News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Delhi excise policy Case: సిసోడియాకు మరో షాక్, బెయిల్ పిటిషన్‌ విచారణను వాయిదా వేసిన కోర్టు

Delhi excise policy Case: సిసోడియా బెయిల్ పిటిషన్‌ విచారణను వాయిదా వేస్తూ ఢిల్లీ కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది.

FOLLOW US: 
Share:

Delhi Excise Policy Case:

ఏప్రిల్ 5న విచారణ..

ఢిల్లీ మాజీ డిప్యుటీ సీఎం మనీశ్ సిసోడియా లిక్కర్ స్కామ్‌లో అరెస్టై ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నారు. ఈడీ అధికారులు రోజూ గంటల పాటు ఆయనను విచారిస్తున్నారు. అటు కోర్టు కూడా ఆయన కస్టడీ గడువును పెంచుతూ పోతోంది. కీలక వివరాలు సిసోడియా చెప్పడం లేదని, విచారణకు సహకరించడం లేదని అధికారులు ఆరోపిస్తున్నారు. సిసోడియా మాత్రం తాను అన్ని ప్రశ్నలకూ సమాధానం చెబుతున్నట్టు వివరిస్తున్నారు. రౌజ్ అవెన్యూ కోర్టులో బెయిల్ పిటిషన్ కూడా వేశారు. దీనిపై విచారణ జరగలేదు. కస్టడీని పొడిగిస్తోందే తప్ప ఏ నిర్ణయమూ తీసుకోవడం లేదు. ఇవాళ ఈ పిటిషన్‌పై విచారించాల్సి ఉన్నా...ఢిల్లీ కోర్టు వాయిదా వేసింది. ఏప్రిల్ 5వ తేదీన విచారిస్తామని వెల్లడించింది. స్పెషల్ జడ్జ్ నాగ్‌పాల్‌ ఈ విచారణను వాయిదా వేశారు. దీనిపై ఈడీ వివరణ ఇచ్చిన తరవాతే తుది నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. పూర్తి వివరాలు సేకరించేందుకు మరి కొంత సమయం కావాలని తెలిపారు. ఓ వైపు విచారణ పూర్తికాకుండానే..సిసోడియాకు బెయిల్ ఇవ్వడం కష్టమే అన్న వాదన వినిపిస్తోంది. ఈ కీలక సమయంలో బెయిల్ ఇస్తే ఆధారాలు తారుమారు చేసే అవకాశముందని సీబీఐ అధికారులు వాదించే అవకాశాలూ ఉన్నాయి. ఇప్పటికే ఆయన మొబైల్‌ ఫోన్లు ధ్వంసం చేయడంపై ఎన్నో అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 

Published at : 25 Mar 2023 12:40 PM (IST) Tags: Manish Sisodia Delhi Excise Policy Case Delhi Excise Policy Rouse Avenue Court Manish Sisodia Bail

ఇవి కూడా చూడండి

Mynampally Hanumantha Rao:  కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న మైనంపల్లి హనుమంతరావు, పార్టీ కండువా కప్పిన ఖర్గే

Mynampally Hanumantha Rao: కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న మైనంపల్లి హనుమంతరావు, పార్టీ కండువా కప్పిన ఖర్గే

CPGET Seat Allotment: సెప్టెంబరు 29న సీపీగెట్‌ సీట్ల కేటాయింపు, ఈ తేదీలోగా జాయిన్ అవ్వాల్సిందే!

CPGET Seat Allotment: సెప్టెంబరు 29న సీపీగెట్‌ సీట్ల కేటాయింపు, ఈ తేదీలోగా జాయిన్ అవ్వాల్సిందే!

TSPSC: 'గ్రూప్‌-1' పరీక్షలో అవకతవకలు జరగలేదు, టీఎస్‌పీఎస్సీ వివరణ

TSPSC: 'గ్రూప్‌-1' పరీక్షలో అవకతవకలు జరగలేదు, టీఎస్‌పీఎస్సీ వివరణ

Byreddy Rajasekar Reddy: భువనేశ్వరితో బైరెడ్డి భేటీ - చంద్రబాబు అరెస్టుపై కీలక వ్యాఖ్యలు

Byreddy Rajasekar Reddy: భువనేశ్వరితో బైరెడ్డి భేటీ - చంద్రబాబు అరెస్టుపై కీలక వ్యాఖ్యలు

TDP News: బుర్రకథల మంత్రి అసెంబ్లీలో కాగ్ నివేదికలు మాట్లాడరా? - టీడీపీ ఎమ్మెల్సీ

TDP News: బుర్రకథల మంత్రి అసెంబ్లీలో కాగ్ నివేదికలు మాట్లాడరా? - టీడీపీ ఎమ్మెల్సీ

టాప్ స్టోరీస్

Adilabad: గణేష్ లడ్డూని కొన్న ముస్లిం యువకుడు - రూ.1.2 లక్షలకు వేలంలో సొంతం

Adilabad: గణేష్ లడ్డూని కొన్న ముస్లిం యువకుడు - రూ.1.2 లక్షలకు వేలంలో సొంతం

BhagavanthKesari: గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా బే - బాలయ్య ఊరమాస్ అవతార్, 'భగవంత్ కేసరి' సర్‌ప్రైజ్ అదిరింది

BhagavanthKesari:  గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా బే - బాలయ్య ఊరమాస్ అవతార్, 'భగవంత్ కేసరి' సర్‌ప్రైజ్ అదిరింది

Kotamreddy : చంద్రబాబు అరెస్ట్‌పై వైసీపీలో మెజార్టీ నేతల వ్యతిరేకత - కోటంరెడ్డి కీలక వ్యాఖ్యలు !

Kotamreddy :  చంద్రబాబు అరెస్ట్‌పై వైసీపీలో మెజార్టీ నేతల వ్యతిరేకత -  కోటంరెడ్డి కీలక వ్యాఖ్యలు !

Khairatabad Ganesh Immersion: గంగమ్మ ఒడికి చేరిన ఖైరతాబాద్ వినాయకుడు - అర్ధరాత్రి ఆఖరి పూజ, వేకువజాము నుంచి యాత్ర

Khairatabad Ganesh Immersion: గంగమ్మ ఒడికి చేరిన ఖైరతాబాద్ వినాయకుడు - అర్ధరాత్రి ఆఖరి పూజ, వేకువజాము నుంచి యాత్ర