Afghanistan crisis: 'అఫ్గాన్ లో అంతా గందరగోళమే.. తరలింపే మా ప్రధాన లక్ష్యం'
అఫ్గాన్ పరిస్థితులపై భారత విదేశాంగ ప్రతినిధి అరిందమ్ బాగ్చి మీడియాకు వివరించారు. అఫ్గాన్ పౌరుల తరలింపు సహా వివిధ అంశాలపై ప్రశ్నలకు సమాధానమిచ్చారు.
అఫ్గానిస్థాన్ లో పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నట్లు భారత్ తెలిపింది. శాంతి, సామరస్యాలు కలిసిన ప్రజాస్వామ్య అఫ్గాన్‌ను భారత్ కోరుకుంటున్నట్లు విదేశాంగ ప్రతినిధి అరిందమ్ బాగ్చి పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం ప్రజల తరలింపుకు సంబంధించి భద్రతాపరమైన అంశాలు ఎలా కొలిక్కి వస్తాయో చూడాలన్నారు. ప్రస్తుతం తమ లక్ష్యమంతా సురక్షితంగా ప్రజలను తరలించడేమనని స్పష్టం చేశారు.
We were moving to the e-Emergency visa system. It appears that all this could have led to some confusion which led to the unfortunate incident of denial of entry to a particular Afghan national: MEA spokesperson Arindam Bagchi
— ANI (@ANI) August 27, 2021
Once the security situation deteriorated (in Afghanistan), there were reports of a group of people who raided one of our outsourcing agencies where Afghan passports with Indian visas were there. Our authorities were in a state of high alert: MEA spokesperson Arindam Bagchi (1/2) pic.twitter.com/4Ne4yPhjuJ
— ANI (@ANI) August 27, 2021
తాలిబన్ ప్రభుత్వాన్ని భారత్ గుర్తిస్తుందా అన్న ప్రశ్నకు.. ప్రభుత్వ ఏర్పాటుకు అఫ్గాన్‌లో పరిస్థితులు అనుకున్న విధంగా లేవని బాగ్చి సమాధానమిచ్చారు. ప్రజల భద్రత పైనే తాము ప్రధానంగా దృష్టి సారిస్తున్నామన్నారు. భారత్‌కు వచ్చే అఫ్గాన్ పౌరులకు కేంద్ర హోంశాఖ ఈ-ఎమర్జెన్సీ వీసాను ప్రకటించిందని తెలిపారు. వీటి కాల వ్యవధి ఆరునెలలు ఉంటుందన్నారు.
Also Read: Rajasthan CM Health: ఆసుపత్రిలో చేరిన రాజస్థాన్ సీఎం.. త్వరగా కోలుకోవాలని మోదీ ట్వీట్