వీల్‌ఛైర్ లేక వృద్ధుడు మృతి, ఎయిర్ ఇండియాకి రూ.30 లక్షల జరిమానా
Air India: వృద్ధుడికి వీల్ ఛైర్ ఇవ్వని ఘటనలో ఎయిర్ ఇండియాకి DGCA రూ.30 లక్షల జరిమానా విధించింది.
Air India Imposed With Fine: ఎయిర్ ఇండియా సంస్థకి DGCA గట్టి షాక్ ఇచ్చింది. ఓ 80 ఏళ్ల వృద్ధుడికి వీల్‌ఛెయిర్ ఇవ్వకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ముంబయి ఎయిర్‌పోర్ట్‌లో నడవలేని స్థితిలో ఉన్న వృద్ధుడికి సిబ్బంది వీల్ ఛెయిర్ ఇవ్వలేదు. ఫలితంగా ఆయన ప్లేన్ దిగి టర్మినల్ వైపు నడుస్తూ ఉన్నట్టుండి కుప్ప కూలిపోయాడు. హాస్పిటల్‌కి తరలించేలోగా ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన సంచలనం సృష్టించింది. దీనిపై సీరియస్ అయిన DGCA ఎయిర్ ఇండియాని మందలించింది. అంతే కాదు. రూ.30 లక్షల జరిమానా విధించింది. ఫిబ్రవరి 12న ఈ ఘటన చోటు చేసుకున్నా...ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. Directorate General of Civil Aviation (DGCA) అధికారి ఒకరు రూ.30 లక్షల జరిమానా విధించినట్టు వెల్లడించారు. ఈ ఘటనపై ఎయిర్ ఇండియా కనీసం స్పందించలేదని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
"ఎయిర్ ఇండియా ఈ ఘటనపై ఎలాంటి చర్యలు తీసుకుందో ఏమీ చెప్పలేదు. వీల్‌ఛెయిర్ ఇవ్వని సిబ్బందిపై ఏం చర్యలు తీసుకున్నారో కూడా వివరించలేదు. ఇలాంటివి భవిష్యత్‌లో జరగకుండా చూసుకుంటామని కనీసం ఓ ప్రకటన కూడా చేయలేదు. అందుకే ఈ చర్యలు తీసుకోవాల్సి వచ్చింది"
- DGCA
మలయాళ హీరోయిన్‌కి వేధింపులు..
సివిల్ ఏవియేషన్ సంస్థ ఎయిర్ ఇండియాకి ఇప్పటికే షోకాజ్ నోటీసులిచ్చింది. ఫిబ్రవరి 20వ తేదీన దీనికి సంబంధించి వివరణ ఇచ్చింది ఎయిర్ ఇండియా. వీల్‌ఛెయిర్ ఇచ్చినప్పటికీ ఆ వృద్ధుడు తన భార్యతో కలిసి నడిచి వెళ్తానని చెప్పినట్టు వివరించింది. అవసరమున్న ప్రయాణికులందరికీ అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని స్పష్టం చేసింది. మలయాళంలో పదిహేనుకు పైగా సినిమాల్లో నటించిన అమ్మాయి దివ్య ప్రభ (Malayalam Actress Divya Prabha). తమిళంలో 'కాయల్', 'కొడియల్ వరువన్' సినిమాలు కూడా చేశారు. ఇటీవల ముంబై నుంచి కొచ్చి ఫ్లైట్ జర్నీ చేసిన తనకు విమానంతోటి ప్రయాణికుడి నుంచి వేధింపులు ఎదురు అయ్యాయని దివ్య ప్రభ తెలిపారు. ముంబై నుంచి కొచ్చి బయలు దేరిన విమానంలో తాను ప్రయాణించానని దివ్య ప్రభ తెలిపారు. తన సీట్ నంబర్ 12 ఏ అని చెప్పారు. మద్యం తాగిన ఒకరు 12 సి నుంచి 12 బి సీటుకు మారి తనతో అసభ్యంగా ప్రవర్తించారని ఆమె పేర్కొన్నారు.
''లాజిక్ లేకుండా అతడు నాతో గొడవ పడ్డాడు. ఆర్గ్యుమెంట్ చేశాడు. తప్పు తప్పుగా ప్రవర్తించాడు. అసభ్యంగా తాకాడు. ఈ విషయాన్ని నేను ఎయిర్ హోస్టెస్ దృష్టికి తీసుకు వెళ్ళాను. నాకు మూడు నాలుగు రోస్ ముందు ఉన్న మిడిల్ సీట్ ఇచ్చారు. అంతే తప్ప... వేధింపులకు పాల్పడిన వ్యక్తి మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కొచ్చిలో ల్యాండ్ అయిన వెంటనే ఎయిర్ ఇండియా స్టాఫ్, ఎయిర్ పోర్ట్ అధికారులకు కంప్లైంట్ చేశా'' అని దివ్య ప్రభ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. నెటిజనుల నుంచి ఆమెకు మద్దతు లభిస్తోంది.
Also Read: రష్యన్ టూరిస్ట్‌పై ఏనుగు దాడి, తొండంతో పట్టుకుని నేలకేసి కొట్టిన వీడియో వైరల్