Congress President Election: 'మీరు పోటీ చేస్తోంది సామాన్య పదవికి కాదు'- అధ్యక్ష ఎన్నికలపై రాహుల్ రియాక్షన్
Congress President Election: కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ చేసే వారికి రాహుల్ గాంధీ ఓ సలహా ఇచ్చారు.
Congress President Election: 'భారత్ జోడో యాత్ర'లో ఉన్న రాహుల్ గాంధీ.. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ అత్యున్నత పదవికి ఎవరు పోటీ చేసినా అది కేవలం సంస్థాగత పదవి కాదని.. చారిత్రక స్థానమని అర్థం చేసుకోవాలన్నారు.
ఎర్నాకుళంలో మీడియాతో రాహుల్ గాంధీ మాట్లాడారు. కాంగ్రెస్ చీఫ్‌కి ఇవ్వబోయే ఒక సలహా గురించి మీడియా అడిగినప్పుడు.. ఇలా అన్నారు.
#WATCH | Rahul Gandhi, on being asked about a piece of advice he'd give to next Cong chief says, "you're taking on a historic position that defines a particular view of India. Congress chief is an ideological post. You represent a set of ideas, a belief system & vision of India." pic.twitter.com/n4oTOX38HX
— ANI (@ANI) September 22, 2022
పోటీలో లేరు
కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో గాంధీ కుటుంబం నుంచి ఎవరూ పోటీ చేయడం లేదని కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ గురువారం ధ్రువీకరించారు.
పార్టీ అధ్యక్ష పదవి నుంచి సోనియా తప్పుకోనుండటం, బాధ్యతల స్వీకరణకు రాహుల్ మెుగ్గు చూపకపోవడం వంటి పరిణామాల వల్ల ఈ సారి కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి. అయితే ఈ పదవి కోసం ఎవరెవరు పోటీ పడతారనే దానిపై పూర్తి స్పష్టత లేదు. అయితే రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్, తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ అధ్యక్ష పదవికి పోటీ చేస్తామని అయితే క్లారిటీ ఇచ్చారు.
Also Read: Hijab Ban Row: అవన్నీ వద్దు, పాయింటుకు రండి- సహనం కోల్పోతున్నాం: హిజాబ్ వాదనలపై సుప్రీం