Air India Flight Crash: ఇదే చివరి ఫొటో అవుతుంది అనుకోలేదు..ఓ కుటుంబాన్ని చిదిమేసిన విమాన ప్రమాదం!
Air India Flight Crash Family Last Selfie: విదేశాల్లో స్థిరపడాలన్న ఆ కుటుంబం కలను అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదం చిదిమేసింది. మొత్తం కుటుంబాన్నే తీసుకెళ్లిపోయింది

Air India Flight Crash: అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదంలో ఓ కుటుంబం తీసుకున్న చివరి సెల్ఫీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫొటో చూసి ద్రవించని హృదయం లేదు.. ఈ ఫొటో వెనుక స్టోరీ ఇదే..
డాక్టర్ కోమి వ్యాస్ , డాక్టర్ ప్రతీక్ జోషి
పదేళ్ల క్రితం వివాహం జరిగింది
వీరికి ముగ్గురు పిల్లలు.. కుమార్తె ఎనిమిదేళ్ల మిరియా, ప్రద్యుత్-నకుల్ అనే కవలలు ఉన్నారు.
రాజస్థాన్ కి చెందిన ఈ కుటుంబం లండన్ లో స్థిరపడాలి అనుకున్నారు
కోమి, జోషి ఇద్దరూ ఉదయ్ పూర్ ఓ హాస్పిటల్లో విధులు నిర్వహించేవారు
ఈ మధ్యే లండన్ వెళ్లిన జ్యోషి..తన భార్య, పిల్లల్ని తనతో పాటూ తీసుకెళ్లేందుకు ఇండియా వచ్చారు. రెండు రోజుల్లో తిరిగి లండన్ కి ఫ్యామిలీతో సహా బయలుదేరారు. అక్కడే సెటిలవుదాం అనే ప్లాన్ తో సంతోషంగా ప్రయాణమయ్యారు.
విమానం ఎక్కిన వెంటనే బైబై చెబుతూ సరదాగా సెల్ఫీ తీసుకున్నారు..
ఓ సీట్లో భార్య భర్త కూర్చున్నారు..మరో సీట్లో ముగ్గురు పిల్లలు కూర్చున్నారు..
ఆ సెల్ఫీ తీసుకుని మురిసిపోయారు..ఎంత సంతోషంగా ఉన్నారో..కానీ ఆ తర్వాత కొద్ది సేపటికే విమాన ప్రమాదంలో భాగంగా చెలరేగిన మంటల్లో తిరిగిరానిలోకాలకు వెళ్లిపోయారు.
లండన్ లో స్థిరపడాలని కలలు కన్నారు..ఆ కలల్ని నిజం చేసుకునేందుకు విమానం ఎక్కారు. ఆ సంతోషాన్ని ఇలా సెల్ఫీ తీసుకున్నారు. ఈ క్షణాన్ని పదిలంగా దాచుకోవాలని ఆశపడ్డారు. కానీ అంతలోనే ఆ కలలు కల్లలయ్యాయి. ప్రమాదం జరిగి మొత్తం కుటుంబంలో ఐదుగురూ మృత్యుఒడికి చేరారు.
కోమి వ్యాస్ లండన్ లో వైద్యుడిగా స్థిరపడాలని ప్లాన్ చేసుకోవడంతో ఈ మధ్యే పసిఫిక్ హాస్పిటల్‌లో తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. ప్రతీక్ తండ్రి ప్రముఖ రేడియాలజిస్ట్ కాగా కోమీ తండ్రి పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్‌లో విధులు నిర్వర్తిస్తున్నారు.
అహ్మదాబాద్ నుంచి లండన్‌కు బయలుదేరిన ఎయిరిండియా విమానం బయలుదేరిన కొద్దిసేపటికే కుప్పకూలిపోయింది..మంటల్లో కాలి బూడిదైపోయింది. కేవలం ఒక్కరంటే ఒక్క వ్యక్తి మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. ఆ సమయంలో విమానంలో ప్రయాణిస్తున్న వారు మాత్రమే కాదు.. వైద్యకళాశాల భవనంపై పడడంతో మరో 24 మంది మృతిచెందారు.
అయితే విమానం ఎక్కేముందు డాక్టర్ ఫ్యామిలీ సెల్ఫీ మాత్రమే కాదు..ఇద్దరు బ్రిటీష్ పౌరులు కూడా సెల్ఫీ వీడియో తీసుకున్నారు. ఇండియా నుంచి ఇంగ్లండ్ వెళ్లిపోతున్నాం కొద్దిసేపట్లో విమానం ఎక్కేస్తున్నామ్ బైబై ఇండియా అని సంతోషంగా వీడియో తీసుకున్నారు. ఆ తర్వాత కొద్దిసేపటికే వారి ప్రయాణం పూర్తిగా ముగిసిపోయింది. ఈ విడియో చూసి ద్రవించని హృదయం లేదు.
అహ్మాదాబాద్‌లో జరిగిన ఈవిమాన ప్రమాద ఘటన యావత్ దేశాన్ని శోకసంద్రంలో ముంచేసింది. విమానంలో మొత్తం 242 మంది ఉండగా 241 మంది మృతిచెందారు. మంటలు భగ్గుమనడంతో ప్రయాణికులకు తప్పించుకునే అవకాశం కూడా లేకపోయింది. మృతిచెందినవారిలో ఇద్దరు పైలెట్లు, పది మంది సిబ్బంది కూడా ఉన్నారు. 229 మంది ప్రయాణికులున్నారు.
విమానం కేవలం 672 అడుగుల ఎత్తుకు చేరగానే సాంకేతిక లోపం తలెత్తిందని ..అందుకే ఇంత పెద్ద ప్రమాదం జరిగిందని నిపుణులు భావిస్తున్నారు. ప్రమాదానికి కొద్దిసేపటి ముందు కాక్‌పిట్‌లో ఏం జరిగింది అనేది విశ్లేషిస్తున్నారు. జూన్ 12 గురువారం మధ్యాహ్నం 1:38 గంటలకు అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయింది..ఆ తర్వాత కొద్ది ఎత్తుకు ఎగిరింది...వీడియో దృశ్యాలు గమనిస్తే అప్పటికే ఎత్తుకి ఎగిరేందుకు ఏదో సమస్య ఉందని అర్థమవుతోంది..కాస్త ఊగిసలాడుతూ కనిపించింది. ఆ తర్వాత పూర్తిగా పట్టు కోల్పోయి కింద పడింది.. సెకన్ల వ్యవధిలోనే పేలిపోయింది...భీకరమైన అగ్నికీలలు గాల్లోకి ఎగసిపడ్డాయి. ఏం జరిగిందో అర్థమయ్యేలోగా అందులో ఉన్న ప్రయాణికులంతా అగ్నికి ఆహుతైపోయారు. యావత్ దేశం దిగ్భాంత్రిలో మునిగిపోయింది.






















