అన్వేషించండి

Breaking News Live Telugu Updates:  విశాఖ ఉక్కు కర్మాగారంలో ప్రమాదం, 9 మంది కార్మికులకు తీవ్ర గాయాలు

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

LIVE

Key Events
Breaking News Live Telugu Updates:  విశాఖ ఉక్కు కర్మాగారంలో ప్రమాదం, 9 మంది కార్మికులకు తీవ్ర గాయాలు

Background

తెలంగాణ సచివాలయం ప్రారంభోత్సవం  వాయిదా పడింది. తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా వాయిదా పడినట్టు తెలుస్తోంది. తెలంగాణా రాష్ట్ర కొత్త సచివాలయం నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. 

ఫిబ్రవరి 17న తెలంగాణ సచివాలయాన్ని ప్రారంబించాలని ప్రభుత్వ భావించింది. దీని కోసం భారీ ఏర్పాట్లను తెలంగాణ ప్రభుత్వం చేస్తోంది. కానీ ఇంతలో ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. దీంతో ఈ ప్రారంభోత్సవం వాయిదా వేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. కొత్త తేదీని త్వరలోనే ప్రకటిస్తామని వెల్లడించింది. 

సిఎం కేసిఆర్ పుట్టినరోజు ఫిబ్రవరి 17న నూతన సచివాలయం ప్రారంభోత్సవాన్ని ఘనంగా చేయాలని తెలంగాణ ప్రభుత్వం ప్లాన్ చేసింది. ఆ సమయానికి దాదాపు అన్ని పనులు పూర్తి చేసేలా అధికారులు పనులను పరుగులు పెట్టిస్తున్నారు. ఎన్నో ప్రత్యేకతలు, మరెన్నో ఆకర్షణలతో నూతన సచివాలయం నిర్మాణం జరుగుతోంది. జూన్ 27వ తేది 2019న నూతన సచివాలయానికి సీఎం కేసీఆర్ భూమి పూజ చేశారు. నాలుగేళ్ల వ్యవధిలోపే ప్రస్తుతం నిర్మాణం పనులు తుది మెరుగులు దిద్దుకుంటున్నాయి. తెలంగాణ రాష్ట్రానికి తలమానికంగా నిలిచే ఈ సచివాలయం రూ. 610 కోట్ల రూపాయల వ్యవయంతో రూపుదిద్దుకుంటోంది.

వాస్తవానికి ఈ ఏడాది జనవరి 18న ఈ నూతన సచివాలయాన్ని ప్రారంభించాలని భావించినప్పటికీ పనులు పెండింగ్ లో ఉండటంతో సచివాలయ ప్రరంభాన్ని ఫిబ్రవరి 17కు వాయిదా వేశారు. కొత్త సచివాలయానికి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ పేరును ఇప్పటికే ప్రభుత్వం ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.  డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణా సచివాలయం మరి కొద్ది రోజుల్లోనే తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింభించేలా వైభవంగా ప్రారంభం కానుంది. 

సచివాలయ ప్రారంభ అనంతరం పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించే బహిరంగ సభకు ప్రతి నియోజకవర్గం నుంచి 10 వేల మంది హాజరయ్యేలా చూడాలని ఆదేశించారు. జన సమీకరణ కోసం ఈ నెల 13 న గ్రేటర్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించాలని సూచించారు. ఇతర జిల్లాలకు చెందిన సీనియర్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ప్రతి నియోజకవర్గానికి ఇంచార్జిలుగా నియమిస్తామని..ఇంచార్జిలు 13 నుంచి 17 వరకు వారికి కేటాయించిన నియోజకవర్గాల్లోనే ఉండి పర్యవేక్షిస్తారని తెలిపారు. సచివాలయ  ప్రారంభోత్సవం, పరేడ్ గ్రౌండ్ సభను అందరు కలిసికట్టుగా విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
  
150-200 ఏండ్ల వరకు చెక్కుచెదరకుండా ఉండేలా సెక్రటేరియట్ ను నిర్మించారు.  20 ఎకరాల సువిశాలమైన స్థలంలో రూ.617 కోట్లతో గ్రీన్‌ బిల్డింగ్‌ కాన్సెప్ట్‌ పద్ధతిలో సచివాలయ నిర్మాణపనులు చేపట్టారు. భవనంలోకి సహజమైన గాలి, వెలుతురు వచ్చేలా డిజైన్‌ చేశారు. ఆరు అంతస్తుల్లో పాలనా విభాగాలు ఉండనున్నాయి. ఆరో అంతస్తులో సీఎం కార్యాలయంతోపాటు మంత్రివర్గ సమావేశ మందిరం, మరో పెద్ద హాల్‌ ఉంటాయి. ఇక బిల్డింగ్‌లోని రెండో అంతస్తు నుంచి మంత్రుల ఆఫీసులు ఉంటాయి. ఫస్ట్‌, సెకండ్‌ ఫ్లోర్‌లో సాధారణ పరిపాలనా శాఖ, ఆర్థిక శాఖ కార్యాలయాలు ఉంటాయి. విశాలమైన స్థలంలో పార్కింగ్‌ ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులు, సిబ్బందికి వేర్వేరుగా పార్కింగ్‌ ఉంటుంది.

14:39 PM (IST)  •  11 Feb 2023

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌లో ప్రమాదం - ద్రవ ఉక్కు పడి 9 మందికి గాయాలు

విశాఖ ఉక్కు కర్మాగారం లో ప్రమాదం జరిగింది. స్టీల్ ప్లాంట్ SMS - 2లో ద్రవ ఉక్కును తీసుకెళ్తున్న లాడెల్ పగిలి పోవడం తో ప్రమాదం జరిగింది. దీంతో ద్రవ ఉక్కు పడి 9 మంది కార్మికులకు తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రుల్లో ఒక డీజీఎం, ఇద్దరు శాశ్వత ఉద్యోగులు, ఆరుగురు కాంట్రాక్టు కార్మికులు ఉన్నారు. బాధితులను విశాఖ జనరల్ హాస్పిటల్ కి తరలించింది యాజమాన్యం. 

