Democracy In Danger: విజయ్ చౌక్ వద్ద ప్రతిపక్షాల ర్యాలీ, అదానీ అంశంపై కమిటీ వేయాలని డిమాండ్
Democracy In Danger: ప్రతిపక్ష నేతలు ఢిల్లీలోని విజయ్ చౌక్ వద్ద ఆందోళనలు నిర్వహించారు.
Opposition MPs March:
రాష్ట్రపతి భవన్‌పై ర్యాలీ..
ప్రతిపక్ష పార్టీలు రాష్ట్రపతి భవన్ వైపు ర్యాలీ చేపట్టాయి. "Democracy in Danger" అనే బ్యానర్ పట్టుకుని మార్చ్ నిర్వహించాయి. భారీ బందోబస్తు మధ్య ఈ ర్యాలీ కొనసాగింది. విజయ్ చౌక్ వద్ద పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు ప్రతిపక్ష నేతలు. అదానీ వివాదంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలని డిమాండ్ చేశాయి. పరిస్థితులు అదుపు తప్పకుండా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.
"ప్రధాని మోదీ కీలక విషయాలను దాచేస్తున్నారు. లలిత్ మోదీ, నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ ప్రభుత్వం నుంచి కొన్ని కోట్ల రూపాయలు కొల్లగొట్టారు. విదేశాలకు వెళ్లిపోయారు. ప్రధాని వీటిపై ఏ మాత్రం నోరు మెదపడం లేదు. రాహుల్ గాంధీని మాట్లాడనివ్వడం లేదు. దీనర్థం అలాంటి వాళ్లు దోచుకుంటూనే ఉంటారు. మేం మాత్రం నోరు మూసుకుని ఉండాలనేగా..? మాట్లాడేందుకు అనుమతి ఇవ్వాలని లెటర్ రాసిన పట్టించుకోలేదు. ఇదే ధోరణి కొనసాగితే మన దేశంలోనూ నియంతృత్వం వచ్చేస్తుంది."
- మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ అధ్యక్షుడు
राज्यसभा में विपक्ष के नेता श्री @kharge के साथ विपक्ष के सांसदों का 'मोदी-शाही' के खिलाफ पार्लियामेंट हाउस से विजय चौक तक मार्च।
— Congress (@INCIndia) March 24, 2023
इस तानाशाही के खिलाफ हम लड़ते रहेंगे। PM मोदी को अडानी महाघोटाले पर जवाब देना ही होगा। pic.twitter.com/plFRhCIaMn
పరువు నష్టం దావా కేసులో రాహుల్‌ను ఇరికించి ప్రతిపక్షం అనేదే లేకుండా చూడాలని బీజేపీ కుట్ర పన్నుతోందని ఆప్ నేత సంజయ్ సింగ్ విమర్శించారు. కాంగ్రెస్ హెడ్‌క్వార్టర్స్ వద్ద పెద్ద ఎత్తున పోలీసులు మొహరించారు.
#WATCH | Heavy security outside the Congress Headquarters in Delhi as party workers protest against the conviction of Rahul Gandhi in the criminal defamation case over his 'Modi surname' remark.
— ANI (@ANI) March 24, 2023
The protesters detained by Police. pic.twitter.com/nf75e4NwmQ