Breaking News Live Telugu Updates: వరంగల్ భద్రకాళి అమ్మవారికి ప్రధానమంత్రి మోదీ ప్రత్యేక పూజలు
Breaking News Live Telugu Updates: ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం వెంటనే పొందవచ్చు
LIVE
Background
Breaking News Live Telugu Updates:
ప్రధాని నరేంద్రమోదీ శనివారం వరంగల్‌లో పర్యటించనున్నారు. దీని కోసం బీజేపీ భారీ ఏర్పాట్లు చేసింది. ఉదయం దాదాపు 8 గంటల ప్రాంతంలో వారణాసి నుంచి మోదీ బయల్దేరి తొమ్మిదిన్నరకు హకీంపేట ఎయిర్‌పోర్టుకు రానున్నారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో పది గంటలకు మామునూరు చేరుకుంటారు. తర్వాత రోడ్డు మార్గంలోభద్రకాళి టెంపుల్‌కు చేరుకుంటారు. అక్కడ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. అక్కడే 15 నుంచి 20 నిమిషాలు గడపనున్నారు మోదీ.
భద్రకాళి టెంపుల్‌లో పూజలు చేసిన అనంతరం 11 గంటలకు బహిరంగ సభ జరిగే హన్మకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ గ్రౌండ్‌కు వస్తారు. ఆదే వేదికపై నుంచి వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం అక్కడ ప్రజలను ఉద్దేశించి ప్రసగించారు. మొత్తానికి 12.30కి సభను ముగించుకొని తిరిగి పయనమవుతారు. హైదరాబాద్ నుంచి రాజస్థాని టూర్‌కు వెళ్తారు.
ఈ వరంగల్ రెండున్నర గంటల టూర్‌లో ప్రధాని మోదీ దాదాపు 6,100 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. ఇందులో రైల్వే వ్యాగన్ మ్యానుఫాక్చరింగ్ యూనిట్, 176కిలోమీటర్ల జాతీయ రహదారులకు శంకుస్థాపన చేస్తారు. హన్మకొండలో రెండు సభలను ఏర్పాటు చేశారు. ఒకటి అభివృద్ధి పనుల శంకుస్థాపనకు ఉపయోగిస్తారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగించేందుకు మరో సభను ఏర్పాటు చేశారు. ఈ సభకు విజయసంకల్ప సభగా బీజేపీ నాయకులు పిలుస్తున్నారు.
సీఎం జగన్ వైఎస్సార్ జిల్లా పర్యటన పూర్తి షెడ్యూల్ ఇదే..
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 3 రోజులపాటు వైఎస్సార్ జిల్లాలో పర్యటించనున్నారు. జూలై 8 నుంచి 10 వరకు మూడు రోజుల పాటు సీఎం జగన్ పర్యటన ఖరారైంది. జూలై 8న ఆయన తండ్రి, ఉమ్మడి ఏపీ మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి కార్యక్రమంలో సీఎం పాల్గొనేందుకు వైఎస్సార్ జిల్లాకు వెళ్తున్నారు. శనివారం మధ్యాహ్నం 2.05 గంటలకు వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయ, వైఎస్సార్ ఘాట్‌కు సీఎం జగన్ చేరుకుని జయంతి సందర్భంగా వైఎస్సార్ ఘాట్ వద్ద ఆయనకు నివాళులు అర్పించనున్నారు. కార్యక్రమం పూర్తయ్యాక ఇడుపులపాయలో తన నివాసానికి సీఎం జగన్ చేరుకోనున్నారు.
ఆదివారం పర్యటన వివరాలు..
వైఎస్ఆర్ జిల్లాలో రెండో రోజు పర్యటనలో భాగంగా సీఎం జగన్ 9వ తేదీ ఉదయం 9.20 గంటలకు గండిపేట చేరుకుంటారు. గండిపేట వద్ద ఒబెరాయ్ హోటల్ నిర్మాణ పనులకు సీఎం శంకుస్ధాపన చేయనున్నారు. అనంతరం వ్యూ పాయింట్‌ను పరిశీలిస్తారు. ఆ తర్వాత సీఎం జగన్ పులివెందుల చేరుకుని నూతనంగా నిర్మించిన మున్సిపల్ ఆఫీసు భవనాన్ని ప్రారంభించనున్నారు.
