జమ్ముకశ్మీర్‌లో ఆర్మీ వాహనంపై ఉగ్రదాడి, సైనికులు ఉగ్రవాదుల మధ్య కాల్పులు
Terror Attack: పూంఛ్‌లో ఇండియన్ ఆర్మీ వాహనంపై ఉగ్రదాడి జరిగింది.
![జమ్ముకశ్మీర్‌లో ఆర్మీ వాహనంపై ఉగ్రదాడి, సైనికులు ఉగ్రవాదుల మధ్య కాల్పులు Army Truck attacked by Terrorists In Jammu And Kashmir's Poonch జమ్ముకశ్మీర్‌లో ఆర్మీ వాహనంపై ఉగ్రదాడి, సైనికులు ఉగ్రవాదుల మధ్య కాల్పులు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/21/d898b0f7c90251fdc4ef401b3c9a6ef51703161104321517_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Poonch Terror Attack:
ఉగ్రదాడి..
జమ్ముకశ్మీర్‌లోని పూంఛ్‌లో ఆర్మీ వాహనంపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ సమాచారం అందిన వెంటనే అదనపు బలగాలను మొహరించారు. ఇదే ప్రాంతంలో ఉగ్రవాదులు, సైనికులకు మధ్య కాల్పులు జరుగుతున్నాయని తెలుస్తోంది. గత నెల కూడా పూంఛ్‌లోనే ఆర్మీపై దాడి చేశారు ఉగ్రవాదులు. Dera Ki Gali ప్రాంతం వద్ద ఈ దాడి జరిగినట్టు సమాచారం. ఈ ఏరియా ఉగ్రవాదులకు అడ్డాగా మారింది. పొంచి ఉండి దాడులు చేస్తున్నారు. కొన్నేళ్లుగా ఇదే ప్రాంతంలో ఉగ్రదాడులు పెరుగుతున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో 10 మంది సైనికులు ఉగ్రదాడుల్లో ప్రాణాలు కోల్పోయారు. 2003-21 మధ్య కాలంలోనే పూంఛ్ ఉగ్రవాదుల స్థావరంగా మారింది. ఈ ప్రాంతంలో జాయింట్ ఆపరేషన్ చేపడుతోంది ఆర్మీ. ఈ క్రమంలోనే పదేపదే ఉగ్రదాడులు జరుగుతున్నాయి.
J&K | A joint operation was launched yesterday in the general area of Surankote and Bafliaz of Poonch and contact with terrorists has been established today. Encounter is underway.
— ANI (@ANI) December 21, 2023
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)