PM Modi Live: 'రైతుల కోసమే సాగు చట్టాలు తెచ్చాం.. కానీ అందుకే వెనక్కి తీసుకున్నాం'
ఏఎన్ఐ వార్తా సంస్థకు ప్రధాని నరేంద్ర మోదీ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా సాగు చట్టాల రద్దు సహా పలు అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.
LIVE
Background
I have come to win the hearts of farmers, & did so. I understand the pain of small farmers. I had said that farm laws were implemented for the benefit of farmers but were taken back in national interest: PM Narendra Modi to ANI pic.twitter.com/XCcO9p8aFY
— ANI (@ANI) February 9, 2022
చీకటి పడిన తర్వాత కూడా యూపీలో అడుగు పెట్టవచ్చని మహిళలు అంటున్నారు: ప్రధాని మోదీ
యుపిలో భద్రత గురించి ప్రజలు చర్చిస్తున్నప్పుడు.. గత ప్రభుత్వాల హయాంలో వారి కష్టాలు, మాఫియా రాజ్, గుండా రాజ్, కండలవీరులు ప్రభుత్వంలో హోదా, ఆశ్రయం పొందిన తీరు గురించి ఆలోచిస్తారు. UP దీన్ని దగ్గరి నుంచి చూసింది, మహిళలు బయటకు అడుగు పెట్టే పరిస్థితి ఉండేది కాదు. - ప్రధానమంత్రి మోదీ
ఇవాళ చీకటి పడిన తర్వాత కూడా మహిళలు బయటకు వెళ్లవచ్చని అంటున్నారు. భద్రతకు ఈ నమ్మకం చాలా అవసరం. యూపీలో ఒకప్పుడు గూండాలు ఏదైనా చేయగలరు, నేడు వారు లొంగిపోతున్నారు. భద్రతకు యోగి ప్రాధాన్యత ఇచ్చారు. ఆ విషయంలో ఆయన రాజీపడలేదు- ప్రధానమంత్రి మోదీ
అఖిలేష్ యాదవ్ & ప్రతిపక్షాలపై ప్రధాని మోదీ విమర్శలు
యోగి అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. అందుకే ఆయన చేపట్టిన పథకాల నుంచి లబ్ధి పొందాలనుంటారు. ప్రతిపక్షాలు కూడా ఈ పథకాలను క్యాష్ చేసుకోవాలనుకుంటున్నారు. ఈ క్రెడిట్ మొత్తం యోగికే దక్కుతుంది.
పంజాబ్లో నా భద్రతా ఉల్లంఘన అంశం సుప్రీం కోర్టు పరిశీలిస్తోంది.. దానిపై నేనేమీ మాట్లాడను: ప్రధాని మోదీ
పంజాబ్లోని ఫిరోజ్పూర్లో భద్రతా ఉల్లంఘనలపై ప్రధాని మోదీ మాట్లాడుతూ, "ఈ అంశంపై నేనేమీ మాట్లాడను. సుప్రీంకోర్టు ఈ అంశాన్ని తీవ్రంగా పరిశీలిస్తోంది. ఈ విషయంలో నేను చేసే ఏ ప్రకటన అయినా దర్యాప్తుపై ప్రభావం చూపుతుంది, అది సరికాదు"
జాతీయ ప్రయోజనాల కోసమే వ్యవసాయ చట్టాలు వెనక్కి: మోదీ
నేను రైతుల హృదయాలను గెలుచుకోవడానికి వచ్చాను. చిన్న రైతుల బాధ నాకు అర్థమైంది. రైతుల ప్రయోజనాల కోసం వ్యవసాయ చట్టాలను అమలు చేశామని నేను చెప్పాను, కానీ జాతీయ ప్రయోజనాల కోసం వాటిని వెనక్కి తీసుకున్నాం: ప్రధాని నరేంద్ర మోదీ