అన్వేషించండి

AP Crop Damage: ఏపీలో ప్రత్యేక బృందాలతో పంట నష్టం అంచనా-జనవరిలో పరిహారం

మిగ్‌జామ్‌ తుఫాన్‌ కారణంగా ఏపీలో లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. దీంతో పంట నష్టం అంచనాకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది ఏపీ ప్రభుత్వం. జనవరిలో పరిహారం అందేలా ప్రయత్నిస్తోంది.

Crop Damage in Andra Pradesh: మిగ్‌జామ్‌ తుఫాన్ ఆంధ్రప్రదేశ్‌ రైతులను నిండా ముంచేసింది. ఆరుగాలం కష్టించి పండించిన పంట మొత్తం నీటిపాలైంది. తుఫాన్‌  ప్రభావిత జిల్లాల్లో ఎటు చూసినా నీట మునిగిన పొలాలు.. నేలకొరిగిన పంటచేలే కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో నష్టపోయిన రైతన్నలను ఆదుకునేందుకు ఏపీ ప్రభుత్వం  ప్రత్యేక చర్యలు చేపడుతోంది. వీలైనంత త్వరగా వారికి నష్టపరిహారం అందించేందుకు కృషిచేస్తోంది. రైతులకు అండగా నిలవాలని అధికారులను కూడా ఆదేశించారు  ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. అంతేకాదు పంట నష్టం అంచనాలకు ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేసింది ఏపీ ప్రభుత్వం. వ్యవసాయ, ఉద్యాన శాఖలు,  రెవెన్యూ శాఖతో కలిసి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. 

పొలాల్లో ముంపు నీరు తగ్గిన తర్వాత... వెంటనే పంట నష్టం అంచనా మొదలుపెట్టాలని ఆదేశించారు సీఎం జగన్‌. ముఖ్యమంత్రి ఆదేశాలతో క్షేత్రస్థాయిలో అంచనాలను  సిద్ధమవుతున్నాయి ప్రత్యేక బృందాలు. మరో రెండు వారాల్లో పంట నష్టం అంచనాలను ఒక కొలిక్కి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నారు. ఈ నెలాఖరుకు లేదా జనవరి  మొదటి వారంలో పరిహారం పంపిణీ చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. తుఫాన్‌ కారణంగా నష్టపోయిన రైతులకు అడుగడుగునా అండగా నిలబడాలని ఆదేశించారు  ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. ఇప్పటికే వర్షాలకు తడిసి, తేమ శాతం, రంగు మారిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు కొలుగోలు చేస్తున్నారు. సాంకేతిక కారణాలను  పట్టించుకోకుండా, నిబంధనలు సడలించి మరీ... తడిసిన, రంగుమారిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొంటోంది. రైతులకు నష్టం జరగకుండా... తడిసి, రంగుమారిన ధాన్యాన్ని  కూడా మద్దతు ధరకే కొనుగోలు చేసి... మిల్లులకు తరలిస్తోంది. 

ఇక... నీటి మునిగిన పొలాలు, నేలకొరిగిన పంటల అంచనాలను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు సీఎం జగన్‌. ముఖ్యంగా... వరితో పాటు మిరప, పత్తి, మొక్కజొన్న,  వేరుశనగ పంటలపై తుఫాన్‌ తీవ్ర ప్రభావం చూపింది. అరటి పంటలు పూర్తిగా నేలకొరిగాయి. చేతికొచ్చిన పంట... నేలకూలడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  అలాంటి రైతులందరికీ అండదండగా నిలవాలని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. ఖరీఫ్‌ సీజన్‌లో 64 లక్షల ఎకరాల్లో వ్యవసాయం, 29  లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలు సాగయ్యాయి. వర్షాభావ పరిస్థితుల వల్ల ఏడు జిల్లాల్లో 15 లక్షల ఎకరాల్లో పంటలు ఇప్పటికే దెబ్బతిన్నట్టుగా గుర్తించారు. ఇక 17 లక్షల  ఎకరాల్లో పంటల కోతలు పూర్తయ్యాయి. మరో 15 లక్షల ఎకరాల్లో కోతలకు సిద్ధంగా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో మిగ్‌జామ్‌ తుఫాన్‌ కారణంగా... 80వేల ఎకరాల్లో పంటలు  ముంపునకు గురయ్యాయని... కోతకు సిద్ధంగా ఉన్న లక్ష ఎకరాలకు పైగా పంట నేలకొరిగినట్టు ప్రాథమికంగా అంచనా చేశారు అధికారులు. అయితే... పూర్తిస్థాయిలో  పంటనష్టం అంచనాలు సిద్ధం చేయాలని ప్రత్యేక బృందాలను పంపుతోంది ఏపీ ప్రభుత్వం.

ఇప్పటికే వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారులు ఆర్బీకే సిబ్బందితో కలిసి క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ ఎప్పటికప్పుడు రైతులను అప్రమత్తం చేశారు. ఆర్బీకే సిబ్బంది కూడా రోజూ రైతులతో మాట్లాడుతూ... వారికి అన్ని విధాలుగా అండగా నిలుస్తున్నారు. తుఫాన్‌ ప్రభావం మొదలైనప్పటి నుంచి పంటచేలకు వెళ్లి నష్ట నివారణకు తీసుకోవల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు. 

టాప్ హెడ్ లైన్స్

Jasprit Bumrah News: బుమ్రా లేకపోవడం శ్రీలంకకు బిగ్ అడ్వాంటేజ్.. కానీ టీమిండియాను తక్కువ అంచనా వేయద్దు.. మాజీ క్రికెట‌ర్ వార్నింగ్
బుమ్రా లేకపోవడం శ్రీలంకకు బిగ్ అడ్వాంటేజ్.. కానీ టీమిండియాను తక్కువ అంచనా వేయద్దు.. మాజీ క్రికెట‌ర్ వార్నింగ్
GHMC Elections: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
Tirumala Road Accident: తిరుమల ఘాట్ రోడ్డులో లోయలో రోడ్డు ప్రమాదం.. కర్ణాటకకు చెందిన భక్తుడి మృతి
Tirumala Road Accident: తిరుమల ఘాట్ రోడ్డులో లోయలో రోడ్డు ప్రమాదం.. కర్ణాటకకు చెందిన భక్తుడి మృతి
Private Schools Fee: ప్రైవేట్‌ స్కూళ్లలో ఫీజుల వివరాలు ప్రదర్శించాలి: విద్యాశాఖ కీలక ఆదేశాలు
ప్రైవేట్‌ స్కూళ్లలో ఫీజుల వివరాలు ప్రదర్శించాలి: విద్యాశాఖ కీలక ఆదేశాలు

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mancherial News: ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
Anakapalle Latest News:
"అనకాపల్లిలోని కళ్యాణపులోవ రిజర్వాయర్‌ను నో మైనింగ్ జోన్‌గా ప్రకటించాలి" రైతులు, గిరిజనుల జల దీక్ష !
Double Lung Transplant : 47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
World Wonders: ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
Divorce After Marriage : పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
Vijay Divorce Case: తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
Nethanna Seva Lo: జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
Hyderabad Crime News: వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
Embed widget