Telugu breaking News: రాజ్‌కోట్ టెస్టులో సెంచరీ చేసిన రోహిత్
Latest Telugu breaking News:ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ చూడొచ్చు.
LIVE
Background
వైసీపీ అధికారంలోకి వచ్చాక తీసుకొచ్చిన వ్యవస్థలలో వాలంటీర్ సిస్టమ్ ఒకటి. వాలంటీర్ల ద్వారా అర్హులైన లబ్ధిదారులకు ప్రతినెలా ఒకటో తేదీన పెన్షన్ సహా పలు కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందిస్తోంది జగన్ ప్రభుత్వం. ప్రభుత్వం తరఫున సేవలు అందిస్తున్న వాలంటీర్లకు వరుసగా నాలుగో ఏడాది వాలంటీర్లకు వందనం కార్యక్రమానికి ఏపీ సర్కార్ శ్రీకారం చుట్టింది. అత్యుత్తమ సేవలు అందించిన వాలంటీర్లకు నగదు ప్రోత్సహకాలు అందనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 2,55,464 మందికి మొత్తంగా రూ.392.05 కోట్ల నగదు పురస్కారాలు అందుకోనున్నారు. 997 మంది వాలంటీర్లకు ప్రత్యేకంగా నగదు బహుమతులు.. ఒక్కో వాలంటీర్ కు మండల, పట్టణ, మున్సిపల్ కార్పొరేషన్ స్థాయిలో రూ. 15 వేలు, నియోజకవర్గ స్థాయిలో రూ.20 వేలు, జిల్లా స్థాయిలో రూ. 25 వేల చొప్పున మొత్తం రూ. 1.61 కోట్ల నగదు బహుమతుల ప్రదానం ఇవాళ ప్రారంభం కానుంది. గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో ప్రారంభించనున్నారు.
వరుసగా 4వ ఏడాది వాలంటీర్లకు అభినందన..
ఉత్తమ గ్రామ, వార్డు సచివాలయ వాలంటీర్లకు సేవా మిత్ర, సేవా రత్న సేవా వజ్ర అవార్డులు ప్రదానం చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 7 రోజులపాటు జరిగే ఈ పురస్కారాల ప్రదాన కార్యక్రమాన్ని ఫిబ్రవరి 15న గుంటూరు జిల్లా ఫిరంగిపురం లో ఏపీ సీఎం వైఎస్ జగన్ లాంఛనంగా ప్రారంభించనున్నారు. వాలంటీర్ల సేవలను గుర్తంచిన ప్రభుత్వం వారికి అందిస్తున్న పురస్కారాల మొత్తాన్ని పెంచింది. గరిష్టంగా సేవా వజ్ర అవార్డుకు ఎంపికైన వారి ఖాతాల్లో రూ.45,000 జమ చేయనున్నారు. సేవా రత్నలో భాగంగా రూ.30000, సేవా మిత్ర అవార్డు గ్రహీతలకు పది వేల నుంచి రూ.15,000కు పెంచారు.
ఇప్పటివరకు అందించింది (రూ.లలో) పెంచి ఇస్తున్నది (రూ.లలో)
సేవా వజ్ర రూ.30,000 ఇకనుంచి రూ.45,000
సేవా రత్న రూ.20,000 ఇకనుంచి రూ.30,000
సేవా మిత్ర రూ.10,000 ఇకనుంచి రూ.15,000
లంచాలకు, వివక్షకు తావు లేకుండా డెలివరీ మెకానిజంలో భాగమైనందుకు, పారదర్శకంగా వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అర్హులైన లబ్ధిదారులకు తోడుగా ఉంటూ, సహాయకారిగా వ్యవహరిస్తున్నందుకు.. తమ పరిధిలోని 50/100 కుటుంబాలకు చేదోడు వాదోడుగా నిలుస్తున్నందుకు.. గ్రామ/వార్డు సచివాలయాలకు, ప్రజలకు మధ్య మంచి సంధానకర్తలుగా వ్యవహరిస్తున్నందుకు... ఇంటి తలుపు తట్టి గుడ్ మార్నింగ్ చెప్పి పింఛన్లు ప్రతి నెలా ఒకటో తారీఖునే అందిస్తున్నందుకుపెన్షన్లతో పాటు రేషన్ డెలివరీ, బియ్యం కార్డు, ఆరోగ్యశ్రీ కార్డు, ఇళ్ళ పట్టాలతో సహా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన లబ్దిదారులందరికీ గ్రామ, వార్డు సచివాలయాల సహకారంతో నిర్దిష్ట కాల పరిమితిలో అందేందుకు సహాయపడుతున్నారు. వరదలు, విపత్తులు, ప్రమాదాల సహాయ కార్యక్రమాలలో పాల్గొని ప్రజలను ఆదుకోవడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు, 'దిశ' వంటి ముఖ్యమైన చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించినందుకు.. కనీసం సంవత్సర కాలంగా నిరంతరాయంగా సేవలందిస్తున్న వాలంటీర్లకు, వారు అందించిన సేవల ఆధారంగా 3 కేటగిరీల్లో పురస్కారాలు..
'సేవా వజ్ర'
సర్టిఫికెట్, శాలువా, బ్యాడ్జ్, మెడల్ తో పాటు రూ. 45,000 నగదు బహుమతి.
ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో అత్యుత్తమ ర్యాంకు సాధించిన మొదటి ఐదుగురు వాలంటీర్లకు 175 నియోజకవర్గాలలో 875 మంది వాలంటీర్లకు సేవా వజ్ర పురస్కారాల ప్రధానం
'సేవా రత్న'
సర్టిఫికెట్, శాలువా, బ్యాడ్జ్, మెడల్ తో పాటు రూ. 30,000 నగదు బహుమతి..
