News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X
ఎన్నికల ఫలితాలు 2023

Roja Challenge: జగన్ ను ఓడించేటోడు పుట్టలేదు - చంద్రబాబు, బాలకృష్ణకు దమ్ముంటే రాజీనామా చేసి గెలవాలి - మంత్రి రోజా ఛాలెంజ్

టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌, ఎమ్మెల్యే బాలకృష్ణలపై ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా మరోసారి విరుచుకుపడ్డారు.

FOLLOW US: 
Share:

టీడీపీ నేతలు చంకలు గుద్దుకుంటున్నారు కానీ, పులివెందులలో సీఎం జగన్‌ను ఓడించే మగాడు పుట్టలేదన్నారు మంత్రి రోజా. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌, ఎమ్మెల్యే బాలకృష్ణలపై ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా మరోసారి విరుచుకుపడ్డారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొన్న రోజా మాట్లాడుతూ.. పులివెందులలో సీఎం జగన్ ను ఓడించే మగాడు పుట్టలేదన్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచామని టీడీపీ నేతలు చంకలు గుద్దుకుంటున్నారని, అయితే నిజంగానే దమ్ముంటే ఆ ముగ్గురు నేతలు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధమా అని సవాల్ విసిరారు. 

మాజీ సీఎం చంద్రబాబు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ, అచ్చెన్నాయుడులకు దమ్ముంటే ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి ఎన్నికలకు రావాలని మంత్రి రోజా సవాల్‌ విసిరారు. వైజాగ్ లో మాకు మద్దతు లేదన్నారు కదా అయితే వైజాగ్ నుంచి ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, చిత్తూరు నుంచి చంద్రబాబు, అనంతపురం నుంచి బాలకృష్ణ పోటీ చేయడానికి సిద్ధమా అని ఛాలెంజ్ చేశారు. ఎన్నికల గుర్తు ఫ్యాన్ కనిపిస్తే ప్రజలు కచ్చితంగా తమ పార్టీకి ఓటు వేస్తారని చెప్పారు. మరోవైపు చంద్రబాబు, లోకేష్ గల్లీ గల్లీ తిరిగినా ప్రజలు వారిని వెళ్లగొట్టారని వ్యాఖ్యానించారు. యువతకు చంద్రబాబు, లోకేష్ ఏం చేశారని మంత్రి రోజా ప్రశ్నించారు.వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 2024లో జగన్‌తోనే ప్రజలు ఉంటారని, తాము చేసిన మంచి పనులే వైసీపీని గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. నోరుంది కదా అని వైసీపీ గురించి, సీఎం జగన్ గురించి  టీడీపీ నేతలు ఏది పడితే అది మాట్లాడితే చూస్తు ఊరుకోమని వార్నింగ్ ఇచ్చారు. వై నాట్ పులివెందుల లాంటి కామెంట్లు చేస్తున్న వ్యక్తికి దమ్ముంటే పులివెందుల వచ్చి సీఎం జగన్ పై పోటీ చేయాలని సవాల్ విసిరారు.

అభ్యర్థులు వారి సొంత గుర్తులతో పోటీ చేసి విజయం సాధిస్తే చంద్రబాబు అండ్ టీడీపీ బ్యాచ్ అది తమ విజయం అంటూ సెలబ్రేట్ చేసుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి చిరంజీవి రావు ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే ఇంకా ఎక్కువ ఓట్లు వచ్చేవంటూ టీడీపీ నేతలను ఎద్దేవా చేశారు. ఫ్యాన్ గుర్తుతో పోటీ చేస్తే ప్రజలు కచ్చితంగా వైసీపీకే ఓట్లు వేస్తారన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో మూడు పట్టభద్రులు నియోకవర్గాల్లో ఎన్నికలు జరిగితే అన్ని స్థానాలను కైవశం చేసుకుంది టీడీపీ. తూర్పు రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గం అంటే ఉమ్మడి ప్రకాశం – నెల్లూరు – చిత్తూరు నియోజకవర్గ పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్ విజయకేతనం ఎగరేశారు. రెండో ప్రాధాన్యత ఓట్లతో గెలుపొందారు. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో టీడీపీ అభ్యర్థి వేపాడ చిరంజీవి రావు వైసీపీ తరపున పోటీ చేసిన శీతంరాజు సుధాకర్ పై భారీ మెజారిటీతో గెలుపొందారు. పశ్చిమ రాయలసీమ పట్టభద్ర నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి విజయం సాధించారు.  కడప - అనంతపురము - కర్నూలు నియోజకవర్గాల ఎన్నికల్లో భూమిరెడ్డి రామగోపాల్ రెడ్ వైఎస్ఆర్‌సీపీ వెన్నపూస రవీంద్ర రెడ్డిపై 7543 ఓట్ల తేడాతో విజయం సాధించారు.

