Breaking News Live Telugu Updates: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ప్రారంభం- భారత దేశ 75 ఏళ్ల ప్రయాణంపై ప్రధాని మోదీ ప్రసంగం
Breaking News Live Telugu Updates: ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం వెంటనే పొందవచ్చు
LIVE
Background
నేటి నుంచి ఐదు రోజుల పాటు పార్లమెంట్ ప్రత్యేకంగా సమావేశమవుతోంది. ఈ సమావేశాల కోసం ప్రత్యేక అజెండా ఖరారు చేసిన ఏ క్షణం ఏ బిల్లు టేబుల్ చేస్తారనే ఉత్కంఠ మాత్రం కొనసాగుతోంది. ఒకటి రెండు కీలకమైన బిల్లు సభలో ప్రవేశ పెట్టేందుకు కేంద్రం ఆలోచన చేస్తుందని ఎప్పటి నుంచో ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
తొలిరోజు సమావేశాలు పాత బిల్డింగ్‌లోనే జరుగుతాయి. ఆ తరవాత రేపటి నుంచి(సెప్టెంబర్ 19న) కొత్త బిల్డింగ్‌లోకి షిఫ్ట్ అవుతున్నట్టు కేంద్రం ఇప్పటికే వెల్లడించింది. జూన్1వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా కొత్త పార్లమెంట్ బిల్డింగ్‌ని ప్రారంభించారు. మోదీతో పాటు లోక్‌సభ స్పీకర్ ఓమ్ బిర్లా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇందులోనే Sengolని ఏర్పాటు చేశారు.
ఒకే దేశం, ఒకే ఎన్నిక (One Nation,One Election)పైనా చర్చ జరిగే అవకాశాలున్నాయి. ఇప్పటికే దీనిపై మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో ఓ కమిటీ ఏర్పాటైంది. ఈ సమావేశాల్లోనే మహిళా రిజర్వేషన్ బిల్‌ని ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి.
కేంద్రం విడుదల చేసిన ఈ నెల 18న 75 ఏళ్ల పార్లమెంటరీ ప్రజాస్వామ్య ప్రయాణంపై చర్చించనున్నట్టు లోక్‌సభ, రాజ్యసభ సచివాలయాలు వేర్వేరుగా బులెటిన్లు విడుదల చేశాయి. రాజ్యసభలో రెండు, లోక్‌సభలో రెండు బిల్లుపై చర్చ జరగనుంది.
ప్రత్యేక సమావేశాల్లో తొలి రోజు 75 ఏళ్ల పార్లమెంటరీ ప్రయాణంపై చర్చ జరగనుంది. రాజ్యసభలో కేంద్ర ఎన్నికల కమిషనర్ల నియామక బిల్లు, ది పోస్ట్ ఆఫీస్ బిల్లు, లోక్‌సభలో అడ్వకేట్స్ యాక్ట్ సవరణ బిల్లు, ది ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ బిల్లులపై చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి, ఎన్నికల కమిషనర్ల నియామకాలను నియంత్రించేలా కేంద్రప్రభుత్వం కొత్త బిల్లును తీసుకొచ్చింది. గత నెల 10న రాజ్యసభలో ప్రవేశపెట్టింది. నియామక ప్యానెల్‌లో ప్రధానమంత్రి, లోక్‌సభలో ప్రతిపక్ష నేత, ప్రధాని నామినేట్ చేసిన కేంద్ర కేబినెట్ మంత్రి ఒకరు... ఇందులో సభ్యులుగా ఉండనున్నారు. కమిటీ నుంచి సీజేఐను తొలగించింది. దీంతో ఈ నియామక ప్రక్రియ వివాదాస్పదమైంది.
ప్రశ్నోత్తరాల సమయం, ప్రైవేట్ కార్యకలాపాలు ఉండవని లోక్‌సభ, రాజ్యసభ సెక్రటేరియట్‌ల నుంచి ఇటీవలే అధికారిక నోటిఫికేషన్ వెలువడింది. సెషన్‌లో ఐదు సిట్టింగ్‌లు ఉంటాయి. సభ్యులు విడిగా తాత్కాలిక క్యాలెండర్‌ని అందుకుంటారు.
పార్లమెంట్‌పై ఉగ్రదాడిని గుర్తు చేసుకున్న ప్రధాని మోదీ
పార్లమెంట్ సజావుగా సాగేందుకు లెక్కలేనన్ని మంది సహకరించారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈ ప్రజాస్వామ్య సభపై కూడా ఉగ్రదాడి జరిగింది. ఈ దాడి పార్లమెంటుపై కాదు, మన ఆత్మపై జరిగింది. దాన్ని దేశం ఎప్పటికీ మరచిపోదు. సభను కాపాడేందుకు ఛాతీలో బుల్లెట్లు దిగినా ఉగ్రవాదులతో పోరాడిన అమరవీరులకు సెల్యూట్ చేస్తున్నాను.
పండిట్ నెహ్రూ నుంచి మన్మోహన్ సింగ్ వరకు
జవహర్ లాల్ నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి మొదలుకొని అటల్ బిహారీ వాజ్ పేయి, డాక్టర్ మన్మోహన్ సింగ్ వరకు పార్లమెంటరీ చరిత్రకు వారు చేసిన సేవలను మోదీ ప్రస్తావించారు. సర్దార్ పటేల్ నుంచి ఎల్ కే అద్వానీ పేర్లు కూడా ప్రస్తావనకు వచ్చింది.
ఇంత గౌరవం ఊహించలేదు: ప్రధాని మోదీ
దేశం మనకు ఇంత గౌరవం ఇస్తుందని ఊహించలేదన్నారు. పేదింట పుట్టిన బిడ్డ ఎంపీ అవుతాడని ఎప్పుడూ అనుకోలేదన్నారు. అదే భారత ప్రజాస్వామ్యానికి ఉన్న బలం అన్నారు. నేడు ప్రపంచం భారత్‌లో మంచి స్నేహితుడిని చూస్తోందని చెప్పారు.
జీ20 విజయం ఏ వ్యక్తి లేదా పార్టీ విజయం కాదు, దేశ విజయం : ప్రధాని మోదీ
'జీ-20 విజయం భారత్ విజయం. ఇది ఏ వ్యక్తి లేదా పార్టీ విజయం కాదు. ఇది ప్రతి ఒక్కరికీ గర్వకారణం. గత 75 ఏళ్లలో స్వతంత్ర భారతదేశానికి సంబంధించిన అనేక ఘటనలు ఈ సభలో జరిగాయి. 600 మంది మహిళా ఎంపీలు సభ గౌరవాన్ని పెంచారు. తొలిసారి ఎంపీగా వచ్చినప్పుడు ప్రజాస్వామ్య దేవాలయానికి నమస్కరించి భవనంలో అడుగుపెట్టాను.
భారత్ గురించే ప్రపంచ వ్యాప్తంగా చర్చ: మోదీ
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. 'భారతదేశం గురించి సర్వత్రా చర్చ జరుగుతోంది. చంద్రయాన్-3 విజయంతో యావత్ దేశం వేడుక చేసుకుంటుంది. దీని ద్వారా సైన్స్‌లో దేశ సత్తా చాటి చెప్పాం. ఇదంతా మన శాస్త్రవేత్తల సామర్థ్యంతో సాధ్యమైంది. దీని ఎఫెక్ట్ దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉంది.