Amitab Bodyguard : అమితాబ్ సెక్యూరిటీ గార్డు సంపాదన ఏడాదికి రూ. కోటిన్నర..! కానీ..
ఏటా రూ. కోటిన్నర ఆదాయం ఉందని అమితాబ్ సెక్యూరిటీ గార్డు షిండే ప్రకటించుకున్నారు. ఇదే ఆయన్ను చిక్కుల్లో పెట్టింది. పోలీసు ఉద్యోగి అయిన ఆయనపై ఉన్నతాధికారులు విచారణ ప్రారంభించారు.
అమితాబ్ బచ్చన్ బాడీగార్డ్ తన సంపాదన కోట్లలో ఉందని గొప్పగా ప్రకటించుకున్నారు. అందరూ సూపర్ స్టార్ బాడీగార్డ్‌కు ఆ మాత్రం జీతం ఇస్తారులే అనుకున్నారు. కానీ ముంబై పోలీసులు అలా అనుకోలేదు. వెంటనే పిలిపించారు. ఎందుకంటే ఆయన అమితాబ్ బచ్చన్ వ్యక్తిగత బాడీగార్డే కానీ పోలీసు ఉద్యోగి. అమితాబ్‌కు ప్రభుత్వం రక్షణ కల్పిస్తుంది. ఆ రక్షణ బృందంలో ఈ ఖరీదైన బాడీగార్డు కూడా ఉన్నారు. ఆయన పేరు జితేంద్ర షిండే. అమితాబ్ బచ్చన్ వద్ద ఆరేళ్లుగా పనిచేస్తున్నారు. ఆయన సెక్యూరిటీగా ఉంటే అమితాబ్ కూడా కాస్త నిశ్చితంగా ఉంటారు. అందుకే తన పలుకుబడి ఉపయోగించో లేకపోతే మరో కారణమో కానీ... షిండేను చాలా కాలంగా తన దగ్గరే అట్టి పెట్టుకున్నారు.
ఎక్కువగా ఆయన ప్రైవేటు సెక్యూరిటీనేమో అనుకున్నారు. కానీ అసలు విషయం మాత్రం ఆయన ప్రభుత్వ పోలీసు. షిండే సంపాదన కోట్లలో ఉంటుందని తెలియగానే ముంబై పోలీసు ఉన్నతాధికారులు ఆశ్చర్యపోయారు. వెంటనే విచారణ జరిపించారు. నిజంగానే ఆయన ఏటా రూ. కోటిన్నర సంపాదిస్తున్నాడని తేలింది. అమితాబ్ బచ్చన్ ప్రత్యేకంగా జీతం ఇస్తున్నారా లేకా.. సూపర్ స్టార్‌తో ఫోటోలు దిగాలనుకునేవారు దగ్గర వసూలు చేస్తున్నారా అన్న దానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇంకేమైనా మార్గాలున్నాయి.. తప్పుడు పను చేస్తున్నాడా అన్నదానిపైనా దర్యాప్తు చేస్తున్నారు.
అయితే బిగ్ బీ దగ్గర బాడీగార్డ్ గా ఉండే అవకాశం సంపాదించిన షిండే.. ఆ పరిచయాలతో వ్యాపారం ప్రారంభించాడు. తన భార్య మరో సెక్యూరిటీ ఏజెన్సీ ప్రారంభించాడు. ఈ ఏజెన్సీ ద్వారా పలువురు ప్రముఖులు, సెలబ్రిటీలకు సెక్యూరిటీని అందిస్తున్నారు. తన భార్య పేరు మీదే ఈ ఏజెన్సీ షిండే నడిపిస్తూ సంపాదిస్తున్నారు. ఆరేళ్లుగా బిగ్ బీ వద్ద షిండే పనిచేస్తున్నాడు. ఎవరికైనా మూడేళ్లలో బదిలీ చేయాలి. కానీ ఆయన్ను మాత్రం బదిలీ చేయలేదు. పెద్ద ఎత్తున డబ్బు సంపాదించాడని తేలిన తర్వాత దక్షిణ ముంబైలోని పోలీస్ స్టేషన్‌ను బదిలీ చేశారు. వచ్చిన సంపాదనను రహస్యంగా ఉంచుకోకుండా గొప్పలు పోతే చాలా సమస్యలు వస్తాయని.. తనను తాను రక్షించుకోవడం కష్టమని సెక్యూరిటీ గార్డ్ షిండేకు ఇప్పుడు అర్థమై ఉంటందని సెటైర్లు వేస్తున్నారు బిగ్ బీ ఫ్యాన్స్.
బాలీవుడ్‌లో టాప్ సెలబ్రటీల వద్ద ఉండే సెక్యూరిటీ గార్డుల జీతాలు ఎప్పుడూ హాట్ టాపిక్ అవుతూనే ఉంటాయి. సల్మాన్ ఖాన్, దీపికా పదుకొనే వంటి స్టార్లు తమ బాడీగార్డులకు రూ. లక్షల్లోనే జీతాలిస్తారన్న ప్రచారం ఉంది. అయితే అధికారికంగా ఎప్పుడూ ప్రకటించలేదు. కానీ పోలీసుల తరపున సెక్యూరిటీగా వచ్చిన షిండే మాత్రం ప్రకటించుకుని చిక్కుల్లో పడ్డాడు.