News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Super Star Krishna Passed Away: సూపర్ స్టార్ మృతికి సంతాపంగా ఉదయం ఆటలు రద్దు- ఏపీ డిస్ట్రిబ్యూటర్స్‌ నిర్ణయం!

Super Star Krishna Passed Away: సూపర్ స్టార్ కృష్ణ మృతికి సంతాపంగా పశ్చిమగోదావరి జిల్లా డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబ్యూటర్స్ థియేటర్లలో ఉదయం షోలను రద్దు చేస్తున్నట్లు తెలిపారు. 

FOLLOW US: 
Share:

Super Star Krishna Passed Away: సూపర్ స్టార్ కృష్ణ మృతికి సంతాపంగా ఏపీ డిస్ట్రిబ్యూటర్స్‌, ఎగ్జిబ్యూటర్స్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. రేపు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మార్నింగ్ షోలు రద్దు చేస్తున్నట్లు ఏపీ డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబ్యూటర్స్ తెలిపారు. సూపర్ స్టార్ కృష్ణ మృతికి సంతాపంగానే రేపు ఉదయం షోలు రద్దు చేస్తున్నట్లు వివరించారు. 

పశ్చిమగోదావరి జిల్లా డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబ్యూటర్స్ థియేటర్లలో ఉదయం షోలను రద్దు చేస్తున్నట్లు తెలిపారు. గుంటూరు జిల్లా, తెనాలి మండలం బుర్రిపాలెం గ్రామంలో కృష్ణ చిత్ర పటానికి పూలమాల వేసి గ్రామస్థులు నివాళులు అర్పించారు.

ఈరోజు ఉదయం తుదిశ్వాస విడిచిన సూపర్ స్టార్...

కృష్ణకు ఆదివారం అర్ధరాత్రి గుండెపోటు రావడంతో ఆయనను హైదరాబాద్ గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆస్పత్రికి కుటుంబ సభ్యులు తీసుకుని వెళ్లారు. వయసు రీత్యా ప్రతి మనిషి ఆరోగ్యంలో కొన్ని మార్పులు రావడం సహజమే. కృష్ణకూ ఆ విధమైన సమస్యలు కొన్ని ఉన్నాయి. అందువల్ల, అభిమానులు ఆందోళన చెందారు. సోమవారం ఉదయం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఘట్టమనేని కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే, మధ్యాహ్నానికి ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించిందని వైద్యులు తెలిపారు. గుండెపోటుతో ఆస్పత్రిలో చేరినప్పటికీ... ఆ తర్వాత మల్టిపుల్ ఆర్గాన్స్ ఫెయిల్ అవ్వడంతో కృష్ణ హెల్త్ కండిషన్ క్రిటికల్‌గా మారింది. వెంటిలేటర్ సహాయంతో ఆయనకు చికిత్స అందించారు. కాంటినెంటల్ ఆస్పత్రిలో అంతర్జాతీయ సదుపాయాలతో ఎనిమిది మంది వైద్యులతో కూడిన బృందం నిరంతరం పర్యవేక్షిస్తూ చికిత్స అందించింది. ఆయనను బతికించేందుకు వైద్యులు తీవ్ర ప్రయత్నాలు చేసినప్పటికీ... ప్రయోజనం దక్కలేదు. కృష్ణ తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయారు.

శోకసంద్రంలో ఘట్టమనేని కుటుంబం..

కుటుంబానికి పెద్ద దిక్కు మరణించడంతో ఘట్టమనేని కుటుంబం శోకసంద్రంలో మునిగింది. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సూపర్ స్టార్ ఫ్యాన్స్ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఏడాది జనవరిలో కృష్ణ కుమారుడు రమేష్ బాబు, సెప్టెంబర్ నెలాఖరున కృష్ణ సతీమణి ఇందిరా దేవి మరణించారు. ఇప్పుడు కృష్ణ కన్ను మూశారు. ఒక్క ఏడాదిలో తమకు ఎంతో ఆప్తులైన ముగ్గురు లోకాన్ని విడిచి వెళ్ళడం... మూడు విషాదాలు చోటు చేసుకోవడంతో మహేష్ బాబు, ఇతర కుటుంబ సభ్యులను ఓదార్చడం ఎవరి తరమూ కావడం లేదని తెలుస్తోంది.

