By: ABP Desam | Updated at : 17 Jan 2023 06:02 PM (IST)
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కొండ్రు మురళి
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దళిత ద్రోహి అని, రాష్ట్రంలో దళితులకు జగన్ సర్కార్ అపకారం చేస్తోందని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కొండ్రు మురళి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏపీ సీఎం జగన్ ఒక సైకో అని, ఆయనకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. విశాఖపట్నంలో మాజీ మంత్రి కొండ్రు మురళీ మీడియాతో మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీల మీదే అట్రాసిటీ కేసులు పెట్టిన ఘనత జగన్ దే అన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు వైసిపి సర్కార్ మళ్లిస్తోందని ఆరోపించారు. ఎస్సీ కార్పొరేషన్ ను పూర్తిగా నిర్వీర్యం చేశారంటూ మండిపడ్డారు.
టీడీపీ హయాంలోనే రెసిడెన్షియల్ స్కూల్ ను ఎన్టీఆర్ ప్రారంభించారని కొండ్రు మురళీ అన్నారు. కానీ ఎస్సీ, ఎస్టీలకు జగన్ ఎంత అన్యాయం చేశారో అంకెలతో సహా చెబుతాము అన్నారు. జీవో నెం. 77 తీసుకొచ్చి.. ఎస్సీ, ఎస్టీ పిల్లలకు స్కాలర్ షిప్, ఫీజ్ రియంబర్స్ మెంట్ లేకుండా చేసిన వ్యక్తి సీఎం జగన్ అన్నారు. ఇప్పుడు ఎస్సీ, ఎస్టీల డపట్టాలను లాక్కుంటున్నారని, ఈ సామాజిక వర్గాలను ఏపీ సీఎం జగన్ మోసం చేస్తున్నారని ఆరోపించారు. కానీ ఇంత జరుగుతున్నా ఎస్సీ, ఎస్టీల మంత్రులుగానీ, వైసిపి నేతలు నోరు విప్పడం లేదని మండిపడ్డారు. జగన్ ఒక సైకో అని, అయనకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ప్రజలకు ఉందన్నారు. 28 పధకాలను తొలగించారు.. టిడిపి అధికారంలోకి రాగానే అమలు చేస్తామన్నారు. బ్యాక్ లాక్ పోస్టులు భర్తీ చేయడం లేదు అన్నారు.
Nara Lokesh Yatra: శాంతిపురం సండే మార్కెట్లో లోకేష్ పర్యటన, దివ్యాంగుడికి సాయం చేస్తానని యువనేత హామీ
BRS Nanded Meeting: నాందేడ్‌లో బీఆర్ఎస్ సభ, ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
Adilabad Cheddi Gang : ఆదిలాబాద్ జిల్లాలో చెడ్డీ గ్యాంగ్ కలకలం, రాత్రిపూట కర్రలతో గ్రామాల్లో గస్తీ
Junior NTR on Taraka Ratna: అన్న చికిత్సకు స్పందిస్తున్నారు, కానీ ఆ విషయం చెప్పలేం - ఎన్టీఆర్
ABP Desam Top 10, 29 January 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
మొన్న బాలకృష్ణ, నేడు చిరంజీవి - వివాదాలకు కేరాఫ్ గా సక్సెస్ మీట్లు? ఇంతకీ ఏమైంది?
Nara Lokesh Yatra: తాళిబొట్లు తాకట్టు పెట్టించిన వ్యక్తి సీఎం, ఎంత మోసగాడో అర్థం చేసుకోండి - లోకేశ్ వ్యాఖ్యలు
Delhi Khalistan Attacks : దిల్లీలో ఖలిస్థానీ స్లీపర్ సెల్స్, ఉగ్రదాడులకు ప్లాన్- నిఘా సంస్థల హెచ్చరిక
U-19 womens WC Final: అమ్మాయిలు సాధిస్తారా! నేడే మహిళల అండర్- 19 టీ20 ప్రపంచకప్ ఫైనల్