అన్వేషించండి

Chhawla Gang Rape Case: గ్యాంగ్ రేప్ కేసులో సుప్రీం సంచలన తీర్పు- ముగ్గురికి మరణశిక్ష రద్దు!

Chhawla Gang Rape Case: చావ్లా గ్యాంగ్ రేప్ కేసులో ముగ్గురు దోషులకు మరణ శిక్షను రద్దు చేస్తూ సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది.

Chhawla Gang Rape Case: 2012 చావ్లా సామూహిక హత్యాచారం కేసులో సుప్రీం కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఈ కేసులో ముగ్గురు దోషులకు సుప్రీం కోర్టు ఊరటనిచ్చింది. ట్రయల్ కోర్టు, హైకోర్టు ఇచ్చిన తీర్పును తోసిపుచ్చి.. వారికి మరణ శిక్షను రద్దు చేసింది. ఈ మేరకు సీజేఐ జస్టిస్ యూయూ లలిత్ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు వెలువరించింది. 

ఇదీ కేసు

2012 ఫిబ్రవరిలో ఈ దారుణ ఘటన జరిగింది. ఫిబ్రవరి 9న దిల్లీ కుతుబ్‌ విహార్‌ వద్ద గురుగావ్‌ ఆఫీస్‌ నుంచి ఇంటికి వస్తున్న సమయంలో కారులో వచ్చిన దుండగులు 19 ఏళ్ల యువతిని ఎత్తుకెళ్లారు. మూడు రోజుల తర్వాత  హరియాణా రేవారి జిల్లా రోధాయి గ్రామ శివారులో సదరు యువతి మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో కనబడటం కలకలం రేపింది.

ఈ మృతదేహాన్ని చూసి పోలీసులే అవాక్కయ్యారు. కారులోని పనిముట్లు, కుండపెంకులతో ఆమె జననాంగాలను ఛిద్రం చేసి ఘోరంగా హింసించి చంపారు దుండగులు. ఆమె ముఖంపై యాసిడ్ పోశారు. ఈ కిరాతకం దేశవ్యాప్త చర్చకు దారి తీసింది. బాధితురాలిపై సామూహిక అత్యాచారం జరిగిందని గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని ఉత్తరాఖండ్‌కు చెందిన ముగ్గురు నిందితులను అరెస్ట్‌ చేశారు.

మరణశిక్ష 

2014 ఫిబ్రవరిలో దిల్లీ కోర్టు నిందితులు ముగ్గురిని దోషులుగా పేర్కొంటూ మరణ శిక్షను ఖరారు  చేసింది. ఈ తీర్పుపై వీళ్లు.. దిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. అయితే అదే ఏడాది ఆగష్టు 26న దిల్లీ హైకోర్టు మరణ శిక్షను సమర్థిస్తూ తీర్పు వెల్లడించింది. 

సుప్రీం

అయితే ఈ తీర్పుపై దోషులు.. సుప్రీం కోర్టును ఆశ్రయించారు. శిక్షను తగ్గించాలంటూ దోషుల తరపు న్యాయవాదులు కోర్టును అభ్యర్థించారు. వాళ్ల వయసు, కుటుంబ నేపథ్యాలు, గత చరిత్రలను పరిగణనలోకి తీసుకోవాలని కోర్టును కోరారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం ముగ్గురు దోషులను నిర్దోషులుగా ప్రకటించింది.

తీర్పు సమయంలో కోర్టు హాల్‌లో ఉద్వేగపూరిత వాతావరణం నెలకొంది. తీర్పు చదివే సమయంలో బాధితురాలి తండ్రి చేతులు జోడించి నిల్చోగా సీజేఐ కీలక వ్యాఖ్యలు చేశారు. బాధితురాలి తండ్రి బాధను తాను అర్థం చేసుకోగలనని, కానీ వాస్తవాలు, సాక్ష్యాధారాలపైనే  తీర్పు ఉంటుందని సీజేఐ అన్నారు. సెంటిమెంట్లను పరిగణనలోకి తీసుకుంటే కేసు తప్పదారి పట్టే అవకాశం ఉందని, ఆ ముగ్గురిని నిర్దోషులుగా ప్రకటించారు.

