అన్వేషించండి

Political Padayatra: పాదయాత్రల రాజకీయం వర్కౌట్ అవుతుందా? ఈ ఫార్ములా అందరికీ సక్సెస్ ఇస్తుందా?

Political Padayatra: రాజకీయాల్లో "పాదయాత్ర"ను సక్సెస్ ఫార్ములాగా భావిస్తారు. ప్రజలకు దగ్గరయ్యే దారి ఇదొక్కటే అని బలంగా విశ్వసిస్తారు.

Political Padayatra: 

యాత్రా రాజకీయాలు...

పురుషులందు పుణ్య పురుషులు వేరయా అన్నట్టు..రాజకీయాల్లో యాత్రా రాజకీయాలు వేరు. అవును. పాలిటిక్స్ అంటేనే టూర్లు, సెటైర్లు. ఈ రెండు క్వాలిటీస్ ఎంత బాగా ఉంటే...అంత సులువుగా ప్రజల్లోకి వెళ్లిపోవచ్చు. అందుకే...రాజకీయ నేతలు "సెటైర్లు" వర్కౌట్ కాకపోతే..వెంటనే "టూర్లు" మొదలు పెడతారు. టూర్ అంటే ఏదో బస్సుల్లోనో, కార్లలోనే తిరగటం కాదు. జనాల్లోకి వెళ్లాలి. జనంతో నడవాలి. అందుకే పాద యాత్రలు చేస్తారు నేతలు. "పాదయాత్రల రాజకీయం" అన్నమాట. వందల వేల కిలోమీటర్లు నడుస్తూ పార్టీ కార్యకర్తలతో, ప్రజలతో మాట్లాడుతూ యాత్ర చేపడితే సింపథీతో పాటు సక్సెస్ కూడా వస్తుందని చాలా బలంగా నమ్ముతారు నాయకులు. అఫ్‌కోర్స్ ఈ వ్యూహం ఫెయిల్ అయినా సరే...మరోసారి "కాళ్లనే" నమ్ముకుంటారు. మన దేశ రాజకీయాల్లో "పాద యాత్రలకు" ఉన్న క్రేజ్ అలాంటిది మరి. ఇప్పుడు కాదు. దశాబ్దాలుగా ఇదే వ్యూహం అనుసరిస్తూ వస్తున్నాయి పార్టీలు. కాసేపు ఈ రాజకీయాల గురించి పక్కనెట్టి...పాదయాత్రకు ఆద్యుడు ఎవరు అని ఆలోచిస్తే..."మహాత్మా గాంధీజీ" అని కచ్చితంగా చెప్పేయొచ్చు. ఉప్పుపై పన్ను వేయటాన్ని నిరసిస్తూ 1930లో దండియాత్ర చేపట్టారు బాపూజీ. దాదాపు 388 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. అప్పటికి ఆయన వయసు 61 ఏళ్లు. అయినా చాలా చురుగ్గా నడుస్తూ ప్రజల్లో ఉద్యమస్ఫూర్తి నింపారు. అప్పుడు ఓ లక్ష్యంతో, ఓ విజన్‌తో పాదయాత్ర చేశారు గాంధీజీ. రాజకీయ నేతలు ఆయన వేసిన బాటలోనే ఇప్పటికీ "నడుస్తున్నారు". మరి వాళ్లకి "విజన్" ఉందా లేదా అన్న వాదన..ప్రస్తుతానికి అప్రస్తుతం. కేవలం పాదయాత్రల గురించి మాట్లాడు కుందామంతే. 

కాంగ్రెస్, భాజపా బిజీబిజీ..

"భారత్ జోడో యాత్ర"లో భాగంగా కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకూ పాదయాత్ర చేపట్టనుంది కాంగ్రెస్. 150 రోజుల పాటు జరగనున్న ఈ యాత్రలో మొత్తం 3,500 కిలోమీటర్ల మేర పర్యటించనున్నారు కాంగ్రెస్ నేతలు. 125 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ పార్టీ ఉనికి కాపాడుకునేందుకు చివరి ప్రయత్నంగా ఈ యాత్రకు శ్రీకారం చుట్టనుంది. ఇటు తెలంగాణలోనూ తెరాసకు ప్రత్యామ్నాయం తామే అంటున్న భాజపా కూడా పాదయాత్రకు సిద్ధమైంది. బండి సంజయ్ నేతృత్వంలో ఈ యాత్రను చేపట్టేందుకు ఆ పార్టీ ప్లాన్ చేసుకుంది. అంటే..2024 ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో మరోసారి "పాదయాత్రలకు" డిమాండ్ పెరిగిందన్నమాట. ఈ యాత్రలు ఎంత సక్సెస్ అవుతాయో కాలమే నిర్ణయిస్తుంది. కానీ...గతంలో ఇలా "పాదయాత్రలు" చేసిన వాళ్లలో ఎంత మంది సక్సెస్ అయ్యారు అనేదే ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్. ఓ సారి ఆ లిస్ట్ చూద్దాం. 

