అన్వేషించండి

Breaking News Live Telugu Updates: సుప్రీంకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై విచారణ శుక్రవారానికి వాయిదా

Breaking News Live Telugu Updates: ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం వెంటనే పొందవచ్చు.

LIVE

Key Events
Breaking News Live Telugu Updates: సుప్రీంకోర్టులో  చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై విచారణ శుక్రవారానికి వాయిదా

Background

బీజేపీ ఎన్నికల శంఖారావం ఆదిలాబాద్ నుంచే ప్రారంభం అవుతుందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి అన్నారు. ఈ సందర్బంగా ఎంపి సోయం బాపురావ్, భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి సభ ప్రాంగణాన్ని వేరు వేరు సమయంలో పర్యవేక్షించారు.  సాయంత్రం బిజేపి రాష్ట్ర ప్రధనకార్యదర్శి గుజ్జుల ప్రెమేందర్ రెడ్డి విలేఖరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు.  గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి మాట్లాడుతూ.. 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల ఆకాంక్షలు గాలికి వదిలేసి కేవలం తమ కుటుంబానికే అంతం అయిన తెలంగాణ పాలనను అరికట్టేందుకు ఆదిలాబాద్ జన గర్జన సభ నిర్వహిస్తున్నామన్నారు. 

ఆదిలాబాద్ పార్లమెంట్ నుండి ఇవాళ పెద్ద ఎత్తున కార్యకర్తలు నాయకులు తరలివస్తున్నారనీ, ప్రజలకు ఏలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని వసతులను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రచార సాధనాల్లో నగరంలో గ్రామాల్లోనూ ప్రచారం జరుగుతుందనీ, ఎన్నికల షెడ్యూల్ ఈరోజే రావడం భారతీయ జనతా పార్టీ ఎన్నికల షెడ్యూల్ లో భాగంగా మొదటి సభ ఆదిలాబాద్ లో జరగడం చాలా సంతోషం,ప్రతి యేటా ఆదిలాబాద్ జిల్లా భారతీయ జనతా పార్టీ కి కలిసి వస్తుందనీ, ఈ నియంత పాలనను తరిమికొట్టి రాబోయే రెండు నెలల్లో తెలంగాణ లో కమలం వికసించబోతుందనీ తెలియజేశారు. 

సదస్సుకు అన్ని వర్గాల మేధావులను ఆహ్వనించి మేనిఫెస్టోలో చేర్చాల్సిన అంశాలపై వారి నుంచి బీజేపీ సలహాలు తీసుకోనుంది. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే ఏం చేస్తుందో ఆదిలాబాద్‌ సభలో అమిత్‌ షా వివ రిస్తారని అన్నారు. కేసీఆర్‌కు హఠావో, బీజేపీకో జీతావో.. తెలంగాణకో బచావో... అనేదే బీజేపీ నినాదామని చెప్పారు.

ప్రధాని మోదీ దిష్టిబోమ్మలను ఎందుకు దగ్ధం చేస్తున్నారో కాంగ్రెస్‌ నేతలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. ‘రాష్ట్రాభివృద్ధి కోసం రూ.9 లక్షల కోట్లు ఇచ్చినందుకా, ఇటీవల రాష్ట్రానికి పసుపుబోర్డు, గిరిజన వర్సిటీ వంటివి ప్రకటించినందుకా, కృష్ణానదీలో తెలంగాణ నీటి వాటా ఖరారుకు ట్రిబ్యునల్‌ వేసినందుకా.. మోదీ దిష్టిబో మ్మలు దగ్ధం చేస్తున్నారు’అని నిలదీశారు.

ఎన్నికల ప్రచారమే ప్రధాన ఎజెండా

తెలంగాణలో పొలిటికల్ హడావుడి మొదలైంది. అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ఖరారు చేయడంతో ప్రధాన పార్టీలు వారి వారి వ్యూహాలకు పదును పెడుతున్నాయి. తెలంగాణలో పాగా వేయడానికి విసృతంగా ప్రయత్నిస్తున్న బీజేపీ ..అందుకు తగినట్లుగానే అగ్రనేతలు రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఇందులో బాగంగానే కేంద్ర హోంమంత్రి అమిత్‌షా తెలంగాణలో పర్యటించనున్నారు. ముందుగా ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకొని అక్కడి నుంచి ఆదిలాబాాద్ డైట్‌ కాలేజీ గ్రౌండ్స్‌లో జరిగే జనగర్జన బహిరంగసభలో పాల్గొంటారు.

