అన్వేషించండి

AP Cabinet Ministers: టెన్త్ క్లాస్ నుంచి పీహెచ్‌డీ వరకు - ఏపీ మంత్రులు ఎవరెవరు ఏం చదివారంటే !

Educational Qualification of AP Cabinet Ministers: ఏపీ కేబినెట్‌లో టెన్త్ క్లాస్ నుంచి పీహెచ్‌డీ పూర్తి చేసిన మంత్రులు ఉన్నారు. వైఎస్ జగన్ కేబినెట్ 2.0 మంత్రుల విద్యార్హతల వివరాలు మీకోసం..

AP Cabinet Ministers Educational Qualification: ఏపీ కేబినెట్ పునర్ వ్యవస్థీకరణలో భాగంగా కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ మొత్తం 25 మంది కొత్త మంత్రులను అక్షర క్రమం ప్రకారం (ఆల్ఫాబెటికల్ ఆర్డర్) ప్రమాణం చేయించారు. వీరిలో తొలుత అంబటి రాంబాబు ప్రమాణ స్వీకారం చేశారు. ఆపై మంత్రులు ఒక్కొక్కరి చేత గవర్నర్ ప్రమాణం చేయించారు. ఏపీ కేబినెట్‌ (AP New Cabinet)లో టెన్త్ క్లాస్ నుంచి పీహెచ్‌డీ పూర్తి చేసిన మంత్రులు ఉన్నారు. వైఎస్ జగన్ కేబినెట్ 2.0 మంత్రుల విద్యార్హతల వివరాలు మీకోసం..

ఆదిమూలపు సురేష్‌
వైఎస్ జగన్ తొలి కేబినెట్‌లో విద్యాశాఖ మంత్రిగా చేసిన ఆదిమూలపు సురేష్‌ 2.0 కేబినెట్‌లో చోటు దక్కించుకున్నారు. ఆయన చదువులోనూ మేటి. ఎంటెక్‌, పీహెచ్‌డీ చేసి రైల్వే ఉన్నతాధికారికా సేవలు అందించారు. అటునుంచి రాజకీయ నేతగా మారారు. 2019లో మళ్లీ యర్రగొండపాలెం నుంచి వైకాపా తరఫున విజయం సాధించారు.

ఆర్కే రోజా
2004, 2009 ఎన్నికల్లో నగరి, చంద్రగిరి నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు ఆర్కే రోజా. వైఎస్సార్‌సీపీ నుంచి 2014లో టీడీపీ అభ్యర్థి గాలి ముద్దుకృష్ణమనాయుడిపై విజయం. 2019లో గాలి భానుప్రకాష్‌పై విజయం సాధించి ఎమ్మెల్యే అయిన రోజా.. వైఎస్ జగన్ 2.0 కేబినెట్‌లో మంత్రి అయ్యారు. బీఎస్సీ మొదటి సంవత్సరం చదువు మానేసి సినిమాల్లోకి వెళ్లారు.

పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
ఏపీ కేబినెట్‌లో అతిపెద్ద వయస్కులలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒకరు. ఓసీ సామాజిక వర్గం నుంచి కేబినెట్‌లో చోటు దక్కించుకున్న పెద్దిరెడ్డి ఎంఏ పీహెచ్‌డీ చేశారు. 

నారాయణస్వామి (బీఎస్సీ)
కళత్తూరు నారాయణస్వామి గంగాధర నెల్లూరు నుంచి గత ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుపొందారు. జగన్‌ తొలి మంత్రివర్గంలో మొదటిసారి మంత్రిగా చోటు దక్కించుకున్న నారాయణస్వామి విద్యార్హత బీఎస్సీ.

తానేటి వనిత (ఎమ్మెస్సీ)
మాజీ ఎమ్మెల్యే జొన్నకూటి బాబాజీరావు కుమార్తెగా రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకున్నారు తానేటి వనిత. కొవ్వూరు నుంచి గెలుపొందిన ఆమె వైఎస్ జగన్ తొలి మంత్రివర్గంలో మహిళాభివృద్ధి- శిశు సంక్షేమశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆమె విద్యార్హత ఎమ్మెస్సీ జువాలజీ.

