Top Headlines Today: గోదావరి జిల్లాల్లో వైసీపీకి కొత్త తలనొప్పి! లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ రేసులో ఉండదన్న బండి సంజయ్
AP Telangana Latest News 25 December 2023: తెలుగు రాష్ట్రాల్లో నేటి ఉదయం నుంచి టాప్ హెడ్ లైన్స్ మీకోసం..

'కాంగ్రెస్ డీఎన్ఏలోనే హిందూ వ్యతిరేక ధోరణి' - రాహుల్ గాంధీపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తీవ్ర విమర్శలు
కాంగ్రెస్ డీఎన్ఏలోనే హిందూ వ్యతిరేక ధోరణి ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (BRS MLC Kavitha) మండిపడ్డారు. ప్రస్తుతం ఆ పార్టీ అయోమయంలో ఉందని, ఇచ్చిన ఏ హామీని అమలు చేయడం లేదని విమర్శించారు. సోమవారం మీడియాతో మాట్లాడిన ఆమె, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల్లో గెలిచిన వెంటనే కాంగ్రెస్ హామీలన్నింటినీ మరిచిపోయిందని, కర్ణాటకలో 6 హామీలు ఇప్పటికీ అమలు చేయలేదని ఆరోపించారు. 'కర్ణాటకలోని విద్యా సంస్థల్లో హిజాబ్ నిషేధాన్ని ఎత్తివేస్తామని హామీ ఇచ్చారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
ప్రభుత్వానికి తలనొప్పిగా సమ్మె సైరన్- రోడ్డుపైకి వస్తున్న కాంట్రాక్ట్, అవుట్‌సోర్స్ సిబ్బంది
ఓవైపు అంగన్వాడీలు 15 రోజులుగా సమ్మె చేస్తున్నారు. ఇప్పుడు కాంట్రాక్ట్, అవుట్‌సోర్స్ ఉద్యోగులు కూడా అదే బాట పట్టబోతున్నారు. మొత్తానికి ఈ వ్యవహారం ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారే అవకాశాలు ఉన్నాయి. ప్రతిపక్షనేతగా ఇచ్చిన హామీలు నెరవేర్చాలని వీళ్లంతా రోడ్డు ఎక్కుతున్నారు. ఎన్నికల కోసం వైసీపీ సిద్ధమవుతున్న టైంలో రాష్ట్రంలో జరుగుతున్న కొన్ని పరిణామాలు ఆ పార్టీని కలవర పెడుతున్నాయి. సమస్యల పరిష్కారం కోసం ఒక్కొక్కరుగా కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు రోడ్లపైకి వస్తున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ రేసులో ఉండదు - బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు !
బీఆర్ఎస్ ప్రాంతీయ పార్టీ అని.. అసెంబ్లీకే తెలంగాణ ప్రజలు వద్దనుకుంటే ఇక పార్లమెంట్ కు ఎందుకు ఓటేస్తారని తెలంగాణ బీజేపీ ముఖ్య నేత బండి సంజయ్ ప్రశ్నించారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ పోటీదారు కానేకాదన్నారు. మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజ్ పేయి జయంతిని పురస్కరించుకుని కరీంనగర్ జిల్లా పార్టీ కార్యాలయంలో సుపరిపాలన దినోత్సవం నిర్వహించారు.ఈ సందర్భంగా బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
గోదావరి జిల్లాల్లో వైసీపీకి కొత్త తలనొప్పి- అలా చేయడం మా వల్ల కాదంటున్న నేతలు
అధికార పార్టీలో కొందరు ఎమ్మెల్యేలను స్థాన చలనం తప్పదని ఇప్పటికే సంకేతాలు జారీ చేసిన వైసీపీ అధిష్ఠాం వారిలో కొందరిని పార్లమెంటుకు పంపించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది.. అయితే వారి నుంచి మాత్రం ఎటువంటి అంగీకారం కనిపించడం లేదని తెలుస్తోంది. ఫలానా స్థానం నుంచి మీరు ఎంపీగా పోటీచేయాల్సి ఉంటుంది. అందుకు సిద్ధంగా ఉండండి అంటే బాబోయ్ ఎంపీగా పోటీనా.. మావల్లకాదండీ అంటూ ఏదోలా సైడ్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నారట పలువురు ఎమ్మెల్యేలు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
ప్రాజెక్టుల బాట పడుతున్న మంత్రులు - ఈ నెల 29న మేడిగడ్డకు ఉత్తమ్, శ్రీధర్‌బాబు
తెలంగాణ(Telangana) అసెంబ్లీ(Assembly)ని గత వారం ప్రాజెక్టులు, విద్యుత్, ఆర్థిక పరిస్థితులు తీవ్రంగా కుదిపేశాయి. ముఖ్యంగా ప్రాజెక్టులపై కాంగ్రెస్(Congress), బీఆర్‌ఎస్(BRS) మధ్య తీవ్ర స్థాయిలో మాటల తూటాలు పేలాయి. ప్రాజెక్టుల నిర్మాణాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తున్న ప్రబుత్వం వాటిని నిగ్గు తేల్చేందుకు కమిటీలను కూడా వేసింది. కమిటీలతో ఆగిపోని కాంగ్రెస్ ప్రభుత్వంలోని మంత్రులు నేరుగా ప్రాజెక్టులను సందర్శించబోతున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి





















