అన్వేషించండి

Budget 2025 : బడ్జెట్ 2025 - రక్షణ రంగంలో ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యాలకు ముందడుగు - R&D కోసం పెరగనున్న నిధులు

Budget 2025 : రక్షణ పరికరాల రూపకల్పన, అభివృద్ధి, తయారీలో స్వయం ప్రతిపత్తిని సాధించేందుకు ప్రభుత్వం తన ప్రయత్నాలను ముమ్మరం చేస్తోందని నిపుణులు అంటున్నారు.

Budget 2025 - Defence Sector : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన 8వ కేంద్ర బడ్జెట్‌ను ఫిబ్రవరి 1, 2025న పార్లమెంటులో సమర్పించనున్నారు. ఇది ఎన్డీయే హయాంలో ప్రవేశపెడుతోన్న 3వ పూర్తి స్థాయి బడ్జెట్‌. 2024-25 ఆర్థిక సంవత్సరంలో, ప్రభుత్వం ఆధునీకరణ, స్వావలంబనపై కొనసాగుతున్న ప్రాధాన్యతకు అనుగుణంగా, గత సంవత్సరంతో పోలిస్తే 4.79 శాతం పెరుగుదలను ప్రతిబింబిస్తూ, రక్షణ రంగానికి రూ.6.22 లక్షల కోట్లను కేటాయించింది. ఈ క్రమంలో బడ్జెట్ లో అత్యంత ఎక్కువ నిధులు కేటాయించే రంగాల్లో ఒకటైన రక్షణ రంగంపై కేంద్రం ఈ సారి ప్రత్యేక దృష్టి పెట్టిందని పరిశ్రమల ప్రముఖులు భావిస్తున్నారు. ఈ ఏడాది కేటాయింపుల పెంపు  మరింత ఎక్కువ ఉండొచ్చని అంచనావేస్తున్నారు.

పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యాలకు ప్రోత్సాహం

కేంద్ర బడ్జెట్ 2025లో కీలకమైన రంగాలలో ఒకటి రక్షణ రంగం అని బాలు ఫోర్జ్ ఇండస్ట్రీస్ డైరెక్టర్ జైకరన్ చందోక్ చెప్పారు. రక్షణ పరికరాల రూపకల్పన, అభివృద్ధి, తయారీలో స్వయం ప్రతిపత్తిని సాధించేందుకు ప్రభుత్వం తన ప్రయత్నాలను ముమ్మరం చేస్తోందని అన్నారు. సామర్థ్యాన్ని పెంపొందించడానికి, స్వావలంబన సాధించే దిశగా పురోగతిని సాధించడానికి, 2029 నాటికి రూ. 50వేల కోట్ల రక్షణ ఎగుమతుల లక్ష్యాన్ని చేరుకోవడానికి రక్షణ రంగానికి మూలధన వ్యయాన్ని పెంచేందుకు బడ్జెట్ లో కేటాయింపులు ఉండొచ్చన్నారు. ఈ బడ్జెట్‌లో సాంకేతికత బదిలీ, భాగస్వామ్యాలు, పరిశోధన, అభివృద్ధి, గ్లోబల్ ప్లేయర్లు, ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ తయారీదారులతో (OEMలు) సహకారాన్ని ప్రోత్సహించే చర్యలు, పథకాలను ప్రతిపాదించాల్సిన అవసరం ఎంతైనా ఉందని సూచించారు. బలమైన రక్షణ తయారీ పర్యావరణ వ్యవస్థ అభివృద్ధి చెందుతున్న అవకాశాలను అన్‌లాక్ చేసేందుకు ఈ రంగం సహాయపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

స్వదేశీ పరిశ్రమలకు ఊతం

ఈ బడ్జెట్ 2025 దేశీయ తయారీకి మరింత మద్దతు ఇస్తుందని, ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యాలను బలోపేతం చేస్తుందని, సమగ్ర పరిష్కారాలను అందించడానికి ప్రైవేట్ రంగానికి అధికారం ఇస్తుందని ఆశిస్తున్నామని ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ సొల్యూషన్స్ ప్రొవైడర్ అయిన రోసెల్ టెక్సిస్ మేనేజింగ్ డైరెక్టర్ రిషబ్ గుప్తా అన్నారు. షిప్పింగ్ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, స్వదేశీ నౌకా నిర్మాణాన్ని ప్రోత్సహించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని స్వాన్ షిప్‌యార్డ్ డైరెక్టర్ (గతంలో రిలయన్స్ నేవల్ అండ్ ఇంజినీరింగ్ లిమిటెడ్) వివేక్ మర్చంట్ చెప్పారు.