మున్సిపల్ ఆఫీసు ప్రారంభం అనంతరం పులివెందుల, రాణితోపు చేరుకుని నగరవనాన్ని జగన్ ప్రారంభించనున్నారు. అక్కడ నుంచి గరండాల రివర్ ఫ్రెంట్ చేరుకుని కెనాల్ డెవలప్‌మెంట్ ఫేజ్ –1 పనులను ప్రారంభించనున్నారని అధికారులు తెలిపారు. అనంతరం పులివెందులలోని నూతనంగా నిర్మించిన (వైఎస్సార్ ఐఎస్‌టిఏ) స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను ప్రారంభిస్తారు. పులివెందులలోని ఏపీ కార్ల్‌లో ఏర్పాటు చేసిన న్యూ టెక్ బయో సైన్సెస్‌ను సీఎం జగన్ ప్రారంభించున్నారు. ఆదివారం మధ్యాహ్నం 2.30 గంటలకు పులివెందులలో వైఎస్సార్ స్పోర్ట్స్ అకాడమీకి ప్రారంభోత్సవం చేయనున్నారు. కార్యక్రమం అనంతరం ఇడుపులపాయ చేరుకోనున్నారు.
జులై 10న సీఎం జగన్ షెడ్యూల్..
సోమవారం మూడోరోజూ సైతం జగన్ వైఎస్సార్ జిల్లాలోనే పర్యటించనున్నారు. జులై 10న ఉదయం 9 గంటలకు ఇడుపులపాయ నుంచి బయలుదేరి జగన్ కడప చేరుకోనున్నారు. కడప పట్టణంలోని రాజీవ్ మార్గ్, రాజీవ్ పార్కుతో పాటు పలు అభివృద్ధి పనులనూ ప్రారంభించనున్నారు. అనంతరం కడప నుంచి కొప్పర్తికి జగన్ బయలుదేరి వెళ్లనున్నారు. కొప్పర్తి పారిశ్రామికవాడలో అల్ డిక్సన్ యూనిట్‌ను ప్రారంభించనున్నారు. అక్కడ పలు పారిశ్రామిక యూనిట్లకు శంకుస్ధాపన చేయనున్నారు. అనంతరం కొప్పర్తి నుంచి కడప చేరుకుని అక్కడ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 1.30 గంటలకు సీఎం జగన్ తాడేపల్లి నివాసానికి చేరుకోనున్నారు.
ఇడుపులపాయలో షర్మిల
వైఎస్ జయంతి సందర్భంగా షర్మిల, జగన్ సహా ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఇడుపులపాయకు రానున్నారు. ఎవరికి వాళ్లు వేర్వేరుగా వస్తున్నారు. వైఎస్ సమాధికి నివాళి అర్పించనున్నారు. ఈ సందర్భంగా షర్మిల కీలక ప్రకటన చేయబోతున్నారని సమాచారం.
వైఎస్సార్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయబోతున్నారని, ప్రియాంక టీంతో షర్మిల చేతులు కలపబోతున్నారని ఎప్పటి నుంచో టాక్ నడుస్తోంది. పదే పదే వీటిని ఆమె ఖండిస్తున్నా తరచూ కాంగ్రెస్ నేతలతో సమావేశాలు ఈ పుకార్లకు ఊతమిస్తున్నాయి. మొత్తానికి ఈ విషయంపై ఇడుపులపాయ వేదికగా ఏదో ఒకటి తేల్చేయనున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
వైఎస్ జయంతి సందర్భంగా గతేడాది వరకు అంతా కలిసి ఆయన సమాధి వద్ద నివాళి అర్పించేవాళ్లు. కానీ ఈసారి ఎవరికి వారుగానే కార్యక్రమంలో పాల్గొంటున్నారు. శుక్రవారమే షర్మిల ఇడుపులపాయ చేరుకున్నారు. ఈ ఉదయమే తల్లితో కలిసి తండ్రి సమాధి వద్ద నివాళి అర్పించి తిరుగుపయనమవుతారు.
వరంగల్ భద్రకాళి అమ్మవారికి ప్రధానమంత్రి మోదీ ప్రత్యేక పూజలు
ప్రత్యకే విమానంలో హైదరాబాద్ వచ్చిన ప్రధానమంత్రి మోదీ హెలికాప్టర్‌లో వరంగల్ జిల్లా మామునూరు చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో భద్రకాళి అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. అక్కడ పండితులు మోదీకి ఘన స్వాగతం పలికారు. అక్కడ ప్రత్యేక పూజలు చేసిన తర్వాత ఆర్ట్స్ కాలేజీలో జరిగే ప్రత్యేక కార్యక్రమాల్లో మోదీ పాల్గొంటారు.