అన్వేషించండి

Cartwheel Galaxy: జేమ్స్ వెబ్ మరో అద్భుతం- పిల్లి మొగ్గలేసే గెలాక్సీ!

Cartwheel Galaxy: నాసా జేమ్స్ వెబ్ టెలిస్కోప్ తాజాగా మరో అద్భుతం చేసింది. కార్ట్ వీల్ గెలాక్సీ ఫొటోలు తీసింది.

Cartwheel Galaxy: మీరు చిన్నప్పుడెప్పుడైనా పిల్లి మొగ్గలేసుకుంటూ వెళ్లారా? వంగి భూమిపై చేతులు ఆన్చి కాళ్లు రెండూ అలా గాల్లోకి లేపి పిల్లి మొగ్గలేసుకుంటూ వెళితే భలే సరదాగా ఉంటుంది కదా. సరిగ్గా స్పేస్ లో అలానే ప్రవర్తిస్తున్న ఓ గెలాక్సీని ఫోటోలు తీసింది నాసా జేమ్స్ వెబ్ టెలిస్కోప్. దీపావళి రోజు కాల్చే భూ చక్రంలా గిరాగిరా తిరుగుతున్నట్లు కనిపించే ఈ కార్ట్ వీల్ గెలాక్సీని నాసా జేమ్స్ వెబ్ అద్భుతంగా ఫోటోలు తీస్తే...నాసా వాటిని షేర్ చేసింది.

ఎక్కడుందీ కార్ట్ వీల్ గెలాక్సీ

భూమి నుంచి 500 మిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఎక్కడో Sculptor constellationలో ఈ కార్ట్ వీల్ గెలాక్సీ ఉంది. వాస్తవానికి ఓ పెద్ద స్పైరల్ గెలాక్సీ ఇంకో చిన్ని గెలాక్సీ చాలా బలంగా ఢీ కొట్టుకోవటం వలన ఇంత పెద్ద బండి చక్రం లాంటి గెలాక్సీ ఏర్పడింది. ఫోటోలో ఓ సారి చూడండి. ఆ కనిపిస్తున్న గెలాక్సీలో లేత గులాబీలో రంగులో కనిపిస్తున్నది ఒక గెలాక్సీ అయితే...దాంట్లోనే కలిసిపోతున్నట్లు కనిపిస్తున్న బ్లూ కలర్ ఇంకో గెలాక్సీ అన్న మాట. ఆ రెండు గెలాక్సీలు అంత బలంగా ఢీ కొన్నాయి కాబట్టి ఇంత పెద్ద చక్రంలా కనిపిస్తోంది.

మనం చెరువులో రాయి వేస్తే.. ఆ రాయి పడిన చోట చుట్టూ ఎలా అలల్లా వస్తాయి అచ్చం అలానే. నిజానికి ఈ కార్ట్ వీల్ గెలాక్సీని హబుల్ స్పేస్ టెలిస్కోప్ 2018 లోనే ఫోటోలు తీసింది. కానీ విపరీతమైన డస్ట్ పార్టికల్స్ కారణంగా అప్పుడు సరిగ్గా కనిపించలేదు ఈ గెలాక్సీ. ఇప్పుడు ఇన్ ఫ్రారెడ్ కిరణాలతో పని చేసే జేమ్స్ వెబ్ టెలిస్కోప్ లో చాలా స్పష్టంగా ఈ గెలాక్సీ కనిపిస్తూ సందడి చేస్తోంది.

జేమ్స్ వెబ్ ఫోటో ఏం చెబుతోందంటే 

మనకి ఈ ఫోటోలో ఇంత చిన్నగానే ఉంది కదా అన్నట్లు కనిపిస్తున్నా...ఈ గెలాక్సీ మొత్తం 440 మిలియన్ సంవత్సరాలు విస్తరించి ఉంది.  ఆ లోపల కనిపిస్తున్న రింగ్ నుంచి వస్తున్న విపరీతమైన రేడియంట్ ఎనర్జీ కారణంగా ఔటర్ రింగ్ విస్తరిస్తూ వెళుతూనే ఉందన్నమాట. ఆ క్రమంలో నే ఔటర్ రింగ్ సమీపంలో చాలా నక్షత్రాలు, సూపర్ నోవాలు ఉద్భవిస్తున్నాయి ఆ గెలాక్సీలో అచ్చం మన పాలపుంత గెలాక్సీలాంటి పోలికలే ఈ కార్ట్ వీల్ గెలాక్సీకి కూడా ఉన్నాయంట. అంతే కాదు దీని పక్కనే ఇంకో రెండు గెలాక్సీలు చాలా దగ్గరగా ఉన్నట్లు కనిపించాయి.

