Delhi Metro: మెట్రోలో చండాలమైన పనులు, మండి పడుతున్న మహిళా కమిషన్ - పోలీసులకు నోటీసులు
Delhi Metro: ఢిల్లీ మెట్రోలో కొందరు అసభ్యకరంగా ప్రవర్తించడంపై మహిళా కమిషన్ సీరియస్ అయింది.
Delhi Metro:
అభ్యంతరకరమైన పనులు
ఢిల్లీ మెట్రో వివాదాలకు కేరాఫ్ అడ్రెస్‌గా మారింది. నిత్యం ఏదో ఓ వీడియో వైరల్ అవుతూనే ఉంది. కొన్ని సార్లు అవి నవ్వు తెప్పించినా...మరి కొన్ని సార్లు మరీ చిరాకు పుట్టిస్తున్నాయి. ఇటీవలే ఓ జంట మెట్రోలో అందరూ చూస్తుండగానే ముద్దులు పెట్టుకోవడం షాక్‌కి గురి చేసింది. ఇప్పుడు కొందరు యువకులు అసభ్యకరమైన పనులు చేస్తున్న వీడియోలు వైరల్ అయ్యాయి. ఇక్కడ రాయడానికి కూడా ఇబ్బందికరంగా అనిపించేంత అభ్యంతకరమైన పనులు చేశారు. ప్రయాణికులను తీవ్ర ఇబ్బందికి గురి చేశారు. దీనిపై ఢిల్లీ మహిళా కమిషన్ సీరియస్ అయింది. మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మలవాల్ ట్విటర్ వేదికగా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇంత జరుగుతున్నా ఢిల్లీ మెట్రో అధికారులు ఏం చేస్తున్నారంటూ మండి పడ్డారు. అలాంటి వాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
"సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు చూశాను. మెట్రోలో కొందరు చేసిన ఆ అసభ్యకరమైన పనులను చూసి చిరాకు పుట్టింది. అసహ్యం వేసింది. ఢిల్లీ పోలీసులతో పాటు ఢిల్లీ మెట్రోకి కూడా నోటీసులు ఇస్తున్నాను. అలాంటి వాళ్లపై కచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాల్సిందే"
- స్వాతి మలివాల్, ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్
Came across a viral video where a man can be seen shamelessly masturbating in Delhi Metro. It is absolutely disgusting and sickening. I am issuing a notice to Delhi Police and Delhi Metro to ensure strictest possible action against this shameful act.
— Swati Maliwal (@SwatiJaiHind) April 28, 2023
Delhi Commission for Women (DCW) chief Swati Maliwal issues a notice to DCP, Delhi Metro over the viral video of a man seen masturbating while sitting on a seat in Delhi Metro. pic.twitter.com/HcKN2vm6yl
— ANI (@ANI) April 28, 2023
నెటిజన్‌ల ఆగ్రహం..
అయితే...ఈ వీడియోలపై నెటిజన్‌లు మండి పడుతున్నారు. చుట్టూ అంత మంది ఉండి కూడా ఎందుకలా వాళ్లను వదిలేశారంటూ అసహనానికి గురవుతున్నారు. వాళ్లేమైనా బాంబులు పట్టుకుని తిరుగుతున్నారా..? అలాంటి వాళ్లను నాలుగు దెబ్బలు కొట్టి దారికి తీసుకురావాలని తెలియదా..? అంటూ ప్రశ్నిస్తున్నారు. అంతకు ముందు ఓ యువతి అర్ధనగ్నంగా మెట్రో ఎక్కింది. అభ్యంతరకర డ్రెస్ వేసుకుంది. ఈ వీడియో కూడా అప్పట్లో బాగా వైరల్ అయింది. వివాదానికీ దారి తీసింది. ఉర్ఫీ జావేద్ స్ఫూర్తితో ఇలా చేశానంటూ ఆ యువతి స్టేట్‌మెంట్ కూడా ఇచ్చింది. అయితే...ఈ వీడియోలపై ఢిల్లీ మెట్రో కూడా తీవ్రంగానే స్పందించింది. ప్రోటోకాల్స్‌ని గౌరవించి ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ప్రవర్తించాలని ప్రయాణికులకు తేల్చి చెప్పింది.