Breaking News Live Telugu Updates: భారీ కాన్వాయ్‌తో బస్‌లో మహారాష్ట్ర బయల్దేరిన సీఎం కేసీఆర్
Breaking News Live Telugu Updates: ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం వెంటనే పొందవచ్చు
LIVE
Background
Breaking News Live Telugu Updates:
చిత్తూరు జిల్లా, కుప్పంలో బ్లాస్టింగ్ కలకలం రేపింది. స్థానిక కొత్తపేట పెద్దపల్లి గంగమాంబ దేవస్థానం వీధిలోని బొరుగుల రాజమ్మ కాంపౌండ్‌లో పేలుడు జరిగింది. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత సుమారు రెండు గంటల మధ్య జరిగిన బ్లాస్టింగ్ భయాందోళనకు గురి చేసింది. అర్ధరాత్రి జరిగిన ఘటనతో ఒక్కసారిగా పట్టణం ఉలిక్కి పడింది.
అందరూ నిద్రిస్తున్న సమయంలో ఒక్కసారిగా పెద్ద ఎత్తున శబ్దం రావడంతో చుట్టుప్రక్కల ప్రజలు ఒక్కసారిగా లేచి బయటకు పరుగులు తీశారు. మొదట భూకంపం అనుకున్నారు. తర్వాత ఓ ఇంట్లో జరిగిన పేలుడుగా గుర్తించి ఊపిరి పీల్చుకున్నారు. బొరుగుల రాజమ్మ కాంపౌండ్‌లో కాపురం ఉంటున్న మురుగేష్, ధనలక్ష్మి దంపతులు ఈ ప్రమాదంలో గాయపడ్డారు. అక్కడే ఉంటూ స్టీల్ పాత్రలు వ్యాపారం చేసుకుంటున్నారు. రక్తపు మడుగులో పడి వారిని స్థానికులు వెటంనే పోలీసులకు అందజేసి, క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.
ఎవరో గుర్తు తెలియని దుండగులు పేలుడు పదార్థాలను ప్రయోగించడం వలన ఈ ఘటన జరిగి ఉండవచ్చని స్థానిక ప్రజలు అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది.
అనిల్‌కు నారా లోకేష్ కౌంటర్
నెల్లూరు సిటీ ఎమ్మెల్యేైపై మరోసారి నారా లోకేష్ మాటల తూటాలు పేల్చారు. అనిల్ వ్యాఖ్యలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. నెల్లూరు జిల్లాలో చర్చకు సిద్ధమా అంటూ అనిల్ విసిరిన సవాల్ కి ప్రతి సవాల్ విసిరారు నారా లోకేష్. తాను చర్చకు సిద్ధమేనని తేల్చి చెప్పారు. చర్చకు వచ్చేటప్పుడు సీఎం జగన్ ని కూడా తీసుకు రావాలని చెప్పారు.
ల్లూరు యువగళం పర్యటనలో భాగంగా నాయుడుపేట సభలో నారా లోకేష్ నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కి సవాల్ విసిరారు. వచ్చేసారి నెల్లూరు సిటీ టికెట్ నీదే అని జగన్ తో చెప్పించగలవా అని ఛాలెంజ్ చేశారు. సిల్లీ బచ్చా, హాఫ్ నాలెడ్జ్.. అంటూ కౌంటర్ ఇచ్చారు. ఆ సిల్లీ బచ్చా నాతో చర్చ అంటూ సరదా పడుతున్నాడంట.. రా రా వచ్చెయ్ అంటూ నాయుడుపేట సభ నుంచి పిలుపునిచ్చారు నారా లోకేష్. అవినీతి సొమ్ముతో ఆయన కొన్న పొలం దగ్గర చర్చ పెట్టుకుందామా అని అడిగారు. చర్చకు వచ్చేటప్పుడు జగన్ ని కూడా తీసుకు రావాలన్నారు. తాను నాయుడుపేటలోనే ఉన్నా వచ్చెయ్ అంటూ పిలిచారు లోకేష్.
నెల్లూరులో గరం గరం..
నెల్లూరులో నారా లోకేష్ యువగళం పాదయాత్ర వాడివేడిగా సాగుతోంది. ఈ యాత్ర విషయంలో వైసీపీ నుంచి తీవ్ర విమర్శలు మొదలయ్యాయి. ఇటీవల కొంతకాలం మీడియాకి దూరంగా ఉన్న అనిల్, వచ్చీ రాగానా లోకేష్ పై పంచ్ లు విసిరారు. అరేయ్, ఒరేయ్ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు, వాడు, వీడు అంటూ తూలనాడారు. అనిల్ వ్యాఖ్యలకు ఆల్రెడీ టీడీపీ నేతలు కౌంటర్లిచ్చారు. అనిల్ నోరు అదుపులో పెట్టుకోవాలని, తమకి కూడా అలాంటి భాష వచ్చని అన్నారు. అయితే ఇప్పుడు నేరుగా లోకేష్ స్పందించడం ఈ విషయంలో కొసమెరుపు.
600 వాహనాలతో మహారాష్ట్ర టూర్‌కు బయల్దేరి వెళ్లారు సీఎం కేసీఆర్
భారీ కాన్వాయ్‌తో ముఖ్యమంత్రి కేసీఆర్ మహారాష్ట్ర పర్యటనకు బయల్దేరి వెళ్లారు. ఆయన సోలాపూర్‌లో పర్యటించనున్నారు. బస్సులో భారీ కాన్వాయ్‌తో రోడ్డు మార్గంలో ప్రగతి భవనం నుంచి పయనమయ్యారు. దాదాపు 600 వాహనాలు ఆయనతో కదిలాయి. కేసీఆర్‌తో రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నాయకులు వెళ్లారు.
600 వాహనాలతో మహారాష్ట్ర టూర్‌కు బయల్దేరి వెళ్లారు సీఎం కేసీఆర్
భారీ కాన్వాయ్‌తో ముఖ్యమంత్రి కేసీఆర్ మహారాష్ట్ర పర్యటనకు బయల్దేరి వెళ్లారు. ఆయన సోలాపూర్‌లో పర్యటించనున్నారు. బస్సులో భారీ కాన్వాయ్‌తో రోడ్డు మార్గంలో ప్రగతి భవనం నుంచి పయనమయ్యారు. దాదాపు 600 వాహనాలు ఆయనతో కదిలాయి. కేసీఆర్‌తో రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నాయకులు వెళ్లారు.