Top Headlines Today: టీడీపీ యువగళం- నవశకంకు భారీ ఏర్పాట్లు! తెలంగాణ అసెంబ్లీలో శ్వేతపత్రంపై వార్
AP Telangana Latest News 20 December 2023: తెలుగు రాష్ట్రాల్లో నేటి ఉదయం నుంచి టాప్ హెడ్ లైన్స్ మీకోసం..

Andhra Pradesh Telangana News Today: కాళేశ్వరాన్ని 80వేల కోట్లతో కట్టామనడం అబద్దమన్న సీఎం రేవంత్ రెడ్డి
కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleswaram Project)ను 80వేల కోట్లతో కట్టామనడం అబద్దన్నారు ముఖ్యమంత్రి (Chief Minister) రేవంత్ రెడ్డి (Revanth Reddy ). తొమ్మిదిన్నర సంవత్సరాలుగా కేసీఆర్ కుటుంబ సభ్యులు (Kcr Family) తప్పా, ఎవరు సాగునీటి పారుదల శాఖకు మంత్రులుగా పని చేయలేదన్నారు. కాళేశ్వరం కార్పొరేషన్ రుణమే 97,448 కోట్లు మంజూరైందన్నారు. ప్రభుత్వం పెట్టిన ఖర్చు, తెచ్చిన రుణాలు కలిపితే అసలు లెక్క తేలుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రభుత్వం అడ్డుగోలుగా అప్పులు తెచ్చింది కాకుండా...ప్రభుత్వాన్ని దబాయిస్తున్నారని అన్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
శ్వేత పత్రాలు కావు, హామీలు ఎగవేసేందుకు కుట్రలు: హరీష్‌రావు
రాష్ట్రం అప్పులకుప్ప అంటూ ప్రభుత్వం చేస్తున్న ప్రచారంతో తెలంగాణ భవిష్యత్‌ను ప్రమాదకరంలో పడేస్తోందని ఆరోపించారు ఎమ్మెల్యే హరీష్‌రావు. ప్రభుత్వం విడుదల చేసిన శ్వేత పత్రంపై అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చలో పాల్గొన్న ఆయన కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ హడావుడి చూస్తుంటే ఎన్నికల టైంలో ఇచ్చిన హామీలను ఎగవేసేందుకు దారులు వెతుక్కుంటున్నట్టుగా ఉందన్నారు. తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రంపై మాజీమంత్రి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు మండిపడ్డారు. గురుశిష్యులు వండి వార్చినట్టు ఉందని ఎద్దేవా చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
బాగా ఎదిగి రాష్ట్రానికి మేలు చేయాలి - విదేశీ విద్యాదీవెన లబ్దిదారులకు సీఎం జగన్ సూచన !
విదేశీ విద్యా దీవెన, సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకాల నిధులను సీఎం జగన్ విడుదల చేశారు. 51 మందికి కొత్తగా అడ్మిషన్లు వచ్చాయి. వారికి ఈ కార్యక్రమం ద్వారా ఫీజులు రూ.9.5 కోట్లు ఇవ్వడం జరుగుతోంది. ఇదొక్కటే కాకుండా విదేశాల్లో ఉన్నత విద్య కోసం ఇప్పటి దాకా చదువుతున్న 408 మంది పిల్లలకు, ఈ సీజన్ లో ఫీజులు చెల్లించాల్సిన 390 మందికి వాళ్ల ఫీజు కలుపుకుంటే రూ.41.59 కోట్లు ఇవ్వడం జరుగుతోంది. దాదాపుగా రూ.107 కోట్లు 408 మంది పిల్లల కోసం ఈ పథకం పెట్టినప్పటి నుంచి ఖర్చు చేస్తున్నామని సీఎం జగన్ తెలిపారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
వైట్ పేపర్ వర్సెస్ కలర్ పేపర్ - అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్ బీఆర్ఎస్ ఇంట్రెస్టింగ్ ఫైట్
తెలంగాణలో కాంగ్రెస్- బీఆర్ఎస్ మధ్య ఎలక్షన్ ఫైట్ ముగిసింది. కానీ కొత్తగా పేపర్ ఫైట్ ప్రారంభమైంది. అసెంబ్లీలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, బీఆర్‌ఎస్ పాలనపై శ్వేత పత్రం విడుదల చేసింది. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రజలకు వివరిస్తున్నారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని, కాళేశ్వరం ద్వారా కమీషన్లు సంపాదించారని ఎప్పటి నుంచో కాంగ్రెస్ పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నేతలపై ఆరోపణలు గుప్పించింది. ఎంతో గొప్పగా చెప్పుకున్న కాళేశ్వరం ప్రాజెక్టు నాసిరకంగా కట్టారని అందుకే కుంగుబాటుకు అది గురైందని విమర్శలు చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
టీడీపీ యువగళం-నవశకంకు భారీ ఏర్పాట్లు - అన్ని దారులు పోలిపల్లి వైపే !
యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర దిగ్విజయంగా పూర్తైన సందర్భంగా బుధవారం నిర్వహించనున్న యువగళం-నవశకం బహిరంగ సభకు టీడీపీ నేతలు భారీ ఏర్పాట్లు చేసారు. ఈ సభకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో పాటు ఇరు పార్టీలకు చెందిన అతిరథ మహారధులు హాజరుకానుండటంతో యావత్ ఆంధ్రప్రదేశ్ చూపు. విజయనగరం జిల్లా, పోలిపల్లి వద్ద జరిగే బహిరంగ సభపై పడింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి





