ధర్మాన ప్రసాదరావు (ఇంటర్మీడియట్)
నరసన్నపేట నుంచి 1989లో కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందారు. గతంలో చేనేత, జౌళిశాఖ, జలవనరుల శాఖల మంత్రిగా చేశారు. గత ఎన్నికల్లో ఓడినా, గత ఎన్నికల్లో విజయం సాధించిన ధర్మాన ప్రసాదరావు.. జగన్ 2.0 కేబినెట్‌లో మంత్రి అయ్యారు. ఆయన ఇంటర్ చదివారు.

చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ (బీఎస్సీ)
2019లో రామచంద్రాపురం నుంచి పోటీచేసి టీడీపీ అభ్యర్థిపై గెలుపొందారు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ. 2020 జులైలో తొలిసారిగా బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆయన  బీఎస్సీ గ్రాడ్యుయేట్.

జోగి రమేష్‌  (బీఎస్సీ)
ఉమ్మడి ఏపీలో విజయవాడ ఆర్టీసీ రీజనల్‌ ఛైర్మన్‌గా చేశారు జోగి రమేష్. 2019 ఎన్నికల్లో పెడన నుంచి పోటీ చేసి గెలుపొందారు. తొలిసారి కేబినెట్‌లో మంత్రి పదవి పొందారు. ఆయన విద్యార్హత బీఎస్సీ.

బొత్స సత్యనారాయణ (బీఏ)
వైఎస్సార్, కొణిజేటి రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి, వైఎస్ జగన్ కేబినెట్ లలో మంత్రిగా పనిచేసిన అనుభవం బొత్స సొంతం. ఉత్తరాంధ్రలో అత్యంత కీలకనేత అయిన బొత్స జగన్‌ కేబినెట్‌లో పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రిగా పనిచేశారు. నేడు మరోసారి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈయన విద్యార్హత బీఏ.

బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి (బీటెక్)
తొలినాళ్లలో టీడీపీలో ఉన్న బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆ తరువాత వైఎస్సార్ హయాంలో కాంగ్రెస్‌లో చేరారు. ప్రస్తుతం వైసీపీలో కొనసాగుతున్నారు. 2014లో తొలిసారి డోన్‌ ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన 2019 ఎన్నికల్లో రెండోసారి గెలిచి ఆర్థిక మంత్రిగా పనిచేశారు. నేడు మళ్లీ ఛాన్స్ దక్కింది. ఆయన విద్యార్హత బీటెక్.

గుడివాడ అమర్‌నాథ్‌ (బీటెక్)
మాజీ మంత్రి గుడివాడ గురునాథరావు కుమారుడుగా గుడివాడ అమర్‌నాథ్‌ రాజకీయాల్లోకి వచ్చారు. 21 ఏళ్ల వయసులో విశాఖ జీవీఎంసీ కార్పొరేటర్ గా గెలిచారు. 2014లో అనకాపల్లి ఎంపీగా పోటీ చేసి ముత్తంశెట్టి శ్రీనివాసరావు చేతిలో ఓటమి చెందిన ఆయన అదే స్థానం నుంచి 2019లో గెలుపొందారు. పార్టీ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. తొలిసారి ఏపీ కేబినెట్‌లో చోటు దక్కింది. ఈయన విద్యార్హత బీటెక్.

సీదిరి అప్పలరాజు (ఎంబీబీఎస్)
ఈయన పేరు చెప్పగానే ర్యాంకర్ అని గుర్తుకొస్తుంది. ఉమ్మడి ఏపీలో స్టేట్ 4 ర్యాంక్ సాధించిన, సీదిరి అప్పలరాజు ఇంటర్‌లోనూ స్టేట్ ర్యాంకు కొట్టారు. ఏపీఆర్‌జేసీలో రాష్ట్రంలో 2వ ర్యాంకు సాధించారు. డాక్టర్‌గా సేవలు అందించిన అప్పలరాజు వైఎస్సార్‌సీపీలో చేరి.. 2019 సార్వత్రిక ఎన్నికల్లో పలాస నుంచి విజయం సాధించారు. 2020 జులైలో ఏపీ కేబినెట్‌లో చోటు దక్కించుకున్నారు. నేడు మరోసారి మంత్రిగా ప్రమాణం చేశారు. ఈయన విద్యార్హత ఎంబీబీఎస్. గోల్డ్ మెడల్ సైతం సాధించిన ఆయన 26 ఏళ్ల వయసులోనే కేజీహెచ్‌లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఆఫ్‌ మెడిసిన్‌గా ఉద్యోగం సంపాదించారు. 

