అన్వేషించండి

Ghost in Gym: జిమ్‌లో దెయ్యం.. అతడి కాలు పట్టుకుని ఈడ్చేసింది, ఈ వీడియో చూస్తే హార్ట్‌ బీట్‌ పెరుగుద్దీ.

ఒంటరిగా జిమ్‌కు వెళ్తున్నారా? జాగ్రత్త.. దెయ్యాలు కూడా మీతోపాటు కసరత్తులు చేస్తూ కనిపించవచ్చు. నమ్మబుద్ధి కావడం లేదా? ఈ వీడియో చూడాల్సిందే.

ఎంత కండలు తిరిగిన వీరుడైనా దెయ్యాన్ని చూస్తే చాలు.. హడలిపోతాడంటే మీరు నమ్ముతారా? అయితే, మీరు ఈ వీడియో చూడాల్సిందే. రోజూ జిమ్‌కు వచ్చి కండలు పెంచే ఓ వ్యక్తి.. ఓ కనిపించని శక్తి బెంబేలెత్తించింది. జిమ్ నుంచి బయటకు పరుగులు పెట్టించింది. జీవితంలో జిమ్ పేరు వింటే కసరత్తులు చేయకుండానే చెమటలు పట్టేంతగా భయపెట్టింది. ఇదంతా ఒట్టి మాటలుగా చెప్పకుంటే పెద్దగా నమ్మకం కలిగేది కాదు. కానీ, అదంతా జిమ్‌లో సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

కొలంబియాలో ఖాళీగా ఉన్న ఓ జిమ్‌లో వ్యాయామం చేసేందుకు వచ్చిన ఓ వ్యక్తికి ఎదురైన చేదు అనుభవం ఇది. అతడు జిమ్‌లోకి ఎంట్రీ ఇచ్చే సమయానికే అక్కడ భిన్నమైన వాతావరణం ఉంది. జిమ్‌లోని వస్తువులు ఎవరి ప్రమేయం లేకుండా వాటికవే కదులుతున్నాయి. మనుషులు లేకుండా కొన్ని యంత్రాలు వాటికవే పనిచేస్తున్నాయి. అయితే, ఆ వ్యక్తి వాటిని పెద్దగా పట్టించుకోలేదు. అదే సమయంలో ఓ బంతి దానికదే కదులుతూ అతడి వద్దకు వచ్చింది. దీంతో జిమ్‌లో ఏదో తేడాగా ఉందనే భయంతో తన బ్యాగ్ సర్దుకుని బయటకు పరిగెట్టేందుకు ప్రయత్నించాడు. అంతే.. అకస్మాత్తుగా ఏదో అతడి కుడి కాలిని అమాంతంగా పైకి లేపింది. ఆ తర్వాత అతడిని లాక్కెళ్లింది. దీంతో అతడు మరింత హడలిపోయాడు. ఒక్క ఉదుటున బయటకు పరుగులు పెట్టాడు. ఈ వీడియోను చూస్తే మీరు కూడా హడలిపోతారు.

వీడియో: 
 

ఇటీవల నాగపూర్‌లోని శతాబ్దినగర్ ప్రాంతంలో కూడా దెయ్యం కనిపించిందనే వదంతలు వ్యాపించాయి. రాజేంద్ర మెష్రామ్ అనే వ్యక్తి ఇంటికి అమర్చిన సీసీటీవీ కెమేరాకు చిక్కిన ఓ వింత ఆకారమే ఇందుకు కారణం. తెల్ల రంగులో.. గాల్లో తేలుతూ పరుగులు పెడుతున్నట్లు కనిపించిన ఆ ఆకారం చూసి.. తప్పకుండా అది దెయ్యమేనని భావిస్తున్నారు. ఆ వింత ఆకారం రాజేంద్ర ఇంటికి సమీపంలో ఉన్న ఓ పాడుబడిన ఇంట్లోకి పరుగులు పెట్టినట్లుగా ఆ వీడియోలో ఉంది. దీంతో స్థానికులు కూడా అది తప్పకుండా దెయ్యమే కావచ్చని, తమకు ఆ ఇంటి నుంచి ఎవరో ఏడుస్తున్నట్లు వినిపిస్తుంటుందని, ఒక్కోసారి వింత వింత శబ్దాలు వస్తుంటాయని తెలుపుతున్నారు. ఇది వాస్తవమా కాదా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. 

Also Read: ‘ఫస్ట్‌ నైట్’ బెడ్‌ను రోజా పూలతోనే అలంకరించాలట.. ఎందుకో తెలుసా?