Published at : 19 Mar 2023 10:56 PM (IST) Tags: Balakrishna AP Assembly Sessions Chandrababu TDP RK Roja

ఇవి కూడా చూడండి

Javeria Khanum: పాకిస్తాన్ పోరీతో బెంగాల్ కుర్రాడి పెళ్లి, ఇండియాలోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన పెళ్లికూతురు

Javeria Khanum: పాకిస్తాన్ పోరీతో బెంగాల్ కుర్రాడి పెళ్లి, ఇండియాలోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన పెళ్లికూతురు

Gurpatwant Singh Warning: భారత పార్లమెంట్‌పై దాడి చేస్తా, ఢిల్లీని ఖలిస్థాన్‌గా మార్చేస్తా - గురుపత్వంత్ సింగ్ వార్నింగ్

Gurpatwant Singh Warning: భారత పార్లమెంట్‌పై దాడి చేస్తా, ఢిల్లీని ఖలిస్థాన్‌గా మార్చేస్తా - గురుపత్వంత్ సింగ్ వార్నింగ్

Chandra Babu News: ఎల్లుండి ఢిల్లీ వెళ్లనున్న చంద్రబాబు- అనంతరం జిల్లా పర్యటనలు

Chandra Babu News: ఎల్లుండి ఢిల్లీ వెళ్లనున్న చంద్రబాబు- అనంతరం జిల్లా పర్యటనలు

Latest Gold-Silver Prices Today 06 December 2023: రెండోరోజూ పసిడి పతనం - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి

Latest Gold-Silver Prices Today 06 December 2023: రెండోరోజూ పసిడి పతనం - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి

Cyclone Michaung: అల్పపీడనంగా మారిన మిచౌంగ్‌ తుఫాన్, ఏపీలో 40 లక్షల మందిపై ప్రభావం

Cyclone Michaung: అల్పపీడనంగా మారిన మిచౌంగ్‌ తుఫాన్, ఏపీలో 40 లక్షల మందిపై ప్రభావం

టాప్ స్టోరీస్

Michaung Cyclone Effect In AP: మిగ్‌జాం తుపాను ధాటికి ఏపీ కకావికలం- బోరుమంటున్న రైతులు

Michaung Cyclone Effect In AP: మిగ్‌జాం తుపాను ధాటికి ఏపీ కకావికలం- బోరుమంటున్న రైతులు

Telangana CM Revanth Reddy: సీఎం అయ్యాక రేవంత్ రెడ్డి తొలి ట్వీట్ చూశారా! వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు

Telangana CM Revanth Reddy: సీఎం అయ్యాక రేవంత్ రెడ్డి తొలి ట్వీట్ చూశారా! వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు

Venu Swamy: వరుణ్ తేజ్, లావణ్య కలిసుండే అవకాశాల్లేవ్ - వాళ్ళిద్దరి జాతకాలపై వేణు స్వామి సంచనల వ్యాఖ్యలు

Venu Swamy: వరుణ్ తేజ్, లావణ్య కలిసుండే అవకాశాల్లేవ్ - వాళ్ళిద్దరి జాతకాలపై వేణు స్వామి సంచనల వ్యాఖ్యలు

Telangana New CM Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి..కార్యకర్తల సంబరాలు | ABP Desam

Telangana New CM Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి..కార్యకర్తల సంబరాలు | ABP Desam
×