గుమ్మనూరు జయరాం  (ఎస్ఎస్ఎల్‌సీ)
గుమ్మనూరు జయరాం 2005లో టీడీపీ తరఫున జడ్పీటీసీ సభ్యుడిగా గెలుపొందారు. ఆపై ప్రజారాజ్యంలో చేరారు. 2011లో వైసీపీ గూటిన చేరిన జయరాం 2014, 2019లో ఆలూరు నుంచి విజయం సాధించారు. జగన్ తొలి కేబినెట్‌లో కార్మిక, ఉపాధి శిక్షణ మంత్రిగా చేశారు. ఆయన విద్యార్హత ఎస్ఎస్ఎల్‌సీ.

కారుమూరి వెంకట నాగేశ్వరరావు (10వ తరగతి)
జడ్పీటీసీ సభ్యుడిగా ఎన్నికై జిల్లాపరిషత్ చైర్మన్‌గా చేసిన అనుభవం కారుమూరి సొంతం. తొలిసారి 2009లో కాంగ్రెస్ అభ్యర్థిగా తణుకు నుంచి గెలుపొందిన ఆయన.. 2019లో వైసీపీ అభ్యర్థిగా విజయం సాధించారు. కారుమూరి నాగేశ్వరరావు పదో తరగతి వరకు చదువుకున్నారు.

షేక్‌ అంజాద్‌ బాషా (డిగ్రీ డిస్ కంటిన్యూ)
కడప నగరపాలక సంస్థకు జరిగిన మొదటి ఎన్నికల్లో కార్పొరేటర్‌గా విజయం సాధించారు అంజాద్ బాషా. వైఎస్సార్ కుటుంబానికి నమ్మకస్తుడిగా పేరుంది. కడప ఎమ్మెల్యేగా 2014లో గెలుపొందారు. జగన్‌ మంత్రివర్గంలో ఉప ముఖ్యమంత్రిగా పని చేశారు. విద్యార్హత విషయానికొస్తే.. డిగ్రీ మధ్యలోనే చదువు మానేశారు.

ఉషశ్రీచరణ్‌ (ఎంఎస్సీ, పీహెచ్‌డీ)
2012లో టీడీపీలో చేరి పొలిటికల్ జర్నీ ప్రారంభించిన ఉషశ్రీచరణ్ మరుసటి ఏడాది 2013లో వైఎస్సార్‌సీపీ తీర్థం పుచ్చుకున్నారు. 2019లో గెలుపొందిన ఆమె తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి, మంత్రి పదవి దక్కించుకున్నారు. ఆమె విద్యార్హత ఎంఎస్సీ, పీహెచ్‌డీ

అంబటి రాంబాబు (బీఏ, బీఎల్)
1989లో రేపల్లె నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు అంబటి రాంబాబు. 1994, 1999ల్లో రెండుసార్లు ఓటమి చవిచూసిన అంబటి.. 2014 సత్తెనపల్లి నుంచి పోటీ చేసి ఓడిపోగా.. అదే స్థానం నుంచి కోడెల శివప్రసాదరావుపై విజయం సాధించారు. నేడు జగన్ కేబినెట్‌లో మంత్రి పదవి చేపట్టారు. అంబటి రాంబాబు విద్యార్హత బీఏ, బీఎల్. విశాఖపట్నంలోని న్యాయ విద్య పరిషత్ లా కాలేజీ నుండి 1986లో బీఎల్‌ పూర్తి చేశారు.

పినిపే విశ్వరూప్‌ (బీఎస్సీ, బీఈడీ)
వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి, రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి మంత్రివర్గాల్లో పనిచేసిన అనుభవం పినిపే విశ్వరూప్‌ సొంతం. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో అమలాపురం ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఆయన జగన్ తొలి కేబినెట్‌లో మంత్రిగా చేశారు. నేడు మరోసారి మంత్రిగా ప్రమాణం చేశారు. విశ్వరూప్ బీఎస్సీ, బీఈడీ చదివారు.

విడదల రజిని (బీఎస్సీ, ఎంబీఏ)
పత్తిపాటి పుల్లారావు ఆమెను రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. టీడీపీని వీడి వైసీపీలో చేరిన విడదల రజనీ 2019 ఎన్నికల్లో చిలకలూరిపేట నుంచి తన గురువు పత్తిపాటి పుల్లారావుపై గెలుపొంది.. తొలిసారి కేబినెట్ బర్త్ దక్కించుకున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్‌ సైన్సు, హైదరాబాద్‌లో ఎంబీఏ పూర్తి చేశారు.