14:35 PM (IST)  •  11 Feb 2023

 విశాఖ ఉక్కు కర్మాగారంలో ప్రమాదం, 9 మంది కార్మికులకు తీవ్ర గాయాలు

విశాఖ ఉక్కు కర్మాగారంలో ప్రమాదం చోటుచేసుకుంది. స్టీల్ ప్లాంట్ SMS - 2 లో ద్రవ ఉక్కును తీసుకెళ్తున్న లాడెల్ పగిలి పోవడంతో ప్రమాదం జరిగింది. దీంతో ద్రవ ఉక్కు పడి 9 మంది కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో ఒక డీజీఎం, ఇద్దరు శాశ్వత ఉద్యోగులు, ఆరుగురు కాంట్రాక్టు కార్మికులు ఉన్నారు. బాధితులను విశాఖ జనరల్ హాస్పిటల్ కి తరలించారు. 

14:22 PM (IST)  •  11 Feb 2023

తిప్పేసిన స్పిన్నర్లు- తొలి టెస్టులో ఆస్ట్రేలియాపై భారత్ ఘనవిజయం

బోర్డర్ గవాస్కర్ తొలి టెస్టులో ఆస్ట్రేలియాపై భారత్ ఘన విజయం సాధించింది. స్పిన్నర్లు ధాటికి మూడో రోజే ఆస్ట్రేలియా క్రికెటర్లు చాపచుట్టేశారు. 223 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్.. అశ్విన్, జడేజా, అక్షర్ ల ధాటికి  కుప్పకూలింది.  

12:21 PM (IST)  •  11 Feb 2023

ఆస్ట్రేలియాతో తొలిటెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 400లకు భారత్‌ ఆలౌట్‌- 223 పరుగుల ఆధిక్యం

ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో భారత్‌ 223 పరుగుల లీడ్‌లో నిలిచింది. ఏడు వికెట్ల నష్టానికి 321 పరుగుల ఓవర్‌నైట్‌ స్కోరుతో మూడో రోజు బ్యాటింగ్ ఆరంభించిన భారత్‌ 400 పరుగులకు ఆలౌట్ అయింది. అక్షర్ పటేల్, షమీ అద్భుతంగా రాణించి భారత్‌కు మంచి స్కోరు అందించారు. అక్షర్‌ పటేల్‌ 84 పరుగులు చేయగా.. షమీ 37 పరుగులు చేశాడు. అక్షర్ పటేల్‌కు ఇదే అత్యధిక టెస్టు స్కోరు. 

321 పరుగుల ఓవర్‌నైట్‌ స్కోరుతో ఆట ఆరంభించిన భారత్‌కు ఆదిలోనే మర్ఫీ దెబ్బ తీశాడు. జడేజా, అక్షర్‌ పటేల్‌ పటిష్టమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పుతన్న టైంలో మర్ఫీ వీళ్లను విడదీశాడు. 70 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద జడేజాను ఔట్ చేశాడు. అనంతరం షమీ క్రీజ్‌లోకి వచ్చాడు. అప్పుడప్పుడు ధాటిగా ఆడుతూ షమీ 37 పరుగులు చేశాడు. అక్షర్ పటేల్‌కు మంచి సహకారం అందించాడు. మర్ఫీ వేసిన ఓ ఓవర్‌లో రెండు సిక్సర్లు, ఓ ఫోర్ కొట్టి మంచి ఊపు మీద ఉన్న షమీ... తర్వాత వేసిన ఓవర్‌లో మర్ఫీ బోల్తా కొట్టించాడు. దీంతో మర్ఫీ అరంగేట్రం టెస్టులో ఏడు వికెట్లు తీసుకొని కొత్త రికార్డులు నెలకొల్పాడు. 

 

Load More
New Update
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
Satellite Messaging: సిగ్నల్ లేకపోయినా మెసేజింగ్ - ఎలా పని చేస్తుంది? - ఆకాశం నీలంగా ఉండాలి!
సిగ్నల్ లేకపోయినా మెసేజింగ్ - ఎలా పని చేస్తుంది? - ఆకాశం నీలంగా ఉండాలి!
Andhra News: సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు - వారికి ఈ నెల నుంచే రూ.4 వేల పెన్షన్
సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు - వారికి ఈ నెల నుంచే రూ.4 వేల పెన్షన్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తిమాదాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరు యువకులు మృతిపవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
Satellite Messaging: సిగ్నల్ లేకపోయినా మెసేజింగ్ - ఎలా పని చేస్తుంది? - ఆకాశం నీలంగా ఉండాలి!
సిగ్నల్ లేకపోయినా మెసేజింగ్ - ఎలా పని చేస్తుంది? - ఆకాశం నీలంగా ఉండాలి!
Andhra News: సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు - వారికి ఈ నెల నుంచే రూ.4 వేల పెన్షన్
సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు - వారికి ఈ నెల నుంచే రూ.4 వేల పెన్షన్
HYDRA: '200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
'200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
Borewell: అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
Suzuki Access 125: భారత మార్కెట్లో సుజుకి కొత్త మైలురాయి - 60 లక్షల మార్కు దాటిన యాక్సెస్!
భారత మార్కెట్లో సుజుకి కొత్త మైలురాయి - 60 లక్షల మార్కు దాటిన యాక్సెస్!
పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు
పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు
Embed widget