By: ABP Desam | Updated at : 06 Dec 2022 12:46 PM (IST)
Edited By: jyothi
పలమనేరులో ఫ్యామిలీతో రోడ్డుపై మకాం వేసిన గజరాజులు, భయం గుప్పిట్లో ప్రజలు
Elephants in Palamaneru: చిత్తూరు జిల్లా పలమనేరు రూరల్ మండలంలోని మొసలిమడుగు గ్రామ సమీపంలో గుడియాత్తం రోడ్డుపై ఏనుగుల గుంపు మకాం వేసింది. మొత్తం 22 ఏనుగులు.. రోడ్డు పక్కనున్న సోలార్ కంచెను విరగొట్టి రోడ్డుపైకి వచ్చేశాయి. దీంతో అటు అడవిలోకి వెళ్లలేక అటు ఇటూ తిరుగుతూ రోడ్డుపై ఉండిపోయాయి. గజరాజులు రోడ్డుపై మకాం వేయడంతో గంటల తరబడి వాహనాల రాకపోకలు స్తంభించాయి. అటవీశాఖ అధికారులు ఏనుగుల గుంపును అడవిలోకి తరమడానికి కృషి చేస్తున్నారు. ఏనుగులు ఎక్కడ తమ గ్రామాల్లోకి ప్రవేశిస్తాయోనని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భయం భయంగా బయటకు రాకుండా ఇంట్లోనే ఉంటున్నారు.
పదిరోజుల క్రితం కూడా 15 ఏనుగుల గుంపు హల్ చల్..
చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం బైరెడ్డిపల్లి మండలం కడతట్ల పల్లి గ్రామ సమీపంలోని బోడెనేగట్టు వద్ద గల పంట పొలాల్లో ఓ ఏనుగుల గుంపు సంచరించింది. మొత్తం 15 ఏనుగులు సమీలా, రాజేష్ పంట పొలాన్ని తొక్కి నాశనం చేశాయి. గురువారం రోజు వేకువజామున ఏనుగులు వీరంగం సృష్టించాయి. మొత్తం ఐదు కొబ్బరి చెట్లు, ఒక ఎకరా వరి పంట పొలాన్ని తొక్కిసలాటలో పూర్తిగా ధ్వంసం చేశాయి. విషయం తెలుసుకున్న రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికొచ్చే సమయంలో ఏనుగులు పాడు చేయడం బాధాకరం అంటున్నారు. అటవీ శాఖ అధికారులు ఎన్ని అడ్డుకట్టులు వేసినప్పటికీ... గజరాజుల దాడులు మాత్రం ఆగడం లేదని వాపోతున్నారు. నష్టపోయిన రైతన్నలకు నష్ట పరిహారం అందించిన పాపాన కూడా పొలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నష్టం వాటిల్లినప్పుడు వస్తున్న అధికారులు... సంఘటనా స్థలంలో సాయం చేస్తామని హామీలు ఇవ్వడం ఆ తర్వాత కనిపించకుండా పోవడం పరిపాటిగా మారిందంటూ అటవీ సరిహద్దు ప్రాంతాల రైతన్నలు వాపోతున్నారు.
గజరాజుల దాడిలో నష్టపోయిన రైతన్నలు కార్యాలయాల చుట్టు తిరిగి కాళ్లు అరిగాయే తప్ప... ప్రభుత్వ నుంచి పైసా కూడా అందలేదని రైతన్నలు మొర పెట్టుకుంటున్నారు. అటవీ సరిహద్దు గ్రామాల శివారున ఏనుగులు కనీసం నెలలో మూడు సార్లు దర్శనం ఇస్తున్నాయి. ఏనుగుల నుండి తమ పంట పొలాలకు, తమ ప్రాణాలకు రక్షణ కల్పించాలని రైతులు కోరుతున్నారు.
మన్యం జిల్లాలో ఏనుగుల మంద బీభత్సం...
పార్వతీపురం మన్యం జిల్లా బలిజిపేట మండలంలో నెల రోజుల క్రితం ఏనుగుల మంద బీభత్సం సృష్టించింది. గంగులువాని చెరువు దగ్గర ఉన్న 2 ఆవులను, ఒక లేగ దూడను ఏనుగులు తొక్కి చంపాయి. మరోవైపు మిర్తివలసలోనూ ఆవుల మందపై ఏనుగులు దాడి చేశాయి. దీంతో ఏనుగుల బీభత్సంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. పంట పొలాలకు వెళ్లాలంటే భయబాంత్రులకు గురవుతున్నామని రైతులు వాపోతున్నారు. గత నాలుగు ఏళ్లుగా మన్యం వాసులను తీవ్ర ఇబ్బందులు గురి చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏనుగుల తరలింపులో అధికారులు, ప్రజా ప్రతినిధులు అలసత్వం వహిస్తున్నారని మండిపడ్డారు. ఏనుగుల దాడిలో వేల ఎకరాలు పంట నష్టం వాటిల్లిందని, మూగ జీవాలు కూడా ప్రాణాలు కోల్పోతున్నాయని ఇప్పటికైనా అధికారులు స్పందించి ఏనుగులను తరలించాలని కోరుతున్నారు.
Delhi liquor scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్లో సంచలన మలుపు, ఛార్జ్షీట్లో కేజ్రీవాల్ పేరు
ఏవండోయ్ ఇది విన్నారా? 'జస్ట్ ఫ్రెండ్స్' అన్నందుకు మహిళపై రూ.24 కోట్లు పరువు నష్టం కేసు వేశాడు!
Jagan focus on Muslims : మైనార్టీలపై జగన్ ఫోకస్, త్వరలో భారీ బహిరంగ సభకు ప్లాన్!
Bullet Train Project: 2026 నాటికి భారత్లో బులెట్ ట్రైన్, మోదీ స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు - ABPతో రైల్వే మంత్రి
Sajjala Rama Krishna Reddy : ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చంద్రబాబు స్కీం, కోటంరెడ్డి పాత్రధారి మాత్రమే - సజ్జల
Perni Nani On Kotamreddy : జగన్ పిచ్చి మారాజు అందర్నీ నమ్మేస్తారు, కోటంరెడ్డి నమ్మక ద్రోహం చేశారు - పేర్ని నాని
PROJECT-K 2 Parts | ప్రాజెక్ట్-K పై నమ్మకంతో Prabhas రిస్క్ చేస్తున్నారా..?| ABP Desam
Unstoppable 2 Finale Episode : పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ దెబ్బకు ఆహా ఓటీటీ పని చేస్తుందా?
ఇమేజ్ డ్యామేజ్ చేస్తే డొక్క పగలదీస్తాం- దుట్టా, యార్లగడ్డకు వంశీ స్ట్రాంగ్ వార్నింగ్!