News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

కెనడా ప్రధాని చేసిన వ్యాఖ్యలు షాక్‌కి గురి చేశాయి - ట్రూడో ఆరోపణలపై శశి థరూర్ ఫైర్

India Canada Tensions: భారత్‌పై కెనడా ప్రధాని చేసిన ఆరోపణలు షాకింగ్‌గా ఉన్నాయని శశి థరూర్ అన్నారు.

FOLLOW US: 
Share:

India Canada Tensions:

ట్రూడో ఆరోపణలు..

కెనడాలో ఖలిస్థాన్ వేర్పాటు వాది నిజ్జర్ హత్య వెనకాల భారత్‌ హస్తం ఉందని ఆ దేశ ప్రధాని ట్రూడో చేసిన వ్యాఖ్యలపై అంతర్జాతీయంగా దుమారం రేగుతోంది. ఈ ఆరోపణల్ని తీవ్రంగా ఖండించింది భారత్. అనవసరు ఆరోపణలు చేయడం సరికాదని మందలించింది. కానీ...ట్రూడో తీరు మాత్రం మారడం లేదు. దీనిపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే తీవ్రంగా స్పందించింది. ఇప్పుడు ప్రతిపక్షాలూ ఈ విషయంలో కెనడాపై మండి పడుతున్నాయి. భారత్, కెనడా మధ్య ఈ వివాదం అదుపు తప్పకుండా చూసుకోవడం మంచిదని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ అభిప్రాయపడ్డారు. ఇప్పటికిప్పుడు ఈ సమస్యను పరిష్కరించుకోవడం అవసరమని అన్నారు. కెనడా ప్రధాని చేసిన వ్యాఖ్యలు చాలా షాకింగ్‌గా అనిపించాయన్న ఆయన...సాక్ష్యాలు లేకుండా ఇలాంటి ఆరోపణలు చేయడం సరికాదని మండి పడ్డారు. 

"కెనడా ప్రధాని ట్రూడో భారత్‌పై చేసిన వ్యాఖ్యలు చాలా ఆశ్చర్యం కలిగించాయి. అంత బహిరంగంగా భారత్‌పై ఆరోపణలు చేయడం సరికాదు. ఒకవేళ వాళ్ల దగ్గర సాక్ష్యాలు ఉండి ఉంటే కోర్టుకి ఇవ్వాల్సింది. నిందితులకు శిక్ష పడేలా చేయాల్సింది. కానీ ఇలా నిరాధారణ ఆరోపణలు చేయడం సరికాదు. ప్రస్తుతానికి భారత్ కెనడా మధ్య సంబంధాలు రోజురోజుకీ ఉద్రిక్తంగా మారుతున్నాయి. ప్రపంచ దేశాలన్నింటితోనూ మనకి ఆరోగ్యకరమైన మైత్రి ఉండాల్సిన అవసరముంది"

- శశి థరూర్, కాంగ్రెస్ ఎంపీ 

సిక్కులపై ఉగ్రవాద ముద్ర..

కెనడాలో భారతీయుల సంఖ్య ఎక్కువే. వారిలో సిక్కులూ ఉన్నారు. వాళ్లందరిలోనూ భయం మొదలైంది. అటు రాజకీయంగానూ ఇది అనిశ్చితికి దారి తీస్తోంది. అకాలీ దళ్ అధ్యక్షుడు సుక్బీర్ సింగ్‌ కూడా ఈ వివాదంపై అప్రమత్తమయ్యారు. హోం మంత్రి అమిత్‌షాతో భేటీ అవనున్నారు. సిక్కులపై ఉగ్రవాద ముద్ర పడుతోందని, ఇది సమాజానికి తప్పుడు సంకేతాలిస్తోందని అసహనం వ్యక్తం చేశారు. వీలైనంత త్వరగా ఈ సమస్య పరిష్కారమవ్వాలని ఆకాంక్షించారు. 

"ఈ వివాదం భారత్ కెనడా సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. సిక్కులందరూ ఉగ్రవాదులే అన్న తప్పుడు సంకేతాలనూ ఇస్తోంది. దీన్ని కచ్చితంగా ఆపాలి. భారత ప్రభుత్వం, కెనడా ప్రభుత్వం ఈ సమస్యకు పరిష్కారం చూపించాలి. వీలైనంత త్వరగా ఈ వివాదం సద్దుమణిగేలా చొరవ చూపించాలి. దేశ ప్రజలు దీని వల్ల ఇబ్బంది పడకూడదు. ప్రధాని మోదీకి నేను లేఖ రాస్తాను. పరిస్థితులు చేయి జారిపోతే భారత్‌లోని సిక్కులపైనా ఇది ప్రభావం చూపిస్తుంది"

- సుక్బీర్ సింగ్ బాదల్, అకాలీ దళ్ ప్రెసిడెంట్ 

పాకిస్థాన్‌ హస్తం..? 