మేరుగ నాగార్జున (ఎంకాం, ఎంఫిల్‌, పీహెచ్‌డీ)
ఆంధ్రావర్సిటీ ప్రొఫెసర్‌గా పనిచేసిన మేరుగ నాగార్జున 2009లో తొలిసారి బరిలోకి దిగి ఓడిపోయారు. 2014లో వైసీపీ తరఫున పోటీ చేసి ఓడిన ఆయన 2019లో వేమూరు నుంచి ఎమ్మెల్యే అయ్యారు. ఆయన విద్యార్హత ఎంకాం, ఎంఫిల్‌, పీహెచ్‌డీ.

బూడి ముత్యాలనాయుడు (ఇంటర్)
వార్డు సభ్యుడిగా, గ్రామ ఉప సర్పంచిగా పనిచేసిన బూడి ముత్యాలనాయుడు ఆపై సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీపీగా, జడ్పీటీసీగా ఎదిగారు. 2014లో మాడుగుల నుంచి గెలిచిన ఆయన 2019లో రెండోసారి గెలిచి ప్రభుత్వ విప్ అయ్యారు. తొలిసారిగా జగన్ కేబినెట్‌లో మంత్రి అయ్యారు. ఆయన ఇంటర్ పూర్తిచేశారు.

కొట్టు సత్యనారాయణ (ఇంటర్)
తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ ఇంటర్మీడియట్ చదివారు. 2019లో రెండోసారి ఎమ్మెల్యే అయిన ఆయన తొలిసారి కేబినెట్ బెర్త్ దక్కించుకున్నారు.

కాకాణి గోవర్ధన్ రెడ్డి (ఎంఏ, పీహెచ్‌డీ)
నెల్లూరు జిల్లా సర్వేపల్లి నుంచి విజయం సాధించిన కాకాణి గోవర్ధన్ రెడ్డి గతంలో జడ్పీ చైర్మన్‌గా సేవలు అందించారు. వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా 2014, 2019లో సర్వేపల్లి నుంచి గెలుపొందిన కాకాణి ప్రస్తుత రాజకీయ సమీకరణాలలో తొలిసారి మంత్రి పదవి పొందారు.

పీడిక రాజన్నదొర (ఎంఏ)
జీసీసీ సీనియర్‌ మేనేజర్‌ ఉద్యోగానికి 2004లో కాంగ్రెస్ పార్టీలో చేరికతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు రాజన్నదొర. కాంగ్రెస్ అభ్యర్థిలో 2009లో, వైఎస్సార్ సీపీ నుంచి 2014, 2019లో గెలుపొందిన రాజన్నదొర తొలిసారి ఏపీ కేబినెట్‌లో మంత్రి అయ్యారు. ఈయన విద్యార్హత ఎంఏ. 

దాడిశెట్టి రాజా (బీఏ)
ఓసీ సామాజిక వర్గం నుంచి కేబినెట్‌లో చోటు దక్కించుకున్నారు దాడిశెట్టి రాజా. ప్రజారాజ్యంలో చేరికతో రాజకీయాల్లోకి వచ్చిన ఆయన 2010లో వైసీపీ గూటికి చేరారు. గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన ఆయన ప్రభుత్వ విప్‌గా కొనసాగుతున్నారు. ఈయన బీఏ చదివారు.

Also Read: AP Cabinet: కాళ్లు మొక్కడం, ముద్దులు పెట్టడం- ప్రమాణ స్వీకారంలో ఈ నేతల స్టైలే వేరప్పా !