కొద్ది రోజుల కిందట స్కాట్‌ల్యాండ్‌లోని గ్లాస్గో సమీపంలోని బారోఫీల్డ్‌లో నివసిస్తున్న మాక్సిన్ హ్యూస్ అనే మహిళ‌ను తన ఇంట్లోని సీసీటీవీ కెమెరాకు చిక్కిన వింత ఆకారం వీడియో కూడా వైరల్ అయ్యింది. ఇంటి గార్డెన్‌లో పార్క్ చేసిన కారవాన్ వద్ద నల్ల రంగులో ఉన్న ఓ వింత ఆకారం చక్కర్లు కొడుతూ కనిపించింది. అది గాల్లో ఎగురుతున్న ఆ ఆకారం తప్పకుండా ఆత్మ కావచ్చనే భయంతో ఆమె మతాధికారిని సంప్రదించింది. ఇదివరకు కూడా తాను అలాంటి నీడలను చూశానని మ్యాక్సిన్ తెలిపింది. తన పిల్లలు గార్డెన్‌లో ఆడుకుంటున్నప్పుడు వారి చుట్టూ ఆ నీడ తిరిగేదని పేర్కొంది. 

Also Read: విచిత్రం.. ఇతడికి కడుపు లేదు, పేగుల్లేవు.. అయినా బతికేస్తున్నాడు!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YS Sharmila: అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
Telangana Adani Investments: కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
CM Chandrababu: సభ్యత్వ నమోదులో టాప్ 10 నేతలకు చంద్రబాబు అభినందన, మంత్రి లోకేష్‌కు ప్రత్యేకంగా
సభ్యత్వ నమోదులో టాప్ 10 నేతలకు చంద్రబాబు అభినందన, మంత్రి లోకేష్‌కు ప్రత్యేకంగా
PAN Card Vs PAN 2.0: పాన్ కార్డు వర్సెస్ పాన్ 2.0 - రెండిటి మధ్య తేడా ఏంటి? - కొత్త కార్డు వల్ల లాభాలేంటి?
పాన్ కార్డు వర్సెస్ పాన్ 2.0 - రెండిటి మధ్య తేడా ఏంటి? - కొత్త కార్డు వల్ల లాభాలేంటి?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

గ్రామస్థుల భారీ ఆందోళన రోడ్డుపైనే వంట.. RDO నిర్బంధం!హైవే పక్కనే పెద్దపులి తిష్ట, జడుసుకున్న వాహనదారులుఇంకా చల్లారని  రాకాసి మంటలు, కుప్పకూలిపోయిన భవనంజీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం, ఆ తప్పు వల్లే దట్టంగా మంటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Sharmila: అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
Telangana Adani Investments: కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
CM Chandrababu: సభ్యత్వ నమోదులో టాప్ 10 నేతలకు చంద్రబాబు అభినందన, మంత్రి లోకేష్‌కు ప్రత్యేకంగా
సభ్యత్వ నమోదులో టాప్ 10 నేతలకు చంద్రబాబు అభినందన, మంత్రి లోకేష్‌కు ప్రత్యేకంగా
PAN Card Vs PAN 2.0: పాన్ కార్డు వర్సెస్ పాన్ 2.0 - రెండిటి మధ్య తేడా ఏంటి? - కొత్త కార్డు వల్ల లాభాలేంటి?
పాన్ కార్డు వర్సెస్ పాన్ 2.0 - రెండిటి మధ్య తేడా ఏంటి? - కొత్త కార్డు వల్ల లాభాలేంటి?
Maharastra: నా వల్లనే ప్రాబ్లం అయితే సీఎం పదవి అక్కర్లేదు - ప్రధానికి చెప్పానన్న షిండే - వీడనున్న మహా చిక్కుముడి !
నా వల్లనే ప్రాబ్లం అయితే సీఎం పదవి అక్కర్లేదు - ప్రధానికి చెప్పానన్న షిండే - వీడనున్న మహా చిక్కుముడి !
Dilawarpur Latest News: ఇథనాల్‌ పరిశ్రమ వివాదంలో బిగ్‌ అప్‌డేట్‌- పనులు ఆపాలని కలెక్టర్ ఆదేశం- ప్రభుత్వానికి కీలక నివేదిక
ఇథనాల్‌ పరిశ్రమ వివాదంలో బిగ్‌ అప్‌డేట్‌- పనులు ఆపాలని కలెక్టర్ ఆదేశం- ప్రభుత్వానికి కీలక నివేదిక
Vizag News: విశాఖ జిల్లా పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం- ఒకరు మృతి- విషయాన్ని దాచి పెట్టిన యాజమాన్యం
విశాఖ జిల్లా పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం- ఒకరు మృతి- విషయాన్ని దాచి పెట్టిన యాజమాన్యం
Mahindra XEV 9e: సింగిల్ ఛార్జ్‌తో 656 కిలోమీటర్లు - మోస్ట్ అవైటెడ్ మహీంద్రా ఎలక్ట్రిక్ కారు వచ్చేసింది!
సింగిల్ ఛార్జ్‌తో 656 కిలోమీటర్లు - మోస్ట్ అవైటెడ్ మహీంద్రా ఎలక్ట్రిక్ కారు వచ్చేసింది!
Embed widget