Top Headlines Today: గవర్నర్‌ను కలవనున్న వైఎస్ జగన్, ఉజ్జయిని మహాంకాళి ఆలయానికి రేవంత్ రెడ్డి- నేటి టాప్ న్యూస్
Telugu News on 21 July 2024: సికింద్రాబాద్‌లో ఉజ్జయిని మహాంకాళి బోనాలు జాతర మొదలైంది. తెలుగు రాష్ట్రాల్లో నేటి నుంచి టాప్ హెడ్ లైన్స్ ఒక్క క్లిక్‌తో ఒకేచోట..
Andhra Pradesh and Telangana News - ఇండీ కూటమి దగ్గరకు వెళ్లలేరు , ఎన్డీఏ రానివ్వదు - జాతీయ రాజకీయాల్లో జగన్ ఒంటరి !
ఆంధ్రప్రదేశ్ లో అరాచకాలు జరిగిపోతున్నాయని దేశం దృష్టికి తీసుకెళ్లేందుకు ఢిల్లీలో ఎంపీలు, ఎమ్మెల్యేలతో కలిసి ధర్నా చేయాలని జగన్ నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో పార్టీ ఎంపీలతో సమావేశం అయిన ఆయన కలసి వచ్చే పార్టీల మద్దతు కోసం ప్రయత్నించాలని కోరారు. అయితే వైఎస్ఆర్‌సీపీకి ఢిల్లీలో మద్దతుగా వచ్చే పార్టీలు పెద్దగా కనిపించడం లేదు. దీనికి కారణం వైఎస్ జగన్మోనహన్ రెడ్డి ఇంత కాలం అనుసరిస్తున్న వ్యూహమే అనుకోవచ్చు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
గవర్నర్‌ను కలవనున్న వైఎస్ జగన్, టీడీపీ దాడులపై ఫిర్యాదు
మాజీ ముఖ్యమంత్రి , వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను కలవనున్నారు. ఎన్డీఏ ప్రభుత్వం కొలువుదీరిన నాటి నుంచి రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న పలు సంఘనలపై సాయంత్రం గంటలకు రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేయనున్నారు. విజయవాడలో అందుబాటులో ఉన్న పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులతో కలిసి రాజ్‌భవన్‌లో వైఎస్ జగన్ గవర్నర్‌ను కలుస్తారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
ఏపీలో ‘ఇద్దరి సవతుల ముద్దుల మొగుడు’ సినిమా - ఆ ఇద్దరి మొగుడు మోదీనే: కాంగ్రెస్
ఏపీలో ప్రస్తుతం రాజకీయ సినిమా నడుస్తోందని.. ఇద్దరు సవతుల ముద్దుల మొగుడు రసవత్తరంగా సాగుతోందని ఏపీ కాంగ్రెస్ మీడియా ఛైర్మన్ డాక్టర్ ఎన్. తులసి రెడ్డి ఎద్దేవా చేశారు. చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డిల ముద్దుల మొగుడు నరేంద్ర మోదీ అని అన్నారు. ఏపీకి రావాల్సింది కొండంత, ఇచ్చింది గోరంత అని అన్నారు. గత పదేళ్లలో విభజన హామీలు అమలు చేసి ఉంటే ఏపీ స్వర్ణాంధ్ర అయ్యేదని అన్నారు. ప్రత్యేక హోదాకు బీజేపీ పంగనామాలు పెట్టిందని విమర్శించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత సాధ్యమేనా ? చట్టం ఏం చెబుతోంది ?
భారత రాష్ట్ర సమితి నుంచి ఫిరాయించిన ఎమ్మెల్యేలపై ఖచ్చితంగా అనర్హతా వేటు పడుతుందని ఉపఎన్నికలు వస్తాయని కేటీఆర్ ఘంటాపథంగా చెబుతున్నారు. అంతకు మందు తాము విలీనం చేసుకున్నామని ఫిరాయింపులు కాదని అందుకే అనర్హతా వేటుకు అవకాశం లేదని కేటీఆర్ చెబుతున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతోందని అందుకే అనర్హతా వేటు ఖాయమంటున్నారు. న్యాయపోరాటం చేస్తున్నారు. హైకోర్టులో పిటిషన్లుపై విచారణ జరుగుతున్నాయి. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
ఉజ్జయిని మహాంకాళి ఆలయానికి రేవంత్ రెడ్డి - అమ్మవారికి పట్టు వస్త్రాలు
సికింద్రాబాద్‌లో ఉజ్జయిని మహాంకాళి బోనాలు కోలాహలంగా సాగుతున్నాయి. నేడు ఆదివారం కావడంతో భక్తులు భారీగా ఆలయానికి వస్తున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి సికింద్రాబాద్ లోని ఉజ్జయిని మహాంకాళి అమ్మవారి దర్శనం చేసుకున్నారు. పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. మహాంకాళి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు చాలా మంది భక్తులు క్యూలైన్లలో వేచి ఉన్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి