Bihar Student Fainted: ఎగ్జామ్ హాల్‌లో కళ్లు తేలేసిన కుర్రాడు, పేపర్‌ను చూసి కాదు అమ్మాయిల్ని చూసి
Bihar Student Fainted: బిహార్‌లో ఓ విద్యార్థి ఎగ్జామ్ హాల్‌లో అమ్మాయిల్ని చూసి మూర్ఛపోయాడు.
Bihar Student Fainted:
బిహార్‌లో ఘటన..
96 మూవీ చూసే ఉంటారుగా. ఇదేం ప్రశ్న అంటారేమో. ఆల్‌మోస్ట్ మూవీ లవర్స్ అందరూ ఈ సినిమా చూసే ఉంటారు. జస్ట్ చూడటమే కాదు. ఎమోషనల్ అయ్యుంటారు కూడా. ఇప్పటికీ సోషల్ మీడియాలో షార్ట్స్‌లో, రీల్స్‌లో ఈ సినిమాకు సంబంధించిన వీడియోలు కనిపిస్తూనే ఉంటాయి. అయితే...ఈ మూవీలో అన్నింటి కన్నా హైలైట్ అయిన సీన్ ఒకటి ఉంది. హీరోయిన్ వచ్చి హీరోని తాకగానే తెగ టెన్షన్ పడిపోయి మూర్ఛపోతాడు. అప్పట్లో ఓ ట్రెండ్ సెట్ చేసింది. కొందరు ఇది మరీ అతి అని తీసి పారేసినా...చాలా మందికి కనెక్ట్ అయిపోయాయి
ఈ సీన్స్. ఇప్పుడిదంతా ఎందుకు అంటే...ఈ సినిమాలోని హీరోలాగే ఓ కుర్రోడు అమ్మాయిల్ని చూసి కళ్లు తిరిగి కింద పడిపోయాడు. బిహార్‌లో జరిగిందీ ఘటన. 12వ తరగతి విద్యార్థి ఎగ్జామ్ హాల్‌లో 50 మంది అమ్మాయిల్ని చూసి నెర్వస్ ఫీల్ అయ్యాడు. వెంటనే మూర్ఛపోయాడు. బిహార్‌లోని షరీఫ్ అల్లమా ఇక్బాల్ కాలేజీ విద్యార్థి ఇంటర్ ఎగ్జామ్ రాసేందుకు ఎగ్జామ్ హాల్‌కు వెళ్లాడు. అయితే...ఆ హాల్‌లో తాను తప్ప మిగతా వాళ్లందరూ అమ్మాయిలే ఉండటం చూసి కంగారు పడిపోయాడు. కళ్లు తిరిగి కింద పడిపోవడమే కాదు. ఆ దెబ్బకు జ్వరం కూడా వచ్చింది. ప్రస్తుతం కుర్రాడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.