Breaking News Today: ఈ నెల 23 న మేడారానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
Breaking News Today:ఏపీ అసెంబ్లీ సమావేశాలు శనివారం కూడా కొనసాగుతున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ, అంతర్జాతీయ అంశాల అప్‌డేట్స్ అందిస్తున్నాం.
LIVE

Background
Breaking News Today: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయం ప్రపంచ టెక్ దిగ్గజాలు, ఫైనాన్షియల్ సంస్థలలో తీవ్ర కలకలం రేపింది. ఈ ప్రకటన వెలువడిన కొన్ని గంటల్లోనే, మైక్రోసాఫ్ట్, జేపీ మోర్గాన్ వంటి సంస్థలు తమ H-1B, H-4 వీసా ఉద్యోగులకు వెంటనే అమెరికాకు తిరిగి రావాలని ఈమెయిళ్ల ద్వారా సూచించాయి.
సెప్టెంబర్ 21న కొత్త ఫీజు అమలులోకి వస్తుండగా, అంతర్జాతీయంగా ప్రయాణిస్తున్న H-1B, H-4 వీసాదారులు తిరిగి అమెరికాలోకి ప్రవేశించడానికి వీలు లేకుండా పోతుందని కంపెనీలు ఆందోళన చెందాయి. జేపీ మోర్గాన్ తన ఉద్యోగులకు, సెప్టెంబర్ 21 ఉదయం 12:01 ET గంటల కంటే ముందే రావాలని, ఆ తర్వాత మరిన్ని మార్గదర్శకాలు వచ్చే వరకు అంతర్జాతీయ ప్రయాణాలను నిలిపివేయాలని సలహా ఇచ్చింది. మైక్రోసాఫ్ట్ కూడా తమ ఉద్యోగులు "అమెరికాలోనే ఉండాలని" సిఫార్సు చేసింది. ఈ చర్యలు, ఈ నిబంధన ఎంత ప్రభావాన్ని చూపుతుందో స్పష్టం చేస్తున్నాయి.
ఈ కొత్త వీసా ఫీజు ప్రకటనతో పాటు, యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ లేబర్ 'ప్రాజెక్ట్ ఫైర్‌వాల్' అనే కొత్త ఎన్‌ఫోర్స్‌మెంట్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమం H-1B వీసా దుర్వినియోగాన్ని అరికట్టడం, కంపెనీలపై కఠినమైన తనిఖీలు నిర్వహించడం, అమెరికన్ కార్మికులకు సరైన వేతనాలు అందేలా చూడటం లక్ష్యంగా పెట్టుకుంది. చరిత్రలో మొదటిసారిగా, లేబర్ సెక్రటరీ స్వయంగా H-1B దర్యాప్తులను ధృవీకరిస్తారు.
నిబంధనలు ఉల్లంఘించిన కంపెనీలపై DOL కఠిన చర్యలు తీసుకుంటుంది.
వీటిలో:
1. ప్రభావిత ఉద్యోగులకు బకాయి వేతనాలు చెల్లించడం.
2. జరిమానాలు విధించడం.
3. నిర్దిష్ట కాలానికి H-1B ప్రోగ్రామ్ నుంచి నిషేధం విధించడం.
ఈ ప్రాజెక్ట్ ఫైర్‌వాల్, ట్రంప్ విధించిన 100,000 డాలర్ల వార్షిక ఫీజుతో కలిసి, టెక్ పరిశ్రమలో విదేశీ ప్రతిభను నియమించుకోవడం చాలా ఖరీదైనదిగా మారుస్తుంది. ముఖ్యంగా భారతీయ నిపుణులను లక్ష్యంగా చేసుకున్నట్లు ఇది స్పష్టమవుతోంది. కామర్స్ సెక్రటరీ లుట్నిక్ స్పష్టం చేస్తూ, 100,000 డాలర్లు చెల్లించడం ద్వారా కంపెనీలు, తాము నియమించుకుంటున్న విదేశీయులు "అత్యంత విలువైనవారు" అని నిరూపించుకోవాలని, లేదంటే వారు తిరిగి వెళ్లి అమెరికన్లను నియమించుకోవాలని సూచించారు.
ఈ నెల 23 న మేడారానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
మేడారం అభివృద్ధి ప్రణాళికపై ముగిసిన సీఎం సమీక్ష
ఈ నెల 23 న మేడారంకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
అభివృద్ధిపై క్షేత్రస్థాయిలో సందర్శించి సమ్మక్క సారలమ్మ పూజారులను సంప్రదించనున్న సీఎం
పూజారుల సూచనల మేరకు వారి ఆమోదంతో అభివృద్ధిపై డిజైన్లను విడుదల చేయనున్న ముఖ్యమంత్రి
మేడారం జాతర పనులకు సంబంధించి టెక్నికల్ కమిటీని ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించిన సీఎం
పూజారులు కోరిన విధంగా ప్రస్తుతం ఉన్న ఆలయ ఆవరణను మరింత విస్తరించాలని ఆశిస్తున్న ప్రభుత్వం
గద్దెలను యథాతథంగా ఉంచి సంప్రదాయాలను తూచా తప్పకుండా గౌరవించాలని ఆదేశించిన సీఎం
గిరిజన సంప్రదాయం ఉట్టిపడేలా స్వాగత తోరణం డిజైన్లు ఉండాలన్న సీఎం
ఆలయం పరిసర ప్రాంతాల్లో ఆ ప్రాంత సంప్రదాయ వృక్షాలు ఉండేలా చర్యలు తీసుకోవాలన్న సీఎం
23న సీఎంతో పాటు మేడారం వెళ్లనున్న మంత్రులు, గిరిజన ఎంపీలు, ఎంఎల్సీలు, ఎమ్మెల్యేలు, సంబంధిత అధికారులు
మేడారం జాతర పనులపై 23 న మేడారంలో సమీక్షించనున్న సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ ఆడబిడ్డలందరికీ రేవంత్ రెడ్డి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు
తెలంగాణ ఆడబిడ్డలందరికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. పూలను పూజిస్తూ ప్రకృతిని ఆరాధిస్తూ మహిళలు అత్యంత వైభవంగా నిర్వహించుకునే గొప్ప పండుగ బతుకమ్మ అని అన్నారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయలకు ఆడపడుచుల ఔన్నత్యానికి ప్రతీక అయిన బతుకమ్మ పండుగను ఆడపడుచులందరూ కలిసి సంతోషంగా జరుపుకోవాలని సీఎం ఆకాంక్షించారు. తెలంగాణ సాముహిక జీవన విధానానికి, కష్టసుఖాలను కలిసి పంచుకునే ప్రజల ఐక్యతకు ఈ పండుగ నిదర్శనం అని అన్నారు.
ఎంగిలిపూల నుంచి సద్దుల వరకూ తొమ్మిది రోజులు బతుకమ్మ ఆట పాటలతో అందరూ వైభవంగా ఈ పండుగను జరుపుకోవాలన్నారు. రాష్ట్ర ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని, అందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని గౌరమ్మను సీఎం ప్రార్థించారు.





















