Bengal Train Accident: రాజకీయాలు చేయొద్దు, కచ్చితంగా విచారణ చేపడతాం - బెంగాల్ రైల్ ప్రమాదంపై అశ్వినీ వైష్ణవ్
Bengal Train Tragedy: బెంగాల్‌లో రైలు ప్రమాదం జరిగిన చోటుకి రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ చేరుకున్నారు. దారి చిన్నగా ఉండడం వల్ల బైక్‌పై ఘటనా స్థలానికి వెళ్లారు.

West Bengal Train Tragedy: బెంగాల్‌లో రైలు ప్రమాద స్థలానికి రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ చేరుకున్నారు. ఉదయం జరిగిన ప్రమాదంలో ఇప్పటి వరకూ 15 మంది ప్రాణాలు కోల్పోయారు. 50 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. ఇప్పటికే సహాయక చర్యలు కొనసాగుతుండగా ఘటనా స్థలాన్ని పరిశీలించేందుకు అశ్వినీ వైష్ణవ్ వచ్చారు. ఢిల్లీ నుంచి బగ్దోగ్రా వరకూ ఫ్లైట్‌లో వచ్చిన ఆయన యాక్సిడెంట్ స్పాట్‌కి వెళ్లేందుకు మాత్రం బైక్‌ని వినియోగించారు. ఓ వ్యక్తి డ్రైవ్ చేస్తుండగా వెనకాల కూర్చుని ఘటనా స్థలానికి చేరుకున్నారు. గూడ్స్ ట్రైన్ లోకోపైలట్ రెడ్ సిగ్నల్ పడినా పట్టించుకోకుండా వెళ్లాడని, అందుకే ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా అధికారులు చెబుతున్నారు.
#WATCH | West Bengal: Railways Minister Ashwini Vaishnaw to shortly visit the Kanchenjunga Express train accident site in Darjeeling district. pic.twitter.com/wmAti3z2MV
— ANI (@ANI) June 17, 2024
ఈ సందర్భంగా అశ్వినీ వైష్ణవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రెస్క్యూ ఆపరేషన్ ముగిసిందని, ఇప్పుటు ట్రాక్‌ని రీస్టోర్ చేసే పనిలో ఉన్నామని వెల్లడించారు. ఇది రాజకీయాలు చేయాల్సిన సమయం కాదని ప్రతిపక్షాలను మందలించారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ చేపడతామని హామీ ఇచ్చారు. ప్రమాదానికి కారణమేంటో త్వరలోనే తెలుసుకుంటామని తెలిపారు. భవిష్యత్‌లో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
"రెస్క్యూ ఆపరేషన్ ముగిసింది. ఇప్పుడు లేన్ రీస్టోరేషన్ చేస్తున్నాం. అనవసరంగా దీనిపై రాజకీయాలు చేయొద్దు. కమిషన్ ఆఫ్ రైల్వే సేఫ్‌టీ ఈ ప్రమాదంపై విచారణ చేపడుతుంది. ఈ ప్రమాదానికి కారణమేంటో త్వరలోనే వెల్లడిస్తాం. భవిష్యత్‌లో మళ్లీ ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటాం"
- అశ్వినీ వైష్ణవ్, రైల్వే మంత్రి
#WATCH | West Bengal: Railways Minister Ashwini Vaishnaw visits the Kanchenjunga Express train accident site in Darjeeling district
— ANI (@ANI) June 17, 2024
He says, "Right now our focus is on restoration. This is the main line. The rescue operation has been completed. This is not the time for politics.… pic.twitter.com/we5bx2WDgS
Also Read: Delhi Airport: ఉన్నట్టుండి ఎయిర్‌పోర్ట్‌లో పవర్ కట్, బోర్డింగ్‌కి అంతరాయం - అయోమయంలో ప్రయాణికులు
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

