Breaking News Live Telugu Updates: హైదరాబాద్ పాతబస్తీలో హై అలర్ట్- భద్రతా బలగాల ఫ్లాగ్ మార్చ్
ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రిఫ్రెష్ చేస్తుండండి.
LIVE

Background
చంద్రబాబు కుప్పం పర్యటనలో ఉద్రిక్తత-
కుప్పంలో చంద్రబాబు నాయుడు మూడు రోజుల పర్యటన ప్రారంభమైంది. హైదరాబాద్ నుంచి బెంగుళూరు చేరుకున్న చంద్రబాబు రామకుప్పం మండలం, కొంగనపల్లి నుంచి తన పర్యటనను ప్రారంభించారు చంద్రబాబు. టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆయనకు స్వాగతం పలికాయి. కొంగనపల్లి నుంచి కొల్లుపల్లి, జల్దిగానిపల్లి మీదుగా రోడ్ షో రామకుప్పానికి చేరనుంది. రామకుప్పంలో బాదుడే బాదుడు కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు పాల్గొనున్నారు. చంద్రబాబు నాయుడు పర్యటనలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. నాయుడు పర్యటించే ప్రాంతాల్లో వైసీపీ నాయకులు తమ పార్టీ జెండాలు కట్టారు. ముఖ్యంగా రామకుప్పం మండలం కొల్లుపల్లెలో స్థానిక వైసిపి నేతలు దారిపొడవున పార్టీ జెండాలు కట్టారు. వాటిపై టీడీపీ శ్రేణులు అభ్యంతరం వ్యక్తం చేశారు. వాటిని తొలగించాలని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసుల పట్టించుకోకపోయేసరికి... వాళ్లే స్వయంగా జెండాలు పీకే ప్రయత్నం చేశారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కాస్త ఉద్రిక్తత పరిస్థితి నెలకొన్నాయి. పోలీసులు, వైసీపీ నేతల తీరుకు నిరసనగా టీడీపీ శ్రేణులు రోడ్డుపై బైఠాయించారు.
నల్గొండ జిల్లాలోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో పేలిన రియాక్టర్- ఒకరు సజీవదహనం
నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడులోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం జరిగింది. అగ్నిప్రమాదం కారణంగా కెమికల్ ఫ్యాక్టరీలోని రియాక్టర్ పేలినట్టు సమాచారం అందుతోంది. ఈ ప్రమాదం ధాటికి భారీగా మంటలు ఎగసి పడుతున్నాయి. ప్రమాద స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రమాదంలో ప్రస్తుతానికి ఒకరు మృతి చెందినట్టు సమాచారం అందుతోంది. కానీ మరికొందరు చనిపోయినట్టు అక్కడ పని చేసేవాళ్లు చెబుతున్నారు. చాలా మంది గాయపడినట్టు కూడా తెలియజేస్తున్నారు. ప్రమాదం కారణంగా పొగ కమ్ముకోవడంతో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. దీంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు.
హైదరాబాద్ పాతబస్తీలో హై అలర్ట్- భద్రతా బలగాల ఫ్లాగ్ మార్చ్
హైదరాబాద్‌లోని పాతబస్తీలో హై అలర్ట్ ప్రకటించింది. కఠిన ఆంక్షలు అమలు చేస్తోంది ప్రభుత్వం. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు చర్యలు చేపట్టింది ప్రభుత్వం. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, సీఆర్‌పీఎఫ్, లోకల్ పోలీసులు పాతబస్తీలో భారీగా మోహరించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ఫ్లాగ్ మార్చ్ నిర్వహిస్తున్నారు.
శాంతి భద్రతలపై సీఎం అత్యవసర సమావేశం
తెలంగాణలో శాంతిభద్రతలపై ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యవసర సమావేశం నిర్వహిస్తున్నారు. ప్రగతి భవన్‌లో ఈ భేటీ జరుగుతోంది. ఈ మీటింగ్‌లో డీజీపీ మహేందర్‌రెడ్డి, అడిషనల్ డీజీ లా అండ్ ఆర్డర్, ఇద్దరు ఐజీలు , మూడు కమిషనరేట్ సీపీలు పాల్గొన్నారు.
బండి సంజయ్ యాత్రపై హైకోర్టులో విచారణ రేపటికి వాయిదా
బండి సంజయ్ యాత్రపై విచారణ చేపట్టిన హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. పాదయాత్ర ఆపేయాలన్న జనగామ పోలీసుల నోటీసులపై బీజేపీ న్యాయపోరాటం చేస్తోంది. కోర్టులోనే తేల్చోవాలని నిర్ణయించి తెలంగాణ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేశారు బండి సంజయ్. దీనిపై 3.45 గంటలకు విచారించిన హైకోర్టు రేపటికి వాయిదా వేసింది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