అభిమానుల సందర్శనార్థం పద్మాలయ స్టూడియోస్‌లో కృష్ణ పార్థీవ దేహాన్ని నేడు ఉంచనున్నారు. ఆ తర్వాత జూబ్లీహిల్స్ మహా ప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. కృష్ణ మరణంతో పలువురు సినీ ప్రముఖులు ఆయనతో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. కృష్ణ కుటుంబ సభ్యులకు భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలని ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.  

Published at : 15 Nov 2022 12:32 PM (IST) Tags: West Godavari News Super Star Krishna Death Super Star Krishna Passed Away cancel Morning Show in Theatres Mourn Actor Krishna's Death

ఇవి కూడా చూడండి

చంద్రబాబును 2 రోజులు సీఐడీ కస్టడీకి ఇచ్చేందుకు కోర్టు అనుమతి

చంద్రబాబును 2 రోజులు సీఐడీ కస్టడీకి ఇచ్చేందుకు కోర్టు అనుమతి

సనాతన ధర్మ వివాదంలో ఉదయనిధి స్టాలిన్‌కి సుప్రీంకోర్టు నోటీసులు, వివరణ ఇవ్వాలని ఆదేశాలు

సనాతన ధర్మ వివాదంలో ఉదయనిధి స్టాలిన్‌కి సుప్రీంకోర్టు నోటీసులు, వివరణ ఇవ్వాలని ఆదేశాలు

Top Headlines Today: చంద్రబాబు క్వాష్ పిటిషన్ కొట్టివేత; తెలంగాణలో చేతులు కలిపిన ప్రత్యర్థులు - నేటి టాప్ న్యూస్

Top Headlines Today: చంద్రబాబు క్వాష్ పిటిషన్ కొట్టివేత; తెలంగాణలో చేతులు కలిపిన ప్రత్యర్థులు - నేటి టాప్ న్యూస్

Tirumala Brahmotsavam 2023: తిరుమలకు పోటెత్తిన భక్తులు, మూడు లక్షల మందికి పైగా వచ్చే అవకాశం!

Tirumala Brahmotsavam 2023: తిరుమలకు పోటెత్తిన భక్తులు, మూడు లక్షల మందికి పైగా వచ్చే అవకాశం!

బ్రిటీష్ కాలం నుంచే కెనడాకి సిక్కుల వలసలు, ఆ దేశానికే వెళ్లడానికి కారణాలేంటి?

బ్రిటీష్ కాలం నుంచే కెనడాకి సిక్కుల వలసలు, ఆ దేశానికే వెళ్లడానికి కారణాలేంటి?

టాప్ స్టోరీస్

BC Survey In Telangana: తెలంగాణలో త్వరలో బీసీ సర్వే- స్థానిక ఎన్నికల రిజర్వేషన్లపై ప్రభుత్వం కసరత్తు

BC Survey In Telangana: తెలంగాణలో త్వరలో బీసీ సర్వే- స్థానిక ఎన్నికల రిజర్వేషన్లపై ప్రభుత్వం కసరత్తు

Chandrababu Arrest: చంద్రబాబు విజినరీ లీడర్ కాదు ప్రిజీనరీ లీడర్ : మాజీ మంత్రి కన్నబాబు

Chandrababu Arrest: చంద్రబాబు విజినరీ లీడర్ కాదు ప్రిజీనరీ లీడర్ : మాజీ మంత్రి కన్నబాబు

Telangana Assembly Elections 2023: చేతులు కలిపిన ప్రత్యర్థులు- ఒకే ఫ్రేమ్‌లో కనిపించిన రాజయ్య, కడియం

Telangana Assembly Elections 2023: చేతులు కలిపిన ప్రత్యర్థులు- ఒకే ఫ్రేమ్‌లో కనిపించిన రాజయ్య, కడియం

Canada Singer Shubh: భారత్‌ నా దేశం కూడా-నేనూ ఇక్కడే జన్మించా : కెనడా సింగర్‌ శుభ్‌

Canada Singer Shubh: భారత్‌ నా దేశం కూడా-నేనూ ఇక్కడే జన్మించా : కెనడా సింగర్‌ శుభ్‌