జేమ్స్ వెబ్ టెలిస్కోప్ లో ఉన్న Near Infrared Camera (NIRCam) ఈ కార్ట్ వీల్ గెలాక్సీని చాలా అందంగా క్యాప్చర్ చేసింది. ఫోటోనే తీయటం అయితే హబుల్ కూడా తీస్తుంది. కానీ మన జేమ్స్ వెబ్ ఇంకా స్పెషల్ కదా. జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ లోని Mid Infrared Instrument (MIRI) ఆ గెలాక్సీ నుంచి వస్తున్న లైట్ ను కూడా స్టడీ చేసింది. ఆ గెలాక్సీలో హైడ్రో కార్బన్లు పుష్కలంగా ఉన్నాయని మిరీ గుర్తించింది. అంతే కాదు ఇంకా చాలా కెమికల్ కాంపౌడ్లు కూడా ఉన్నాయంట. ప్రత్యేకించి అచ్చం భూమి మీద ఉన్నట్లుగానే సిలికేట్ డస్ట్ కూడా ఆ గెలాక్సీ నుంచి వస్తున్న లైట్ లో గుర్తించింది జేమ్స్ వెబ్.

ఎలాంటి ఉపయోగం ఉండనుంది..?

ఇప్పుడు జేమ్స్ వెబ్ తీసిన ఈ ఫోటోల ఆధారంగా అసలు గెలాక్సీలు ఎలా ఏర్పడుతున్నాయి..నక్షత్రాల పుట్టుక...ఇంకా అచ్చం భూమి లాంటి పరిస్థితులు ఎక్కడైనా ఉన్నాయా అని మన శాస్త్రవేత్తలు ఇంకా లోతుగా పరిశోధనలు చేసేందుకు అవకాశం కలుగుతుంది. జేమ్స్ వెబ్ ఇప్పుడు తీసిన ఈ కార్ట్ వీల్ గెలాక్సీ కి సంబంధించి గతంలో హబుల్ తీసిన పాత ఫోటోలను కూడా అందుబాటులో ఉంచింది. సో సైన్స్ లవర్స్...స్పేస్ లో జిమ్నాస్టిక్స్ చేస్తున్న ఈ అథ్లెట్ గెలాక్సీ ని మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి.

Also Read: NASA James Webb Jupiter Image: చెలరేగిపోతున్న జేమ్స్ వెబ్ టెలిస్కోప్- తాజాగా జ్యూపిటర్ ఫొటోలు విడుదల!

Also Read: James Webb Telescope : విశ్వం గుట్టు వీడుతోందా? జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ఫస్ట్ ఫొటోలు ఏం చెబుతున్నాయ్!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ambani School Annual Day Celebrations | ధీరూభాయ్ అంబానీ స్కూల్ వార్షికోత్సవానికి క్యూకట్టిన సెలబ్రెటీలు | ABP DesamPawan Kalyan Tribal Villages Tour | పార్వతీపురం మన్యం జిల్లాలో రోడ్ల బాగు కోసం తిరిగిన డిప్యూటీ సీఎం | ABP Desamకాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Tirumala News: శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!
శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!
New Year New Mindset : న్యూ ఇయర్ 2025ని కొత్త ఆలోచనలతో ప్రారంభించండి.. పాతవాటిని మార్చుకోండిలా
న్యూ ఇయర్ 2025ని కొత్త ఆలోచనలతో ప్రారంభించండి.. పాతవాటిని మార్చుకోండిలా
UGC NET Exam Schedule: యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Embed widget