అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Bihar Crime: పెళ్లయిన 45 రోజులకు భార్య మాయం - నగలు, డబ్బులూ హాంఫట్, గొల్లుమన్న భర్త!

మాజీ ప్రియుడి వద్దకు వెళ్లిపోతానంటూ భార్య, భర్తతో గొడవ పెట్టుకుంది. చివర్లో ఊహించని ట్విస్ట్ ఇచ్చింది.

భర్తను కాదని మాజీ ప్రియుడి కోసం పరారీ

ఇద్దరూ ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకున్నారు. నువ్వు లేక నేను లేను అని కబుర్లు చెప్పుకున్నారు. ఇంట్లో వాళ్లు కాదన్నా ఎదిరించి పెళ్లి చేసుకున్నారు. అంతా హ్యాపీగా సాగిపోతుందనుకుంటున్న జీవితంలో అనుకోకుండా ఓ సంఘటన జరిగింది. ఈ ట్విస్ట్‌కి ఆ అబ్బాయి మైండ్ బ్లాంక్ అయిపోయింది. ఏం చేయాలో అర్థం కాక గొల్లుమంటున్నాడు. ఎందుకీ బాధ అంటే...తన ఎక్స్‌ బాయ్‌ ఫ్రెండ్‌ కోసం భర్తను కాదని వెళ్లిపోయింది ఆ అమ్మాయి. ఒట్టి చేతుల్తో కాదు. డబ్బు, నగలతో పరారైంది. పాట్నాలోని నౌబత్‌పూర్‌లో జరిగిందీ ఘటన. అమ్మాయి మోసం చేసిందని అర్థం చేసుకున్న ఆ కుర్రాడు పోలీసులను ఆశ్రయించాడు. 
 
మాజీ బాయ్‌ ఫ్రెండ్‌తోనే ఉండిపోతానంటూ వాగ్వాదం

సేఫ్‌ లాక్‌లు బద్దలుకొట్టి రూ. 20వేల నగదుతో పాటు మంగళసూత్రం, మరి కొన్ని నగల్ని తీసుకుని అమ్మాయి పరారైనట్టు పోలీసులకు వెల్లడించాడు బాధితుడు. పెళ్లికి గిఫ్ట్‌గా ఇచ్చిన నగలన్నీ తీసుకెళ్లిపోయిందని వాపోయాడు. రెండేళ్ల క్రితమే వీళ్లిద్దరూ ప్రేమలో పడ్డారు. 
గంటల తరబడి కాల్స్‌ మాట్లాడుకునే వాళ్లు. పెళ్లి చేసుకోవాలనుకున్న సమయానికి పెద్దలు అంగీకరించలేదు. ఒకరిని విడిచి మరొకరు ఉండలేక ఏప్రిల్ 27వ తేదీన పెళ్లి చేసుకున్నారు. ఓ రోజు ఆ అమ్మాయి వేరెవరితోనో చాటింగ్ చేస్తుండటాన్ని గమనించాడు బాధితుడు. ఎవరని నిలదీశాడు. "తను నా మాజీ బాయ్‌ఫ్రెండ్ అని, తనతోనే బతకాలనుందని" షాక్ అయ్యే సమాధానమిచ్చింది ఆ కొత్త పెళ్లికూతురు. ఈ విషయమై ఇద్దరి మధ్య కాసేపు వాగ్వాదం జరిగింది. ఎప్పుడైతే అబ్బాయి నిద్రపోయాడో వెంటనే లాకర్లు బద్దలుకొట్టి డబ్బు, నగదుతో వెళ్లిపోయింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

ఈ మధ్య కాలంలో ఇలాంటి సంఘటనలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. ప్రేమ పెళ్లి చేసుకుని, చివరకు మాజీ ప్రియుడిని మర్చిపోలేనంటూ కొందరు అమ్మాయిలు వెళ్లిపోతున్నారు. అటు అబ్బాయిలూ ఇదే తరహాలో పరారవుతున్నారు. డబ్బు కోసం ఇలా పెళ్లాడి, అవసరం తీరాక కంటికి కనిపించకుండా పోతున్నారు. ఇలాంటి కేసులు పోలీసులకు తలనొప్పి తెచ్చి పెడుతున్నాయి. ఇంకాసేపట్లో పెళ్లి ఉందనగా, వెళ్లిపోతున్న సంఘటనలూ చోటు చేసుకుంటున్నాయి. ఏపీలోని చిత్తూరు జిల్లా నిమ్మనపల్లె మండలం చౌకిళ్లవారిపల్లె గ్రామంలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. పెళ్లి చేసుకుంటానని యువతిని నమ్మబలికాడు ఓ యువకుడు. అయితే తమ ప్రేమను తల్లిదండ్రులకు చెప్పడంతో వీరి ప్రేమను అంగీకరించిన పెద్దలు పెళ్లి వేడుకలకు సిద్దం చేశారు. వధువు, వరుడి తల్లిదండ్రులు కలిసి వివాహ వేడుకలకు అవసరం అయ్యే బంగారు నగలు, నూతన వస్త్రాలు సైతం కొనుగోలు చేశారు. అనుకున్న విధంగానే వివాహ వేడుకలను నిర్వహించేందుకు అంతా సిద్ధం చేసుకున్నారు. ఇంతలో ఏమైందో ఏమో గానీ తన తండ్రికి ఆరోగ్యం బాగోలేదని ఫోన్ వచ్చిందని అమ్మాయిని, ఆమె తల్లిదండ్రులను నమ్మించి, వారి వద్ద నగదు, నగలు తీసుకుని స్వగ్రామానికి వెళ్తున్నట్లు నమ్మించి పరారయ్యాడు.

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Road Accident: అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
Revanth Reddy: కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
Vizag Forbs: ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
Pawan Kalyan: మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పెర్త్ టెస్ట్‌లో రెండో రోజు దుమ్ము లేపిన టీమిండియావయనాడ్‌లో భారీ మెజార్టీతో గెలిచిన ప్రియాంక గాంధీమహారాష్ట్రలో బీజేపీ సత్తా! ఏ మ్యాజిక్ పని చేసింది?కుప్పకూలిన ఆసిస్ అదరగొట్టిన భారత బౌలర్లు!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Road Accident: అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
Revanth Reddy: కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
Vizag Forbs: ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
Pawan Kalyan: మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
Priyanka Gandhi: ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
KA Movie OTT Release Date: కిరణ్ అబ్బవరం 'క' మూవీ ఓటీటీ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్... ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే?
కిరణ్ అబ్బవరం 'క' మూవీ ఓటీటీ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్... ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే?
TGPSC Group-1 Results: 'గ్రూప్-1' అభ్యర్థులకు అలర్ట్, మెయిన్స్ ఫలితాలు ఎప్పుడంటే?
'గ్రూప్-1' అభ్యర్థులకు అలర్ట్, మెయిన్స్ ఫలితాలు ఎప్పుడంటే?
IND vs AUS 1st Test Highlights: 20 ఏళ్ల తరువాత ఆస్ట్రేలియాలో భారత ఓపెనర్ల రికార్డ్, ఆసీస్‌లో మొదలైన కంగారు
20 ఏళ్ల తరువాత ఆస్ట్రేలియాలో భారత ఓపెనర్ల రికార్డ్ భాగస్వామ్యం, ఆసీస్‌లో మొదలైన కంగారు
Embed widget