అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source:  Poll of Polls)

China Covid Cases: చైనాలో కరోనా బీభత్సం- వచ్చే 3 నెలల్లో లక్షల్లో మరణాలు!

China Covid Cases: చైనా సర్కార్.. ఒకేసారి ఆంక్షలు ఎత్తేయడంతో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి.

China Covid Cases: చైనాలో కరోనా నిబంధనలను ఎత్తేసిన తర్వాత పరిస్థితులు రోజురోజుకు క్షీణిస్తున్నాయి. పెరుగుతున్న కేసులతో చైనాలోని ఆసుపత్రులు కిటకిటలడుతున్నాయి. వచ్చే 90 రోజుల్లో చైనాలోని 60 శాతానికి పైగా ప్రజలకు కరోనా సోకే ప్రమాదం ఉందని ఎపిడెమియాలజిస్ట్ ఎరిక్ ఫెఇగ్ల్ -డింగ్ అంచనా వేశారు.

ఒమిక్రాన్

ఎరిక్ సోమవారం ట్విట్టర్‌లో ఒమిక్రాన్ వేరియంట్ గురించి అనేక విషయాలు వెల్లడించారు. ఈ ఒమిక్రాన్ వేరియంట్ ఆర్ విలువ 16గా ఉందని.. అంటే వ్యాధి సోకిన వ్యక్తి నుంచి 16 మందికి వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉందని తెలిపారు.

" చైనాలో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. చైనాలో ఉన్న ప్రస్తుత ఒమిక్రాన్ వేరియంట్ ఆర్ విలువ 16గా ఉంది. వ్యాధి సోకిన ఒక్క వ్యక్తి వల్ల 16 మందికి వైరస్ సోకే ప్రమాదం ఉంది. మీరు చేయాల్సిన పని ఒక్కటే.. మీరు, మీ కుటుంబం, మీ పొరుగువారు అంతా.. బైవాలేంట్ వ్యాక్సిన్ తీసుకోండి. మిమ్మల్ని మీరు రక్షించుకోండి. ది చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ లక్ష్యం ఏంటంటే.. ఎవరైతే రోగాల బారిన పడాలి అనుకుంటున్నారో పడని, ఎవరైతే మరణించాలి అనుకుంటున్నారో మరణించని అని అనుకుంటుంది. "
-                                   ఎరిక్ ఫెఇగ్ల్- డింగ్, ఎపిడెమియాలజిస్ట్

90 రోజుల్లో

ఎపిడెమియాలజిస్ట్ అంచనా ప్రకారం 60 శాతానికి పైగా చైనా ప్రజలు, అంటే 10 శాతం భూ జనాభా వచ్చే 90 రోజుల్లో వైరస్‌కు గురవుతారు. మరణాల సంఖ్య మిలియన్లలోనే ఉంటుందని తెలిపారు. ఈ సోమవారం చైనా మరో 5 కరోనా మరణాలు సంభవించాయి. దేశంలో మరణాల సంఖ్య 5,242 కు చేరింది అని జాతీయ ఆరోగ్య కమిషన్ పెర్కొనట్టు రాయిటర్స్ తెలిపింది .డిసెంబర్ 19న దేశంలో 2,722 కొత్త కేసులు నమోదవ్వగా ,అంతకు ముందు రోజు 1,995 కేసులు నమోదయ్యాయి.

చైనా తన కరోనా కట్టడి నిబంధనలను ఇలానే సడలిస్తే మిలియన్ కంటే ఎక్కువ మంది మరణించే ప్రమాదం ఉందని ఓ అమెరికా సంస్థ పేర్కొంది. ఇన్స్టిట్యూట్ అఫ్ హెల్త్ మేట్రిక్స్ అండ్ ఎవల్యువేషన్(ఐఎచ్ఎంఇ) అనే సంస్థ తెలిపిన వివరాల ప్రకారం 2023 ఏప్రిల్ 1 వరకు చైనాలో 3,22,000 కరోనా మరణాలు సంభవించోచ్చని తెలిపింది.

ఎత్తేసింది

ప్రజలు ఒక నెలపాటు పెద్ద ఎత్తున నిరసనలు తెలపడంతో చైనా తన జీరో కొవిడ్ విధానాన్ని ఎత్తివేసింది. నిబంధనలు ఎత్తివేయడంతో దేశంలో కరోనా కేసులు పెద్ద ఎత్తున పెరిగాయి. చైనా రాజధాని అంతా వైరస్ వ్యాపించింది. అకస్మాతుగా ఆంక్షలు సడలించడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది.