భారత్, కెనడా మధ్య వివాదం ముదురుతున్న క్రమంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ అల్లర్ల వెనక పాకిస్థాన్ హస్తం కూడా ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు నిఘా వర్గాలు కూడా ఇదే చెబుతున్నాయి. కెనడాలో పాకిస్థాన్‌కి చెందిన ISIతో పాటు ఆ దేశ నిఘా వర్గం కూడా ఉందని...ఎప్పటికప్పుడు పరిస్థితులను గమనిస్తున్నాయని సమాచారం. ఓ చోట రహస్యంగా ఖలిస్థాన్ టెర్రర్ గ్రూప్‌ల చీఫ్‌లతో భేటీ అయినట్టు తెలుస్తోంది. Sikhs for Justice (SFJ) చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నన్ కూడా ఈ మీటింగ్‌కి హాజరయ్యారని నిఘా వర్గాలు వెల్లడించాయి. ఆయనతో పాటు మరి కొందరు కీలక నేతలు హాజరైనట్టు తెలుస్తోంది. అయితే...5 రోజుల క్రితమే ఈ రహస్య సమావేశం జరిగింది. ISI ఏజెంట్స్, ఖలిస్థాన్‌ గ్రూప్‌ల భేటీ అజెండా కూడా తెలిసింది. వీలైనంత వరకూ భారత్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నారట. దీనికే Plan-K అని పేరు కూడా పెట్టుకున్నట్టు సమాచారం. 

Also Read: కెనడాలోని హిందువులంతా జాగ్రత్త, దాడులు జరిగే ప్రమాదముంది - కెనడా ఎంపీ హెచ్చరికలు

Published at : 21 Sep 2023 03:30 PM (IST) Tags: Shahi Tharoor India Canada Tensions India Canada Tension Canada PM Justin Trudeau

ఇవి కూడా చూడండి

Sajjanar Comments: 'మహిళలు సామూహికంగా టూర్ కు వెళ్తామంటే ఫ్రీ బస్ ఉంటుందా.?' - ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సమాధానం ఇదే

Sajjanar Comments: 'మహిళలు సామూహికంగా టూర్ కు వెళ్తామంటే ఫ్రీ బస్ ఉంటుందా.?' - ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సమాధానం ఇదే

ఛత్తీస్‌గఢ్ సీఎంగా మాజీ కేంద్రమంత్రి విష్ణుదేవ సాయి - విశ్వసనీయ వర్గాల వెల్లడి

ఛత్తీస్‌గఢ్ సీఎంగా మాజీ కేంద్రమంత్రి విష్ణుదేవ సాయి - విశ్వసనీయ వర్గాల వెల్లడి

I.N.D.I.A Alliance Meeting: త్వరలోనే I.N.D.I.A కూటమి భేటీ, సీట్‌ షేరింగ్‌పై క్లారిటీ కోసమే!

I.N.D.I.A Alliance Meeting: త్వరలోనే I.N.D.I.A కూటమి భేటీ, సీట్‌ షేరింగ్‌పై క్లారిటీ కోసమే!

American Telugu Association: తెలుగు రాష్ట్రాల్లో ఆటా ఆధ్వర్యంలో 20 రోజులు సేవా కార్యక్రమాలు

American Telugu Association: తెలుగు రాష్ట్రాల్లో ఆటా ఆధ్వర్యంలో 20 రోజులు సేవా కార్యక్రమాలు

Bhatti Vikramarka: 'సంపదను సృష్టించి ప్రజలకు పంచుతాం' - 6 గ్యారెంటీలకు వారంటీ లేదన్న వారికి ప్రజలే బుద్ధి చెప్పారన్న డిప్యూటీ సీఎం భట్టి

Bhatti Vikramarka: 'సంపదను సృష్టించి ప్రజలకు పంచుతాం' - 6 గ్యారెంటీలకు వారంటీ లేదన్న వారికి ప్రజలే బుద్ధి చెప్పారన్న డిప్యూటీ సీఎం భట్టి

టాప్ స్టోరీస్

Guntur: అంబేడ్కర్ విగ్రహం ముందు బట్టలిప్పి అసభ్య ప్రవర్తన! పొన్నూరులో రేగిన దుమారం

Guntur: అంబేడ్కర్ విగ్రహం ముందు బట్టలిప్పి అసభ్య ప్రవర్తన! పొన్నూరులో రేగిన దుమారం

Andhra News: ప్రధాని మోదీకి చంద్రబాబు లేఖ - 'మిగ్ జాం' తుపాను బాధితులను ఆదుకోవాలని వినతి

Andhra News: ప్రధాని మోదీకి చంద్రబాబు లేఖ - 'మిగ్ జాం' తుపాను బాధితులను ఆదుకోవాలని వినతి

Telangana Power Politics : తెలంగాణలో విద్యుత్ అప్పుల రాజకీయాలు - సంక్షోభాన్ని కేసీఆర్ సర్కార్ దాచి పెట్టిందా?

Telangana Power Politics :  తెలంగాణలో విద్యుత్ అప్పుల రాజకీయాలు -  సంక్షోభాన్ని కేసీఆర్ సర్కార్ దాచి పెట్టిందా?

Singareni Elections: సింగరేణి ఎన్నికల కోసం రాహుల్ గాంధీ, పోలింగ్ తేదీ ఖరారు - మంత్రి వెల్లడి

Singareni Elections: సింగరేణి ఎన్నికల కోసం రాహుల్ గాంధీ, పోలింగ్ తేదీ ఖరారు - మంత్రి వెల్లడి