ఎగుమతుల్లో పెరుగుదల

ఈ ఏడాది కూడా రక్షణ రంగానికి ప్రభుత్వాలు పూర్తి ప్రోత్సాహాన్ని అందించాలని పలువురు భావిస్తున్నారు. ప్రభుత్వం రక్షణ రంగానికి పూర్తి ప్రోత్సాహాన్ని ఇస్తోందని, డిమాండ్లను నెరవేర్చడమే కాకుండా ఎగుమతులను పెంచడం కూడా లక్ష్యంగా పెట్టుకుందని గుడ్‌లక్ ఇండియా సిఇఒ రామ్ అగర్వాల్ చెప్పారు. ఇకపోతే డ్రోన్‌ల సామర్థ్యాన్ని ఉపయోగించుకోవడానికి, రాబోయే బడ్జెట్‌లో అధునాతన డ్రోన్ టెక్నాలజీల స్వదేశీ ఉత్పత్తిని ప్రోత్సహిస్తూ 'మేక్ ఇన్ ఇండియా' చొరవను నొక్కి చెప్పాలని డ్రోన్ ఆచార్య ఏరియల్ ఇన్నోవేషన్స్‌లో మేజర్ జనరల్ (డా) మండిప్ సింగ్, SM, VSM (రిటైర్డ్) ప్రెసిడెంట్ స్ట్రాటజిక్ అలయన్స్ అన్నారు. రక్షణ రంగంలో డ్రోన్ పరిశ్రమ పరివర్తన సామర్థ్యాన్ని ప్రభుత్వం గుర్తించడం అత్యవసరం అని చెప్పారు. భారత్ లో డ్రోన్ వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వంతో సహకరించేందుకు తాము సిద్దంగా ఉన్నామని, ఇది సాంకేతిక విప్లవంలో మన దేశం ప్రపంచ నాయకుడిగా మారేలా చేస్తుందని అభిప్రాయపడ్డారు.

Also Read : Budget 2025: బడ్జెట్‌ బాక్స్‌ నుంచి సీనియర్ సిటిజన్‌కు ఎంత ప్రయోజనం లభిస్తుంది?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh Cabinet Decisions : చేనేత కార్మికులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం- కేబినెట్ కీలక నిర్ణయాలు 
చేనేత కార్మికులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం- కేబినెట్ కీలక నిర్ణయాలు 
TTD: తెలంగాణ ప్రజా ప్రతినిధులకు గుడ్ న్యూస్ - మార్చి 24 నుంచి టీటీడీలో సిఫారసు లేఖలకు అనుమతి
తెలంగాణ ప్రజా ప్రతినిధులకు గుడ్ న్యూస్ - మార్చి 24 నుంచి టీటీడీలో సిఫారసు లేఖలకు అనుమతి
Chandrababu: గతంలో టీడీపీ ఓడిపోయింది నా వల్లే - మరి ఆ తప్పులు దిద్దుకుంటున్నారా?
గతంలో టీడీపీ ఓడిపోయింది నా వల్లే - మరి ఆ తప్పులు దిద్దుకుంటున్నారా?
Telangana Latest News: 42 శాతం బీసీ రిజర్వేషన్ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం
42 శాతం బీసీ రిజర్వేషన్ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం 
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Nikhil on Swayambhu Movie Update | కొంపల్లిలో ఓ రెస్టారెంట్ ను ఓపెన్ చేసిన నిఖిల్ | ABP DesamAR Rahman Wife Saira Rahman | ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చిన సైరా రెహ్మాన్ | ABP DesamNASA Space X Crew 10 Docking Success | సునీతా విలియమ్స్ భూమ్మీదకు వచ్చేందుకు రూట్ క్లియర్ | ABP DesamTDP Activist Loss life in Punganur | పెద్దిరెడ్డి ఇలాకాలో బలైపోయిన మరో టీడీపీ కార్యకర్త | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh Cabinet Decisions : చేనేత కార్మికులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం- కేబినెట్ కీలక నిర్ణయాలు 
చేనేత కార్మికులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం- కేబినెట్ కీలక నిర్ణయాలు 
TTD: తెలంగాణ ప్రజా ప్రతినిధులకు గుడ్ న్యూస్ - మార్చి 24 నుంచి టీటీడీలో సిఫారసు లేఖలకు అనుమతి
తెలంగాణ ప్రజా ప్రతినిధులకు గుడ్ న్యూస్ - మార్చి 24 నుంచి టీటీడీలో సిఫారసు లేఖలకు అనుమతి
Chandrababu: గతంలో టీడీపీ ఓడిపోయింది నా వల్లే - మరి ఆ తప్పులు దిద్దుకుంటున్నారా?
గతంలో టీడీపీ ఓడిపోయింది నా వల్లే - మరి ఆ తప్పులు దిద్దుకుంటున్నారా?
Telangana Latest News: 42 శాతం బీసీ రిజర్వేషన్ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం
42 శాతం బీసీ రిజర్వేషన్ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం 
Telugu University: తెలుగు వర్శిటీ పేరు మార్పుపై బీజేపీ విమర్శలు - మహనీయుడ్ని అవమానించారని ఆగ్రహం
తెలుగు వర్శిటీ పేరు మార్పుపై బీజేపీ విమర్శలు - మహనీయుడ్ని అవమానించారని ఆగ్రహం
Rajiv Yuva Vikasam Scheme: రాజీవ్ యువ వికాసం స్కీమ్, యువతకు రూ.3 లక్షల వరకు సాయం- పూర్తి వివరాలు ఇలా
రాజీవ్ యువ వికాసం స్కీమ్, యువతకు రూ.3 లక్షల వరకు సాయం- పూర్తి వివరాలు ఇలా
Tamannaah: 'ఎవరూ అద్భుతాల కోసం ఎదురుచూడొద్దు' - బ్రేకప్ ప్రచారం వేళ మిల్కీ బ్యూటీ తమన్నా ఇంట్రెస్టింగ్ పోస్ట్
'ఎవరూ అద్భుతాల కోసం ఎదురుచూడొద్దు' - బ్రేకప్ ప్రచారం వేళ మిల్కీ బ్యూటీ తమన్నా ఇంట్రెస్టింగ్ పోస్ట్
Sourav Ganguly: పోలీస్ ఆఫీసర్‌గా సౌరభ్ గంగూలీ - అసలు విషయం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
పోలీస్ ఆఫీసర్‌గా సౌరభ్ గంగూలీ - అసలు విషయం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
Embed widget