Adani: అదానీ గ్రూప్‌కు మరో షాక్ - విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు రద్దు చేసుకున్న శ్రీలంక
Adani Group : అదానీ గ్రూపుతో విద్యుత్ ఒప్పందాలను శ్రీలంక రద్దు చేసుకుంది. అవినీతి ఆరోపణలు రావడమే కారణమని అక్కడి ప్రభుత్వం ప్రకటించింది.

Adani Group loses big Sri Lanka contract as power purchase deal is revoked amid corruption allegations : శ్రీలంక ప్రభుత్వం నుంచి అదానీ గ్రూప్‌కు బ్యాడ్ న్యూస్ అందింది. గతంలో చేసుకున్న ఒప్పందాల్లో అవినీతి చోటు చేసుకుందన్న ఆరోపణలు రావడంతో.. విద్యుత్ ఒప్పందాలను రద్దు చేసుకుంటున్నట్లుగా శ్రీలంక ప్రభుత్వంలోని విద్యుత్ శాఖ తాజాగా ప్రకటన జారీ చేసింది. ఇప్పటికే శ్రీలంక అధ్యక్షుడు అరుణ కుమార దిస్సనాయకే అదానీ గ్రూపు శ్రీలంకలో చేపట్టిన పలు ప్రాజెక్టులపై విచారణకు ఆదేశించారు. అమెరికా కోర్టులో దాఖలైన అవినీతి ఆరోపణల కేసుల తరుణంలో తమ దేశంలో చేసుకున్న ఒప్పందాల విషయంలో ఏమైనా అవినీతి జరిగిందా లేదా అన్నదానిపై అధ్యక్షుడు అరుణ కుమార దిస్స నాయకే విచారణకు ఆదేశించారు.
గత ఏడాది మేలోనే శ్రీలంక ప్రభుత్వం అదాని గ్రూపుతో పవర్ పర్చేజింగ్ అగ్రిమెంట్ కుదుర్చుకుంది. కిలోవాట్‌కు US$0.0826 చొప్పున ధరన నిర్ణయించారు. అయితే అదానీ విద్యుత్ సరఫరాకు అవసరమైన ప్రాజెక్టుల నిర్మాణాన్ని ఇంత వరకూ ప్రారంభించలేదు. అదానీతో విద్యుత్ ఒప్పందాలను రద్దు చేసుకుంటామని దిస్సనాయకే ప్రభుత్వంలోని కీలక మంతి ఒక నెల ముందుగానే సూచనలు ఇచ్చారు. విద్యుత్ ఒప్పందాలను రద్దు చేసినప్పటికి ప్రాజెక్టును మాత్రం రద్దు చేయలేదని శ్రీలంక ప్రభుత్వం చెబుతోంది. ప్రాజెక్టు మీద పూర్తి స్థాయిలో రివ్యూ చేయడానికి ఓ కమిటీని నియమిస్తామన్నారు.
చిన్న పునరుత్పాదక ఇంధన సంస్థలు అదానీ ప్రతిపాదన ఖర్చులో దాదాపు మూడింట రెండు వంతుల ధరకే విద్యుత్తును అందిస్తున్నాయని .. అదానీ పవర్ చాలా కాస్ట్ లీ అని అది శ్రీలంకకు భారంగా మారుతుందని అక్కడి ఆందోళనకారులు చెబుతూ వస్తునన్్నారు. అనేక మంది స్వచ్చంద సంస్థల కార్యకర్తలు గతంలో ఈ ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ ఆదోళనలు కకూూడా చేశారు. మన్నార్, పూనెరిన్ తీరప్రాంతాలలో అదానీ 484 మెగావాట్ల పవన విద్యుత్ ప్లాంట్ క ప్రణాళికాబద్ధమైన నిర్మాణం పర్యావరణ సమస్యల కారణంగా నిలిచిపోయింది. శ్రీలంక సుప్రీంకోర్టులో విచారణను ఎదుర్కొంటోంది.
అదాని పవర్ సెకీతో కలిసి దేశీయంగా విద్యుత్ అందించడానికి కొన్ని రాష్ట్రాలతో చేసుకున్న ఒప్పందాల్లో అవినీతి చోటు చేసుకుందని అమెరికా ఎఫ్‌బీఐ అక్కడ కేసు నమోదు చేసింది. అమెరికా స్టాక్ మార్కెట్లకు తప్పుడు సమాచారం ఇచ్చి పెట్టుబడుులు సేకరించారని నోటీసులు జారీ చేసింది. దీన్నే కారణంగా చూపిస్తే శ్రీలంక ఒప్పందాలను రద్దు చేయాలని అనుకుంటోంది కానీ.. అదానీ ప్రాజెక్టులపై శ్రీలంకలో చాలా కాలంగా ఆందోళనలు జరుగుతున్నాయి.
శ్రీలంక ప్రభుత్వం విద్యుత్ ఒప్పందాలను రద్దు చేసుకున్న అంశంపై అదానీ గ్రూపు ఇంకా అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

