California Sikh Family Murder: కాలిఫోర్నియాలో భారత సంతతి కుటుంబం కిడ్నాప్, తోటలో కనిపించిన డెడ్‌బాడీలు
California Sikh Family Murder: కాలిఫోర్నియాలో భారత సంతతికి చెందిన కుటుంబం కిడ్నాప్‌కు గురైంది. చివరకు ఓ తోటలు శవాలుగా తేలారు వారంతా.
California Sikh Family Murder:
తుపాకీతో బెదిరించి కిడ్నాప్..
కాలిఫోర్నియాలో భారత సంతతికి చెందిన ఒకే సిక్కు కుటుంబంలోని నలుగురు వ్యక్తులు మూడ్రోజుల కింద కిడ్నాప్ అయ్యారు. వీరిలో 8 నెలల చిన్నారి కూడా ఉంది. ఈ కేసుని ఛేదించేందుకు పోలీసులు ప్రయత్నిస్తుండగానే షాకింగ్ న్యూస్ తెలిసింది. ఓ తోటలో వీరి నలుగురు డెడ్‌బాడీలు కనిపించాయి. ఈ మృతదేహాలు 8 నెలల అరూహి దేరి, 27 ఏళ్ల జస్లీన్ కౌర్, 36 ఏళ్ల జస్‌దీప్ సింగ్, 39 ఏళ్ల అమన్‌దీప్ సింగ్‌విగా గుర్తించారు. మెర్సెడ్ సిటీలోని 800 బ్లాక్ సౌత్ హైవే 59 లో నివాసం ఉంటున్నారు..ఈ నలుగురు. వీళ్లను ఓ వ్యక్తి బలవంతంగా గన్‌తో బెదిరించి కిడ్నాప్ చేశాడు. ఇప్పుడు వాళ్లందరి శవాలు కనిపించిన నేపథ్యంలో...ఆ కిడ్నాప్ చేసిన వ్యక్తే హత్య చేశాడా అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. అసలు వీరిని ఎందుకు కిడ్నాప్ చేశాడన్నదీ తేలాల్సి ఉంది. అయితే..ఈ దారుణం జరగకముందే...అక్కడి పోలీసులు ఓ వీడియో విడుదల చేశారు. ఓ గుర్తు తెలియన వ్యక్తి నలుగురిని కిడ్నాప్ చేసిన సమయంలో సీసీకెమెరాలో విజువల్స్ రికార్డ్ అయ్యాయి. అమెరికన్ న్యూస్ నెట్‌వర్క్స్ ఈ వీడియోని ప్రసారం చేసింది. ఇందులో...జస్‌దీప్ సింగ్, అమన్‌దీప్ సింగ్ చేతులు కట్టేసి ఉన్నాయి. ఆ తరవాత...తుపాకీ తీసుకుని 8 నెలల చిన్నారిని, ఆ చిన్నారి తల్లిని బెదిరించాడు కిడ్నాపర్. ఇంట్లో నుంచి బలవంతంగా తీసుకొచ్చి ట్రక్ ఎక్కించాడు. ఈ ఇంటి ముందు కార్ ఒకటి తగలబడిపోతుండటాన్ని గమనించిన పోలీసులు...అక్కడికి వచ్చారు. ఇంట్లోకి వెళ్లి చూస్తే ఎవరూ కనిపించలేదు. అప్పుడే సీసీ కెమెరాను పరిశీలించగా...కిడ్నాప్ జరిగినట్టు గుర్తించారు. FBIతో పాటు మరి కొన్ని విచారణ సంస్థలు...ఈ కేసుని టేకప్ చేశాయి.
UPDATE! We believe this to be the suspect in today's kidnapping. Read more here: https://t.co/AbGguFSG8O pic.twitter.com/EFzjTpQBx7
— Merced County Sheriff's Office (@MercedSheriff) October 4, 2022
BREAKING NEWS – KIDNAPPING INVESTIGATION THREE ADULTS & 8-MONTH BABY
— Merced County Sheriff's Office (@MercedSheriff) October 4, 2022
The Merced County Sheriff’s Office asking for the public’s help in locating four missing persons. Read more here: https://t.co/BXJI1QNghY pic.twitter.com/7KmhNP36nY
తోటలో మృతదేహాలు..
తోటలో ఓ రైతు పని చేసుకుంటుండగా..ఈ నలుగురి మృతదేహాలు కనిపించాయి. వెంటనే ఆ వ్యక్తి పోలీసులకు కాల్ చేశాడు. అన్ని డెడ్‌బాడీలు ఒకే దగ్గర ఉన్నాయి. ఈ కేసులో అనుమానితుడైన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆత్మహత్యాయత్నం చేయగా...ఆసుపత్రికి తరలించారు. మృతులు పంజాబ్‌లోని హోషియార్‌పుర్‌కి చెందిన వాళ్లుగా గుర్తించారు.
Also Read: Bengal News: దుర్గామాత నిమజ్జనంలో విషాదం- 8 మంది మృతి!