Also Read: Elon Musk Will Resign: ట్విట్టర్ సీఈవో పదవి నుంచి తప్పుకోవడానికి ఎలన్ మస్క్ రెడీ!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Maharashtra Exit Poll 2024: మహారాష్ట్రలో అధికారం వారిదే - ఎగ్జిట్ పోల్స్‌లో ఆ కూటమిదే హవా, ఎవరికి ఎన్ని సీట్లు రానున్నాయి!
మహారాష్ట్రలో అధికారం వారిదే - ఎగ్జిట్ పోల్స్‌లో ఆ కూటమిదే హవా, ఎవరికి ఎన్ని సీట్లు రానున్నాయి!
Jharkhand Exit Poll 2024: జార్ఖండ్ ఎన్నికల్లో గెలుపెవరిది? ఎన్డీయేకు కాంగ్రెస్ కూటమి షాకిస్తుందా? ఎగ్జిట్ పోల్ రిజల్ట్
జార్ఖండ్ ఎన్నికల్లో గెలుపెవరిది? ఎన్డీయేకు కాంగ్రెస్ కూటమి షాకిస్తుందా? ఎగ్జిట్ పోల్ రిజల్ట్
Jagan On Balakrishna: షర్మిలపై బాలకృష్ణ తప్పుడు ప్రచారం చేయించారు - జగన్ సంచలన ఆరోపణలు
షర్మిలపై బాలకృష్ణ తప్పుడు ప్రచారం చేయించారు - జగన్ సంచలన ఆరోపణలు
Telangana News: రాజన్న సిరిసిల్లలో పలు అభివృద్ధి పనులకు రేవంత్ రెడ్డి శ్రీకారం, వేటికి ఎంత ఖర్చు చేస్తున్నారంటే!
రాజన్న సిరిసిల్లలో పలు అభివృద్ధి పనులకు రేవంత్ రెడ్డి శ్రీకారం, వేటికి ఎంత ఖర్చు చేస్తున్నారంటే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అరటిపండు రాకెట్ కూలిపోయింది, ట్రంప్ ముందు పరువు పోయిందిగామెగాస్టార్ కోసం..  కలిసిన మమ్ముట్టి-మోహన్ లాల్ టీమ్స్ఏఆర్ రెహమాన్ విడాకులు, 29 ఏళ్ల బంధానికి ముగింపుMarquee players list IPL 2025 Auction | ఐపీఎల్ వేలంలో ఫ్రాంచైజీల చూపు వీరి మీదే | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Maharashtra Exit Poll 2024: మహారాష్ట్రలో అధికారం వారిదే - ఎగ్జిట్ పోల్స్‌లో ఆ కూటమిదే హవా, ఎవరికి ఎన్ని సీట్లు రానున్నాయి!
మహారాష్ట్రలో అధికారం వారిదే - ఎగ్జిట్ పోల్స్‌లో ఆ కూటమిదే హవా, ఎవరికి ఎన్ని సీట్లు రానున్నాయి!
Jharkhand Exit Poll 2024: జార్ఖండ్ ఎన్నికల్లో గెలుపెవరిది? ఎన్డీయేకు కాంగ్రెస్ కూటమి షాకిస్తుందా? ఎగ్జిట్ పోల్ రిజల్ట్
జార్ఖండ్ ఎన్నికల్లో గెలుపెవరిది? ఎన్డీయేకు కాంగ్రెస్ కూటమి షాకిస్తుందా? ఎగ్జిట్ పోల్ రిజల్ట్
Jagan On Balakrishna: షర్మిలపై బాలకృష్ణ తప్పుడు ప్రచారం చేయించారు - జగన్ సంచలన ఆరోపణలు
షర్మిలపై బాలకృష్ణ తప్పుడు ప్రచారం చేయించారు - జగన్ సంచలన ఆరోపణలు
Telangana News: రాజన్న సిరిసిల్లలో పలు అభివృద్ధి పనులకు రేవంత్ రెడ్డి శ్రీకారం, వేటికి ఎంత ఖర్చు చేస్తున్నారంటే!
రాజన్న సిరిసిల్లలో పలు అభివృద్ధి పనులకు రేవంత్ రెడ్డి శ్రీకారం, వేటికి ఎంత ఖర్చు చేస్తున్నారంటే!
Pawan Kalyan In Assembly: ఐదేళ్లే కాదు మరో పదేళ్లు చంద్రబాబు సీఎం - అసెంబ్లీలో పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు
ఐదేళ్లే కాదు మరో పదేళ్లు చంద్రబాబు సీఎం - అసెంబ్లీలో పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు
Tirumala News: సీనియర్ సిటిజన్లకు టీటీడీ గుడ్ న్యూస్ - ఇలా చేస్తే సకల సౌకర్యాలతో శ్రీవారి దర్శనం
సీనియర్ సిటిజన్లకు టీటీడీ గుడ్ న్యూస్ - ఇలా చేస్తే సకల సౌకర్యాలతో శ్రీవారి దర్శనం
Ram Gopal Varma: దర్శకుడు ఆర్జీవీకి మరోసారి పోలీసుల నోటీసులు - ఈ నెల 25న విచారణకు రావాలని ఆదేశం
దర్శకుడు ఆర్జీవీకి మరోసారి పోలీసుల నోటీసులు - ఈ నెల 25న విచారణకు రావాలని ఆదేశం
Game Changer Pre Release Event: కాకినాడలో 'గేమ్‌ ఛేంజర్‌' ప్రీ రిలీజ్ ఈవెంట్‌ - ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్న రామ్‌ చరణ్‌
కాకినాడలో 'గేమ్‌ ఛేంజర్‌' ప్రీ రిలీజ్ ఈవెంట్‌ - ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్న రామ్‌ చరణ్‌
Embed widget