Also Read: Mining Lease Case: సీఎం హేమంత్ సొరేన్‌కు సుప్రీం కోర్టులో బిగ్ రిలీఫ్

టాప్ హెడ్ లైన్స్

Shami Snub Drama: భువీని ఆద‌రించి, షమీని ఎందుకు విస్మ‌రించారు..! కివీస్ టూర్ లో వెటరన్ పేసర్ కు సెలెక్టర్ల మొండిచేయి..
భువీని ఆద‌రించి, షమీని ఎందుకు విస్మ‌రించారు..! కివీస్ టూర్ లో వెటరన్ పేసర్ కు సెలెక్టర్ల మొండిచేయి, రవిశాస్త్రి సంచలన కామెంట్స్
Elon Musk: అమెరికాలోని ప్రతి బిడ్డకు స్పేస్‌ఎక్స్ షేరు.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన
అమెరికాలోని ప్రతి బిడ్డకు స్పేస్‌ఎక్స్ షేరు.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన
Telangana on El Nino Conditions: ఎల్‌నినో పరిస్థితులపై తెలంగాణ అప్రమత్తం.. కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు
ఎల్‌నినో పరిస్థితులపై తెలంగాణ అప్రమత్తం.. కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు
AP Local Body Elections: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు- హైకోర్టులో వైసీపీకి మరో ఎదురుదెబ్బ
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు- హైకోర్టులో వైసీపీకి మరో ఎదురుదెబ్బ

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana on El Nino Conditions: ఎల్‌నినో పరిస్థితులపై తెలంగాణ అప్రమత్తం.. కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు
ఎల్‌నినో పరిస్థితులపై తెలంగాణ అప్రమత్తం.. కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు
Deputy CM Pawan Kalyan: పల్లె పండుగ రోడ్డు తవ్వేసిన వైసీపీ నేతలపై నాన్ బెయిలబుల్ కేసులకు పవన్ కళ్యాణ్ ఆదేశం
పల్లె పండుగ రోడ్డు తవ్వేసిన వైసీపీ నేతలపై నాన్ బెయిలబుల్ కేసులకు పవన్ కళ్యాణ్ ఆదేశం
Telangana Congress: గాంధీ, నెహ్రూ చరిత్రను చెరిపివేసే కుట్ర.. దేశం కోసం బీజేపీ చుక్క రక్తం చిందించిందా?: కాంగ్రెస్
గాంధీ, నెహ్రూ చరిత్రను చెరిపివేసే కుట్ర.. దేశం కోసం బీజేపీ చుక్క రక్తం చిందించిందా?: కాంగ్రెస్
AP Local Body Elections: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు- హైకోర్టులో వైసీపీకి మరో ఎదురుదెబ్బ
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు- హైకోర్టులో వైసీపీకి మరో ఎదురుదెబ్బ
ETV Win OTT : ఈటీవీ విన్‌లో ఫుల్ ఎంటర్టైన్మెంట్ - రాబోయే రెండు నెలల్లో సూపర్ మూవీస్ / వెబ్ సిరీస్
ఈటీవీ విన్‌లో ఫుల్ ఎంటర్టైన్మెంట్ - రాబోయే రెండు నెలల్లో సూపర్ మూవీస్ / వెబ్ సిరీస్
Tiger Shroff : టైగర్ ష్రాఫ్‌పై ఫైరింగ్ - ముగ్గురు నిందితుల అరెస్ట్... డ్రైవర్‌ను కాపాడిన హీరోపై ప్రశంసలు
టైగర్ ష్రాఫ్‌పై ఫైరింగ్ - ముగ్గురు నిందితుల అరెస్ట్... డ్రైవర్‌ను కాపాడిన హీరోపై ప్రశంసలు
Renault Duster Hybrid లాంచ్.. 29 కి.మీ మైలేజ్ ఇచ్చే కారు ధర హైదరాబాద్‌లో ఎంతంటే
Renault Duster Hybrid లాంచ్.. 29 కి.మీ మైలేజ్ ఇచ్చే కారు ధర హైదరాబాద్‌లో ఎంతంటే
PCB Commentary Ban: ఇమ్రాన్ ఖాన్ ఇంటర్వ్యూపై పీసీబీ రివెంజ్.. ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్లకు పీసీబీ షాక్, కామెంట్రీ ప్యానెల్ నుంచి ఇద్దరిని తొలగింపు
ఇమ్రాన్ ఖాన్ ఇంటర్వ్యూపై పీసీబీ రివెంజ్.. ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్లకు పీసీబీ షాక్, కామెంట్రీ ప్యానెల్ నుంచి ఇద్దరిని తొలగింపు
Embed widget