ఆదిలాబాద్ సభ అనంతరం సాయంత్రం శంషాబాద్ లోనూ బీజేపీ మరో సభ నిర్వహించాలని తొలుత భావించింది. అయితే అది రద్దుకావడంతో సికింద్రాబాద్ సిఖ్ విలేజ్ లోని ఇంపీరియల్ గార్డెన్ లో నిర్వహించే మేధావుల సభలో అమిత్ షా పాల్గొంటారు. అనంతరం రాత్రి బీజేపీ రాష్ట్ర ముఖ్య నేతలతో సమావేశమై రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిణామాలు. పరిస్థితులపై చర్చించే అవకాశం ఉంది. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు జోగు రవి, ఆదినాథ్, ఆకుల ప్రవీణ్, గొర్ల రాము, సురేందర్, రవి తదితరులు పాల్గొన్నారు.  

14:16 PM (IST)  •  10 Oct 2023

సుప్రీంకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై విచారణ శుక్రవారానికి వాయిదా

సుప్రీం కోర్టులో చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్‌పై గట్టి వాదోపవాదాలు జరిగాయి. ఉదయం నుంచి ఈ కేసుపై చంద్రబాబు తరఫు లాయర్లు, సీఐడీ తరఫు లాయర్లు వాదించారు. ఇరు వర్గాల వాదనలు కొనసాగుతుండగానే మధ్యాహ్నం లంచ్ బ్రేక్ ఇచ్చారు. లంచ్ బ్రేక్ తర్వాత మరోసారి వాదనలు పునఃప్రారంభమయ్యాయి. వెంటనే ధర్మాసనం కేసు విచారణ శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేస్తున్నట్టు పేర్కొంది. 

10:35 AM (IST)  •  10 Oct 2023

గాజువాకలోని ఓ హటల్ ఫుడ్ తిన్న కస్టమర్స్ ఆసుపత్రి పాలు- ముగ్గురు పరిస్థితి విషమం

గాజువాక పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. మండి క్రూడ్ హోటల్లో తిన్న 13 మందికి ఫుడ్ పాయిజన్ అయింది. వీళ్లంతా పశ్చిమ నియోజకవర్గం 58 వ వార్డు పరిధి ములగాడ గ్రామానికి చెందిన యువకులు. ఆదివారం రాత్రి భోజనం చేసి ఇంటికి వచ్చిన తర్వాత వీళ్లంతా వాంతులు విరేచనాలతో ఆసుపత్రి పాలయ్యారు. వెంటనే వీళ్లను కెజిహెచ్‌లో చేర్పించారు కుటుంబ సభ్యులు. డిశ్చార్జ్ తర్వాత కూడా తగ్గలేదు. మరో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇందులో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. 