ప్రతి మండలం/మున్సిపాలిటీ పరిధిలో 5 మంది చొప్పున, మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో 10 మంది చొప్పున టాప్ 1 ర్యాంకు సాధించిన వాలంటీర్లకు...మొత్తంగా 4,150 మందికి "సేవా రత్న" పురస్కారాల ప్రదానం...
'సేవా మిత్ర'
సర్టిఫికెట్, శాలువా, బ్యాడ్జ్ తో పాటు రూ.15,000 నగదు బహుమతి..
రాష్ట్రవ్యాప్తంగా ఏడాది పాటు ఎటువంటి ఫిర్యాదులు, వివాదాలు లేకుండా పని చేసిన 2,50,439 మంది వాలంటీర్లకు "సేవామిత్ర" పురస్కారాలు ప్రదానం చేయనున్నారు.
రోహిత్ శర్మ సెంచరీ
రాజ్‌కోట్ టెస్టులో రోహిత్ శర్మ సెంచరీ సాధించాడు. రోహిత్ శర్మ 157 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. రోహిత్ శర్మకు ఇదే అత్యుత్తమ సెంచరీ. ఆరంభంలోనే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది టీమిండియా. కానీ రోహిత్ శర్మ, రవీంద్ర జడేజాతో కలిసి జట్టును క్లిష్ట పరిస్థితి నుంచి గట్టెక్కించి టెస్టు కెరీర్ లో 11వ సెంచరీ సాధించాడు.
రోహిత్-జడేజాల బలమైన భాగస్వామ్యం
46 ఓవర్లు ముగిసే సరికి భారత్ 3 వికెట్లు కోల్పోయి 160 పరుగులు చేసింది. రవీంద్ర జడేజా 53 పరుగులు చేశాడు. రోహిత్ శర్మ 10 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 87 పరుగులు చేశాడు. వీరిద్దరి మధ్య 127 పరుగుల భాగస్వామ్యం ఉంది. రోహిత్, జడేజా కారణంగా ఇంగ్లండ్ ఇప్పుడు వెనుకంజలో ఉంది.
జడేజా-రోహిత్ మధ్య 74 పరుగుల భాగస్వామ్యం
29 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 3 వికెట్లు కోల్పోయి 107 పరుగులు చేసింది. రోహిత్ శర్మ 82 బంతుల్లో 52 పరుగులు చేశాడు. 8 ఫోర్లు బాదాడు. రవీంద్ర జడేజా 60 బంతుల్లో 38 పరుగులు చేశాడు. వీరిద్దరి మధ్య 74 పరుగుల భాగస్వామ్యం ఉంది.
లంచ్ విరామ సమయానికి టీమ్ఇండియా 93 పరుగులు, రోహిత్-జడేజా నాటౌట్
లంచ్ విరామ సమయానికి టీమిండియా 25 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 93 పరుగులు చేసింది. రోహిత్ శర్మ 74 బంతుల్లో 52 పరుగులతో అజేయంగా నిలిచాడు. 8 ఫోర్లు బాదాడు. రవీంద్ర జడేజా 44 బంతుల్లో 24 పరుగులతో అజేయంగా నిలిచాడు. జడేజా 3 ఫోర్లు బాదాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో మార్క్ వుడ్ 2 వికెట్లు పడగొట్టాడు. టామ్ హార్ట్లీ విజయం సాధించాడు.
టీంఇండియాకుఎదురుదెబ్బ, వరుసగా ముగ్గురు ఔట్
మూడో వికెట్‌గా పాటిదార్ ఔట్
భారత క్రికెట్ జట్టు మూడో వికెట్ పడిపోయింది. రజత్ పాటిదార్ 15 బంతుల్లో కేవలం 5 పరుగులు మాత్రమే చేశాడు. టామ్ హార్ట్లీ ఇంగ్లాండ్కు చెప్పుకోదగ్గ విజయాన్ని అందించాడు. 9వ ఓవర్ ఐదో బంతికి బెన్ డకెట్ క్యాచ్ అందుకున్నాడు. భారత్ 8.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 33 పరుగులు చేసింది. ఇప్పుడు రవీంద్ర జడేజా బ్యాటింగ్ కు వచ్చాడు.
టీమ్ఇండియాకు రెండో దెబ్బ, శుభ్మన్ గిల్ ఔట్
శుభ్మన్ గిల్ రూపంలో టీమ్ఇండియా రెండో వికెట్ పడింది. కనీసం ఖాతా కూడా తెరవలేకపోయారు. మార్క్ వుడ్ గిల్ కు పెవిలియన్ కు దారి చూపించాడు. 6 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 2 వికెట్లు కోల్పోయి 24 పరుగులు చేసింది. రోహిత్ శర్మ 13 పరుగులు చేశాడు. రజత్ పాటిదార్ ఇంకా ఖాతా తెరవలేకపోయారు.
టీమ్ఇండియాకు తొలి ఎదురుదెబ్బ తగిలింది.
టీమ్ఇండియా తొలి వికెట్ కోల్పోయింది. యశస్వి జైస్వాల్ 10 బంతుల్లో 10 పరుగులు చేశాడు. మార్క్ వుడ్ అతనికి పెవిలియన్ కు దారి చూపించాడు. యశస్వికి శుభారంభం లభించింది. కానీ దాన్ని ముందుకు తీసుకెళ్లలేకపోయారు. యశస్వి వుడ్ ఓవర్లో జో రూట్ పట్టుబడ్డాడు. భారత్ 3.5 ఓవర్లలో 22 పరుగులు చేసింది. ఇప్పుడు శుభ్మన్ గిల్ బ్యాటింగ్కు వచ్చాడు.