట్ చేశాడు. ఇది 15,000కి పైగా లైక్‌లు, 2,000 రీపోస్టులు పొందింది. కానీ భారతీయ సమాజంలో ఆగ్రహం రేగింది.

నవంబర్ 4న ఫోర్నీ తన Xలో ‘ది బ్లేజ్’లో ఉద్యోగం పొందినట్లు ప్రకటించాడు. నవంబర్ 5-7న పోస్ట్ వైరల్ అయ్యేసరికి సోషల్ మీడియాలో ఆగ్రహం పెరిగింది. భారతీయ అమెరికన్లు మరియు DEI మద్దతుదారులు ఫోర్నీని ‘జాతి విద్వేషకుడు’ అని ఆరోపించారు. ది బ్లేజ్ అతని ‘ఆందోళనకరమైన’ ట్వీట్ల కారణంగా అతన్ని తొలగించింది.   

ఫోర్నీ మునుపటి పోస్టుల్లో భారతీయులను ‘కరప్ట్’, ‘అసమర్థులు’, ‘దేశ భద్రతకు ముప్పు’ అని అవమానించాడు. ఉదాహరణకు, USAలో దీపావళి జరుపుకోవడాన్ని ఎగతాళి చేసి, “వెటరన్లు ఆత్మహత్య చేసుకుంటున్నారు” అని రాశాడు. Coinbase డేటా లీక్‌ను భారతీయులపై నింద వేసి, “మీ డేటా సురక్షితం కాదు” అని చెప్పాడు. దీపావళి, డెల్టా ఎయిర్‌లైన్స్ IT, ఫ్రెడీ మ్యాక్‌లో భారతీయులపై చాలా పోస్టులు చేశాడు. వింత ఏమిటంటే, ఫోర్నీని H-1B సమస్యలపై రిపోర్టర్‌గా నియమించిన ‘ది బ్లేజ్’  అతని ద్వేషపూరిత మాటలకు బాధ్యత వహించాల్సి వచ్చింది.  

ఫోర్నీ ఉద్యోగం పోయిన తర్వాత Xలో, “ది బ్లేజ్ నా ట్వీట్లు ఆందోళనకరమని చెప్పలేదు, కానీ సోషల్ మీడియా యాక్టివిటీ గురించి మాట్లాడింది” అని రాశాడు. కొందరు అతనికి మద్దతు ఇచ్చారు ఈ ఘటన అమెరికాలో భారతీయులపై జరుగుతున్న జాతి విద్వేష ట్రోలింగ్‌కు ఉదాహరణ. Etsy లేదా గోయల్ నుంచి ఎలాంటి స్పందన లేదు.

టాప్ హెడ్ లైన్స్

RTC Special Buses: జేబీఎస్‌, ఎంజీబీఎస్‌లో దసరా పండగ రద్దీ.. బస్సుల కోసం గంటల పాటు ప్రయాణికుల పడిగాపులు
జేబీఎస్‌, ఎంజీబీఎస్‌లో దసరా పండగ రద్దీ.. బస్సుల కోసం గంటల పాటు ప్రయాణికుల పడిగాపులు
Governor Quota MLC Seats: గ్రాడ్యుయేట్ ఎన్నికల హడావుడి ముగియకముందే.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులపై గంపెడు ఆశలు!
Graduate MLC ఎన్నికల హడావుడి ముగియకముందే.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులపై గంపెడు ఆశలు!
Harish Rao: కత్తి ఆంధ్రావాడిది.. కానీ పొడిచేది తెలంగాణోడు: సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు
కత్తి ఆంధ్రావాడిది.. కానీ పొడిచేది తెలంగాణోడు: సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు
JanaSena Candidates List: జనసేన మున్సిపల్ అభ్యర్ధుల తొలి జాబితా విడుదల.. విజయవాడ మేయర్ అభ్యర్థిగా వంగవీటి రాధాకృష్ణ
జనసేన మున్సిపల్ అభ్యర్ధుల తొలి జాబితా విడుదల.. విజయవాడ మేయర్ అభ్యర్థిగా వంగవీటి రాధాకృష్ణ

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
RTC Special Buses: జేబీఎస్‌, ఎంజీబీఎస్‌లో దసరా పండగ రద్దీ.. బస్సుల కోసం గంటల పాటు ప్రయాణికుల పడిగాపులు
జేబీఎస్‌, ఎంజీబీఎస్‌లో దసరా పండగ రద్దీ.. బస్సుల కోసం గంటల పాటు ప్రయాణికుల పడిగాపులు
TDP Second List of Candidates: పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల
పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల
Horror Thrilelr OTT : ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - 7 కోట్లతో తీస్తే 2,500 కోట్ల కలెక్షన్స్... ఫ్రీగా స్ట్రీమింగ్ అయ్యేది ఎప్పుడంటే?
ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - 7 కోట్లతో తీస్తే 2,500 కోట్ల కలెక్షన్స్... ఫ్రీగా స్ట్రీమింగ్ అయ్యేది ఎప్పుడంటే?
Jadeja ODI Exit?: రెస్ట్ అంటూనే స్టార్ ఆల్ రౌండర్ కు శాశ్వత గుడ్ బై..!! వరల్డ్ కప్ ప్రణాళికల నుంచి  జడేజా ఔట్, అక్షర్  కు పట్టం కట్టిన సెలెక్టర్లు!
రెస్ట్ అంటూనే స్టార్ ఆల్ రౌండర్ కు శాశ్వత గుడ్ బై..!! వరల్డ్ కప్ ప్రణాళికల నుంచి  జడేజా ఔట్, అక్షర్  కు పట్టం కట్టిన సెలెక్టర్లు!
Dachepalli YCP Candidate Arrest: దాచేపల్లి వైసీపీ ఛైర్మన్‌ అభ్యర్థి కొప్పుల రవి అరెస్ట్‌.. ఇంట్లో 429 సీసాల తెలంగాణ లిక్కర్ సీజ్!
దాచేపల్లి వైసీపీ ఛైర్మన్‌ అభ్యర్థి కొప్పుల రవి అరెస్ట్‌.. ఇంట్లో 429 సీసాల తెలంగాణ లిక్కర్ సీజ్!
Amaravati News: అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి మరో రూ.15,000 కోట్ల లోన్!
అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి మరో రూ.15,000 కోట్ల లోన్!
Jabardasth Emmanuel : హీరోగా జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ - క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్‌తో ఎంట్రీ... ఫస్ట్ లుక్ చూశారా?
హీరోగా జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ - క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్‌తో ఎంట్రీ... ఫస్ట్ లుక్ చూశారా?
APPSC Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్: ఏపీపీఎస్సీ నుంచి 302 ఉద్యోగాలకి నోటిఫికేషన్లు విడుదల
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్: ఏపీపీఎస్సీ నుంచి 302 ఉద్యోగాలకి నోటిఫికేషన్లు విడుదల
Embed widget