Also Read: Jagan : అక్కడి ప్రజలకు ఇచ్చిన మాట మర్చిపోయిన జగన్ ! వాళ్లకు మంత్రిపదవుల్లేవ్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Tesla Plant: ఇండియాలో ప్లాంట్ పెట్టాలని టెస్లా నిర్ణయం - తెలంగాణ ప్రయత్నాలు ఫలిస్తాయా ?
ఇండియాలో ప్లాంట్ పెట్టాలని టెస్లా నిర్ణయం - తెలంగాణ ప్రయత్నాలు ఫలిస్తాయా ?
Andhra Pradesh Latest News:విధులకు హాజరుకాని ప్రభుత్వ వైద్యులపై కొరడా- 55 మందిని తొలగించిన సర్కారు
విధులకు హాజరుకాని ప్రభుత్వ వైద్యులపై కొరడా- 55 మందిని తొలగించిన సర్కారు
Maganti Gopinath: జూబ్లిహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆరోగ్య పరిస్థితి విషమం - హఠాత్తుగా ఏమయిందంటే ?
జూబ్లిహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆరోగ్య పరిస్థితి విషమం - హఠాత్తుగా ఏమయిందంటే ?
Bandi Sanjay Kumar Latest News : కాంగ్రెస్‌తో కేసీఆర్ ఒప్పందం- కేసులు లేకుండా కలిసి ప్రయాణం- బండి సంజయ్ సంచలన ఆరోపణలు
కాంగ్రెస్‌తో కేసీఆర్ ఒప్పందం- కేసులు లేకుండా కలిసి ప్రయాణం- బండి సంజయ్ సంచలన ఆరోపణలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Kadiyam Costly Bonsai Plant | చెట్టు దుంగలా కనిపిస్తున్న ఈ మొక్క రేట్ ఎంతో తెలుసా | ABP DesamMLC Candidate Dr. Prasanna Hari Krisha Interview | గ్రాడ్యూయేట్స్ గొంతుకనై పోరాడుతా | ABP DesamPM Modi Shake Hand AP Leaders | ఢిల్లీ సీఎం ప్రమాణస్వీకారంలో ఏపీ లీడర్లకు గౌరవం | ABP DesamBan vs Ind Champions Trophy 2025 | బాగానే ఆడిన బంగ్లా బాబులు..షమీ అన్న మాస్ కమ్ బ్యాక్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Tesla Plant: ఇండియాలో ప్లాంట్ పెట్టాలని టెస్లా నిర్ణయం - తెలంగాణ ప్రయత్నాలు ఫలిస్తాయా ?
ఇండియాలో ప్లాంట్ పెట్టాలని టెస్లా నిర్ణయం - తెలంగాణ ప్రయత్నాలు ఫలిస్తాయా ?
Andhra Pradesh Latest News:విధులకు హాజరుకాని ప్రభుత్వ వైద్యులపై కొరడా- 55 మందిని తొలగించిన సర్కారు
విధులకు హాజరుకాని ప్రభుత్వ వైద్యులపై కొరడా- 55 మందిని తొలగించిన సర్కారు
Maganti Gopinath: జూబ్లిహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆరోగ్య పరిస్థితి విషమం - హఠాత్తుగా ఏమయిందంటే ?
జూబ్లిహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆరోగ్య పరిస్థితి విషమం - హఠాత్తుగా ఏమయిందంటే ?
Bandi Sanjay Kumar Latest News : కాంగ్రెస్‌తో కేసీఆర్ ఒప్పందం- కేసులు లేకుండా కలిసి ప్రయాణం- బండి సంజయ్ సంచలన ఆరోపణలు
కాంగ్రెస్‌తో కేసీఆర్ ఒప్పందం- కేసులు లేకుండా కలిసి ప్రయాణం- బండి సంజయ్ సంచలన ఆరోపణలు
Kavitha: రెండు మూడేళ్లలో అధికారంలోకి బీఆర్ఎస్ - కవిత కీలక వ్యాఖ్యలు
రెండు మూడేళ్లలో అధికారంలోకి బీఆర్ఎస్ - కవిత కీలక వ్యాఖ్యలు
YS Jagan Tour News: జగన్ టూర్‌లో మెరిసిన ధర్మాన- తత్వం బోధపడిందంటున్న వైసీపీ నేతలు 
జగన్ టూర్‌లో మెరిసిన ధర్మాన- తత్వం బోధపడిందంటున్న వైసీపీ నేతలు
BRS And BJP:  బీజేపీపై విమర్శలకు బీఆర్ఎస్ దూరం - ఎందుకీ మౌనం ?
బీజేపీపై విమర్శలకు బీఆర్ఎస్ దూరం - ఎందుకీ మౌనం ?
Modi And Pawan: పవన్ హిమాలయాలకు వెళ్తున్నారా - మోడీ ప్రశ్నకు పవన్ జవాబు ఏంటంటే ?
పవన్ హిమాలయాలకు వెళ్తున్నారా - మోడీ ప్రశ్నకు పవన్ జవాబు ఏంటంటే ?
Embed widget