Breaking News Live Telugu Updates: అధికారుల్ని డిమోట్ చేయడం కెసిఆర్ తుగ్లక్ పాలనకు నిదర్శనం: బండి సంజయ్
ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

Background
ఆగ్నేయ బంగాళాఖాతానికి ఆనుకొని నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారింది. అదే తీవ్రతతో నెమ్మదిగా కదులుతోంది. 24గంటల్లో ఉత్తర వాయవ్య దిశగా ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర తీరాలవైపు రానుంది. ఇది గంటకు 12కిలోమీటర్ల వేగంతో ఉత్తర వాయవ్య దిశగా కదులుతోంది. ఆదివారం రాత్రికి శ్రీలంకలోని జాఫ్నాకు తూర్పుగా 540 కిలోమీటర్లు, చెన్నైకి తూర్పు ఆగ్నేయంగా 510 కిలోమీటర్ల దూరంలో, కారైకాల్‌కు తూర్పున 520 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది.
ఇది వచ్చే 6 గంటల్లో ఇప్పుడున్న తీవ్రతతోనే కొనసాగనుంది. తర్వాత వాయువ్య దిశగా నెమ్మదిగా కదిలబోతోంది. ఆ తర్వాత పశ్చిమ-వాయువ్య దిశగా పయనించి, క్రమంగా బలహీనపడి అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. ఇది 24 గంటల్లో దక్షిణ ఆంధ్రప్రదేశ్, ఉత్తర తమిళనాడు-పుదుచ్చేరి తీరాల వైపు కదులుతుంది.
తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ తీరాలవైపు వచ్చే క్రమంలో అల్పపీడనం బలహీనపడుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. దీని ప్రభావం కారణంగా సోమవారం, మంగళవారం, బుధవారం దక్షిణకోస్తాంధ్ర, రాయలసీమలో వర్షాలు పడే అవకాశం ఉంది. అక్కడక్కడ భారీ వర్షాలు మరికొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు పడొచ్చని తెలిపింది
Weather inference for Andhra Pradesh dated 20-11-2022 pic.twitter.com/9QHz5FWdBV
— MC Amaravati (@AmaravatiMc) November 20, 2022
ఈ అల్పపీడన ప్రభావం ఉత్తర కోస్తాపై కూడా ఉంటుంది. కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు పడొచ్చు. దక్షిణ కోస్తా, రాలయసీమలో ఉరుములతో కూడిన జల్లులు పడతాయి. తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. సముద్రం అలడిగా ఉంటుంది. మత్స్యకారులు రెండు రోజుల పాటు వేటకు వెళ్లొద్దని వాతావరణ అధికారులు సూచిస్తున్నారు.
ఈ అల్పపీడం వల్ల కురిసే వర్షాలు, వీచేగాలులు కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో ఉష్ణోగ్రతుల బాగా పడిపోనున్నాయి. చలి బాగా పెరిగే అవకాశం ఉంది.
7 Day Mid-day forecast in for Andhra Pradesh dated 20.11.2032 pic.twitter.com/3AKxfIy0sM
— MC Amaravati (@AmaravatiMc) November 20, 2022
తెలంగాణలో వాతావరణం
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం తెలంగాణపై కూడా ఉంది. ఆకాశం మేఘావృతమై ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో సోమవారం, మంగళవారం ఉరుములతో కూడిన చిరుజల్లులు పడొచ్చు. బుధవారం, గురువారం మాత్రం వాతావరణం పొడిగా ఉంటుంది.
— IMD_Metcentrehyd (@metcentrehyd) November 20, 2022
హైదరాబాద్‌లో సహా పలు ప్రాంతాల్లో పొగమంచు ఏర్పడే ఛాన్స్ ఉంటుంది. గరిష్టంగా 28 డిగ్రీలు, కనిష్టంగా 14డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. ఈశాన్య, ఉత్తర దిశల నుంచి గాలులు గంటలు నాలుగు నుంచి ఎనిమిది కిలోమీటర్ల వేగంతో వీస్తాయి. అత్యధిక టెంపరేచర్ ఖమ్మంలో 31.6 డిగ్రీలు ఉంటే.. అత్యల్పం ఆదిలాబాద్‌లో 9.2 డిగ్రీలుగా నమోదు అయింది.
అధికారుల్ని డిమోట్ చేయడం కెసిఆర్ తుగ్లక్ పాలనకు నిదర్శనం: బండి సంజయ్
అధికారుల్ని డెమోట్ చేయడం కెసిఆర్ తుగ్లక్ పాలనకు నిదర్శనం: బండి సంజయ్ కుమార్
బండి సంజయ్ కుమార్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కరీంనగర్ ఎంపీ
హైదరాబాద్: ట్రాన్స్ కో, జెన్ కో సంస్థల్లో అధికారుల్ని డెమోట్ చేయడం కెసిఆర్ తుగ్లక్ పాలనకు నిదర్శనం.
* కేసీఆర్ అనాలోచిత నిర్ణయం వల్లనే ఈ పరిస్థితి తలెత్తింది.
* తెలంగాణ అధికారుల్లో ఏ ఒక్కరికి అన్యాయం జరిగినా ఊరుకోం
* కేసీఆర్ చేసిన తప్పులకు అధికారులు బలి అవుతున్నారు
* బకాయిలు చెల్లించకుండా కేసీఆర్ విద్యుత్ సంస్థల్ని నష్టాల పాల్జేశారు.
* ఏప్రిల్ లో ఇవ్వాల్సిన కొత్త పే రివిజన్ ఇప్పటి వరకు ప్రకటించలేదు. అయినా కూడా ఉద్యోగులు కష్టపడి సంస్థలను కాపాడుకుంటున్నారు.
* ఉద్యోగాలు ఇవ్వమని అడిగితే ఉన్న ఉద్యోగుల్ని తొలగిస్తున్నారు. ప్రమోషన్లు ఇవ్వమంటే డిమోషన్ చేస్తున్నారు.
* డిమోషన్ నిర్ణయాన్ని వెంటనే విరమించుకోవాలి.
* బాధిత అధికారులు చేసే పోరాటానికి బిజెపి అండగా ఉంటుంది.
Kondapur Suicide: మంత్రి పీఏ కుమారుడు ఆత్మహత్య
- గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో యువకుడు ఆత్మహత్య
- కొండాపూర్ సెంట్రల్ పార్క్ లోని తన నివాసం లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న యువకుడు అక్షయ్ (23)
- ఆత్మహత్య చేసుకున్న యువకుడు తెలంగాణ రాష్ట్ర మంత్రి పీఏ కుమారుడిగా గుర్తింపు
- ఉదయం 10 30 ప్రాంతంలో ఘటన జరిగినట్టు తెలిపిన పోలీసులు
- కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న గచ్చిబౌలి పోలీసులు





















