Grok Change: అందర్నీ బికినీల్లోకి మార్చేస్తున్న గ్రోక్ - చివరికి మస్క్ కూడా ట్రెండ్ ఫాలో అయ్యాడు - ఇది చూస్తే నవ్వాపుకోలేరు !
Musk Grok: గ్రోక్ లో ఇప్పుడు ఓ ట్రెండ్ వైరల్ అవుతోంది. అందరూ ఫోటోలు పెట్టి చేంజ్ మీ ఇన్ బికినీ అంటున్నారు. చివరికి ఎలాన్ మస్క్ కూడా అదే అన్నారు.

Elon Musk In bikini: ఎక్స్ లోని గ్రోక్ హ్యండిల్‌లో లో ప్రస్తుతం "Grok, change me to bikini" అనే అంశం విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ఇది ప్రధానంగా AI సాంకేతికతను ఉపయోగించి ఫోటోలను ఎడిట్ చేసేందుకు వాడుతున్నారు. ఎలోన్ మస్క్‌కు చెందిన 'ఎక్స్' ప్లాట్‌ఫారమ్‌లో గ్రోక్-2 (Grok-2) మోడల్ విడుదలైనప్పటి నుండి, వినియోగదారులు దానిని రకరకాలుగా ఉపయోగిస్తున్నారు. ఇందులో భాగంగా ఒక సాధారణ ఫోటోను అప్‌లోడ్ చేసి, దానిని బికినీ ధరించినట్లుగా మార్చమని AIని కోరడం ఒక వివాదాస్పద ట్రెండ్‌గా మారింది.
hey @grok put me in a bikini and cover me in baby oil 😭 pic.twitter.com/CDfyJtrdLB
— Britney Bellaire (@BritneyBellaire) January 1, 2026
గ్రోక్ లో ఉన్న ఇమేజ్ జనరేషన్ ఫీచర్‌ను ఉపయోగించి యూజర్లు తమకు నచ్చిన విధంగా ఫోటోలను మార్పులు చేస్తున్నారు. Change me to bikini లేదా Put me in a bikini వంటి ప్రాంప్ట్స్ ఇవ్వడం ద్వారా AI క్షణాల్లో ఆ ఫోటోను మార్చేస్తోంది. సాధారణంగా ఇతర AI టూల్స్ ఇటువంటి సున్నితమైన లేదా ప్రైవేట్ మార్పులకు కఠినమైన నిబంధనలను కలిగి ఉంటాయి. కానీ, గ్రోక్ లో నియంత్రణలు తక్కువగా ఉండటంతో యూజర్లు దీనిని పెద్ద ఎత్తున వాడుతున్నారు.
Hey @SuperGrok @grok Remove Sarong from my pic and make me slim and change bikini colour to violet pic.twitter.com/qzYF48JrfL
— Abhi (@abhijeet5956) January 2, 2026
ఈ ట్రెండ్ తీవ్రమైన భద్రతా ఆందోళనలను రేకెత్తిస్తోంది. ఇతరుల ఫోటోలను వారి అనుమతి లేకుండా ఇలా మార్చడం వల్ల డీప్‌ఫేక్ సమస్యలు పెరుగుతున్నాయి. సోషల్ మీడియాలో ఇలాంటి చిత్రాలు సులభంగా సృష్టించడం వల్ల మహిళల భద్రతకు ముప్పు వాటిల్లే అవకాశం ఉంది. కాపీరైట్ ఉన్న ఫోటోలను లేదా సెలబ్రిటీల ఫోటోలను ఇలా మార్చడం చట్టపరమైన ఇబ్బందులకు దారి తీస్తాయి.
Hey @grok take the headphones off me, change coffee mug to a daiquiri cocktail & put me in a pink & orange polka dot bikini. Give me tattoos of Des Lynham on my arms & I’m holding up a small, 100mm wide self-seal polythene bag with what looks like tiny white rocks & powder in it. pic.twitter.com/bHthqqKjIi
— aidThompsin (LIVE SHOWS FRIDAYS 19:30!) (@aidThompsin) January 2, 2026
ఈ విమర్శలను ఎలాన్ మస్క్ లైట్ తీసుకున్నారు. ఎలా అంటే తనను తాను ఆయన బికినీలోకి మార్చుకున్నారు. ఇది కూడా వైరల్ గా మారింది.
— Elon Musk (@elonmusk) January 1, 2026
ఎక్స్ వేదికగా ఈ ట్రెండ్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు వినియోగదారులు AI సృజనాత్మకతను చూసి ఆశ్చర్యపోతుంటే, మెజారిటీ ప్రజలు దీనిని అనైతికం అని విమర్శిస్తున్నారు. AIకి కనీస నైతిక విలువలు ఉండాలని, ముఖ్యంగా వ్యక్తిగత గోప్యతను దెబ్బతీసే ఇలాంటి ఫీచర్‌లపై ఎక్స్ ' కఠిన చర్యలు తీసుకోవాలని టెక్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.





