Load More
New Update
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TS Election 2024 Voting Percentage: తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని ప్రకటించిన ఈసీ, 2019 కంటే ఎక్కువే
తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని ప్రకటించిన ఈసీ, 2019 కంటే ఎక్కువే
PM Modi Assets: నరేంద్ర మోదీ ఆస్తి విలువ ఎంతో తెలుసా! సొంతిల్లు, కారు కూడా లేని భారత ప్రధాని
నరేంద్ర మోదీ ఆస్తి విలువ ఎంతో తెలుసా! సొంతిల్లు, కారు కూడా లేని భారత ప్రధాని
Mukku Avinash: ‘జబర్దస్త్’ వాళ్లు రూ.10 లక్షలు కట్టాలన్నారు - చచ్చిపోవాలనుకున్న టైమ్‌లో ‘బిగ్ బాస్’ రక్షించింది: ముక్కు అవినాష్
‘జబర్దస్త్’ వాళ్లు రూ.10 లక్షలు కట్టాలన్నారు - చచ్చిపోవాలనుకున్న టైమ్‌లో ‘బిగ్ బాస్’ రక్షించింది: ముక్కు అవినాష్
IPL 2024: కీలక మ్యాచ్‌లో ఢిల్లీ చేతిలో లక్నో ఓటమి, ప్లే ఆఫ్స్‌కు కష్టమే!
కీలక మ్యాచ్‌లో ఢిల్లీ చేతిలో లక్నో ఓటమి, ప్లే ఆఫ్స్‌కు కష్టమే!
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Delhi Capitals vs Lucknow Super Giants Highlights | కీలక మ్యాచులో దిల్లీ ఆల్ రౌండ్ షో | ABP DESAMYSRCP vs TDP Fight in Palnadu District | Karampudiలో టీడీపీ ఆఫీస్ పై వైసీపీ కార్యకర్తల దాడి | ABPJC Prabhakar Reddy vs Pedda Reddy | తాడిపత్రిలో రాళ్ల వర్షం.. పెద్దారెడ్డి ఇంటికి బయలుదేరిన జేసీJC Prabhakar Reddy vs Pedda Reddy | తాడిపత్రిలో రాళ్ల వర్షం.. పెద్దారెడ్డి ఇంటికి బయలుదేరిన జేసీ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TS Election 2024 Voting Percentage: తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని ప్రకటించిన ఈసీ, 2019 కంటే ఎక్కువే
తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని ప్రకటించిన ఈసీ, 2019 కంటే ఎక్కువే
PM Modi Assets: నరేంద్ర మోదీ ఆస్తి విలువ ఎంతో తెలుసా! సొంతిల్లు, కారు కూడా లేని భారత ప్రధాని
నరేంద్ర మోదీ ఆస్తి విలువ ఎంతో తెలుసా! సొంతిల్లు, కారు కూడా లేని భారత ప్రధాని
Mukku Avinash: ‘జబర్దస్త్’ వాళ్లు రూ.10 లక్షలు కట్టాలన్నారు - చచ్చిపోవాలనుకున్న టైమ్‌లో ‘బిగ్ బాస్’ రక్షించింది: ముక్కు అవినాష్
‘జబర్దస్త్’ వాళ్లు రూ.10 లక్షలు కట్టాలన్నారు - చచ్చిపోవాలనుకున్న టైమ్‌లో ‘బిగ్ బాస్’ రక్షించింది: ముక్కు అవినాష్
IPL 2024: కీలక మ్యాచ్‌లో ఢిల్లీ చేతిలో లక్నో ఓటమి, ప్లే ఆఫ్స్‌కు కష్టమే!
కీలక మ్యాచ్‌లో ఢిల్లీ చేతిలో లక్నో ఓటమి, ప్లే ఆఫ్స్‌కు కష్టమే!
AP Elections 2024: ఏపీ ఎన్నికల యుద్ధం తరువాత సీఎం జగన్, వైఎస్ షర్మిల ఫస్ట్ రియాక్షన్ చూశారా!
ఏపీ ఎన్నికల యుద్ధం తరువాత సీఎం జగన్, వైఎస్ షర్మిల ఫస్ట్ రియాక్షన్ చూశారా!
Struggling to Lose Weight : సరైన నిద్రలేకపోతే బరువు తగ్గరట.. రీజన్​ సిల్లీగా అనిపించినా ఎఫెక్ట్ మాత్రం ఎక్కువట జాగ్రత్త
సరైన నిద్రలేకపోతే బరువు తగ్గరట.. రీజన్​ సిల్లీగా అనిపించినా ఎఫెక్ట్ మాత్రం ఎక్కువట జాగ్రత్త
Konaseema Accident: కోనసీమ జిల్లాలో ఘోర ప్రమాదం - అక్కడికక్కడే ఐదుగురు దుర్మరణం
కోనసీమ జిల్లాలో ఘోర ప్రమాదం - అక్కడికక్కడే ఐదుగురు దుర్మరణం
KTR In Sircilla: కాంగ్రెస్, బీజేపీలకు ముచ్చెమటలు! ఎన్నికల్లో జాతీయ పార్టీల పరిస్థితి ఇదీ: కేటీఆర్
కాంగ్రెస్, బీజేపీలకు ముచ్చెమటలు! ఎన్నికల్లో జాతీయ పార్టీల పరిస్థితి ఇదీ: కేటీఆర్
Embed widget