1. మహాత్మా గాంధీ తరవాత ఆ స్థాయిలో పాదయాత్ర చేసిన వ్యక్తి వినోబా భావే. గాంధీ ఫాలోవర్‌గా ఆయన అడుగు జాడల్లో 1951లో "భూదాన్ ఉద్యమం" చేపట్టారు భావే. ఆ తరవాత 1983లో జనతా పార్టీ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ ఆర్నెల్ల పాటు సుదీర్ఘమైన పాదయాత్ర చేశారు. కన్యా  కుమారి నుంచి ఢిల్లీ వరకూ 4 వేల కిలోమీటర్లు కాలినడకన సాగారు. ఈ పాదయాత్రే తరవాత ఆయనను ప్రధానమంత్రిని చేసింది.1990లో ప్రధాని పదవి చేపట్టారు చంద్రశేఖర్. 

2. తెలుగు రాష్ట్రాల్లో "పాదయాత్ర" అనగానే గుర్తొచ్చేది వైఎస్ రాజశేఖర్ రెడ్డి. 2003లో ఆయన చేపట్టిన పాదయాత్ర ఓ సంచలనం. రెండు నెలల పాటు 1500 కిలోమీటర్ల మేర కాలినడకన సాగారు వైఎస్ఆర్. ఈ యాత్రే ఆయనను ప్రజలకు చేరువ చేసింది. 2004లో ముఖ్యమంత్రి పదవినీ కట్టబెట్టింది. 

3. 2013లో తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు 1700 కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టారు. ఆ తరవాత 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. 

4. 2017లో కాంగ్రెస్ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ నర్మదా యాత్రను చేపట్టారు. దాదాపు 3,300 కిలోమీటర్ల మేర సాగింది ఆయన యాత్ర. నర్మదా నదీతీరాల వెంబడి ఆయన కాలినడకన సాగారు. ఆ తరవాత 2018లో జరిగిన మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో 230 స్థానాలకు 114 సీట్లు గెలుచుకుంది కాంగ్రెస్. బీఎస్‌పీ, ఎస్పీతో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

5. ఇదే 2017లోనే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా పాదయాత్ర ప్రారంభించారు. నవంబర్ 6వ తేదీన మొదలైన యాత్ర ఏపీలోని 13 జిల్లాల్లో 3,648కిలోమీటర్ల మేర దాదాపు 341 రోజుల పాటు కొనసాగింది. ఈ పాదయాత్ర తరవాత జరిగిన 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఘన విజయం సాధించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. 

ఈ పరిణామాలన్నీ చెబుతున్నదొక్కటే. పాదయాత్రలతో ఫలితం ఉంటుందని. అందుకే...మరోసారి ఇదే సక్సెస్ ఫార్ములాతో ముందుకెళ్లాలని చూస్తున్నాయి కాంగ్రెస్, భాజపా. మరి ఈ యాత్రలు ఏ మలుపు తిరుగుతాయో చూడాలి. 

Also Read: MLA Raja Singh Suspension: బీజేపీ నుంచి రాజాసింగ్ సస్పెన్షన్ - వీడియో రిలీజ్ చేయడమే కారణం !

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
Case On KTR: ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 -  నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 - నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
KTR: ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారం - ఏసీబీ కేసు నమోదుపై స్పందించిన కేటీఆర్, ప్రభుత్వ తీరుపై హరీష్ రావు ధ్వజం
ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారం - ఏసీబీ కేసు నమోదుపై స్పందించిన కేటీఆర్, ప్రభుత్వ తీరుపై హరీష్ రావు ధ్వజం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అంబేడ్కర్ వివాదంపై పార్లమెంట్‌లో బీజేపీ, కాంగ్రెస్ ఆందోళనలుఅశ్విన్ రిటైర్మెంట్‌పై పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలునా కామెంట్స్‌ని ట్విస్ట్ చేశారు, అంబేడ్కర్ వివాదంపై అమిత్ షాMumbai Ferry Capsized 13 Died | నేవీ బోట్...టూరిస్ట్ బోట్ ఢీ కొట్టడంతోనే ప్రమాదం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
Case On KTR: ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 -  నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 - నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
KTR: ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారం - ఏసీబీ కేసు నమోదుపై స్పందించిన కేటీఆర్, ప్రభుత్వ తీరుపై హరీష్ రావు ధ్వజం
ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారం - ఏసీబీ కేసు నమోదుపై స్పందించిన కేటీఆర్, ప్రభుత్వ తీరుపై హరీష్ రావు ధ్వజం
Kia Syros: మోస్ట్ అవైటెడ్ కియా సీరోస్ వచ్చేసింది - డెలివరీ ఎప్పుడు? ఫీచర్లు ఎలా ఉన్నాయి?
మోస్ట్ అవైటెడ్ కియా సీరోస్ వచ్చేసింది - డెలివరీ ఎప్పుడు? ఫీచర్లు ఎలా ఉన్నాయి?
Fibernet Vyham: ఫైబర్‌నెట్ నుంచి ఆర్జీవీకి రెండు కోట్లకుపైగా చెల్లింపులు - పెద్ద స్కాం జరిగిందన్న చైర్మన్ జీ వీరెడ్డి
ఫైబర్‌నెట్ నుంచి ఆర్జీవీకి రెండు కోట్లకుపైగా చెల్లింపులు - పెద్ద స్కాం జరిగిందన్న చైర్మన్ జీ వీరెడ్డి
Telangana Tenth Exams: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది!
తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది!
Rahul Gandhi: బీజేపీ ఎంపీలపై దాడి - రాహుల్ గాంధీపై హత్యాయత్నం కేసు నమోదు
బీజేపీ ఎంపీలపై దాడి - రాహుల్ గాంధీపై హత్యాయత్నం కేసు నమోదు
Embed widget