ఎన్నికల ముందు కాంగ్రెస్‌కి మరో షాక్, పార్టీ బ్యాంక్ ఖాతాల్ని ఫ్రీజ్ చేసిన ఐటీశాఖ
Congress Bank Accounts: పార్టీ బ్యాంక్ ఖాతాల్ని ఐటీ శాఖ స్తంభింపజేసిందని కాంగ్రెస్ వెల్లడించింది.
Congress Bank Accounts Frozen: తమ బ్యాంక్ అకౌంట్‌లన్నీ ఫ్రీజ్ అయిపోయాయంటూ కాంగ్రెస్ సంచలన ప్రకటన చేసింది. పార్టీకి సంబంధించిన అన్ని బ్యాంక్ ఖాతాలు స్తంభించిపోయాయని వెల్లడించింది. వీటిలో Youth Congress అకౌంట్ కూడా ఉందని తెలిపింది. ఐటీ డిపార్ట్‌మెంట్ ఈ ఖాతాల్ని నిలిపివేసిందని స్పష్టం చేసింది. పార్టీ ప్రతినిధి అజయ్ మకేన్ ఈ విషయం వెల్లడించారు. ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తున్నారంటూ మండి పడ్డారు. అకౌంట్‌లు ఫ్రీజ్ చేయడమే కాకుండా రూ.210 కోట్ల పన్ను కట్టాలని ఐటీ డిమాండ్ చేస్తోందని తెలిపారు. ఇది రాజకీయ కక్షేనని ఆరోపించింది. కావాలనే కుట్రపూరితంగా ఇలాంటివి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
"దేశంలో ప్రజాస్వామ్యం అనేదే లేకుండా పోయింది. కేవలం ఒకటే పార్టీ మొత్తం దేశాన్ని నియంత్రిస్తోంది. ప్రతిపక్షాన్ని పూర్తిగా అణిచివేస్తున్నారు. దీనిపై మాకు న్యాయం జరగాల్సిందే. మీడియాతో పాటు ప్రజల్నీ మాకు అండగా ఉండాలని కోరుకుంటున్నాం"
- అజయ్ మకేన్, కాంగ్రెస్ ప్రతినిధి
#WATCH | Congress Treasurer Ajay Maken says "Right now we don't have any money to spend, to pay electricity bills, to pay salaries to our employees. Everything will be impacted, not only Nyay Yatra but all political activities will be impacted..." pic.twitter.com/61xILbtuVZ
— ANI (@ANI) February 16, 2024
ఇప్పటికే న్యాయపోరాటం మొదలు పెట్టింది కాంగ్రెస్ పార్టీ. లీగల్ యాక్షన్ తీసుకున్నట్టు వెల్లడించింది. ప్రస్తుతం ఈ కేసు ఇన్‌కమ్ ట్యాక్స్ ట్రిబ్యునల్‌లో ఉంది. విచారణ పెండింగ్‌లో ఉండడం వల్ల పూర్తి వివరాలు బయటపెట్టలేకపోతున్నామని అజయ్ మకేన్ స్పష్టం చేశారు. పార్టీ తరపున అడ్వకేట్ వివేక్ తన్‌ఖా వాదిస్తున్నారు. అన్ని ఖాతాల్నీ స్తంభింపజేశారని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ తరపున ఎలాంటి చెక్కులను తీసుకోవద్దని ఐటీశాఖ బ్యాంక్‌లకు ఆదేశాలిచ్చినట్టు వివరించారు.
#WATCH | Indian Youth Congress holds protest against BJP Government for the freezing of bank accounts of Congress party and over electoral bonds, outside IYC office in Delhi. pic.twitter.com/9P9QgMM2zL
— ANI (@ANI) February 16, 2024