అన్వేషించండి

Covid Cases: తెలంగాణలో 4 ఒమిక్రాన్‌ సబ్‌ వేరియంట్‌ జేఎన్‌1 కేసులు- నేడు కేంద్రం కీలక భేటీ

తెలంగాణలో ఒమిక్రాన్‌ సబ్‌ వేరియంట్‌ జేఎన్‌1 కేసులు నాలుగు నమోదయ్యాయి. గడిచిన 24గంటల్లో కొత్తగా ఆరోగ్య సిబ్బంది 402 మందికి కొవిడ్‌ పరీక్షలు చేశారు.

దేశ వ్యాప్తంగా కరోనా కొత్త వేరియంట్‌ (New Covid Variant Cases) కేసులు పెరుగుతున్నాయి. కేరళలో ఒమిక్రాన్‌ ( Omicron) సబ్‌ వేరియంట్‌ జేఎన్‌1 కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. తెలంగాణ (Telangana)లో ఒమిక్రాన్‌ సబ్‌ వేరియంట్‌ జేఎన్‌1 కేసులు నాలుగు నమోదయ్యాయి. గడిచిన 24గంటల్లో కొత్తగా ఆరోగ్య సిబ్బంది  402 మందికి కొవిడ్‌ పరీక్షలు చేశారు.  6నెలల  తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కొవిడ్‌ బులిటెన్‌ విడుదల చేసింది.  ప్రస్తుతం రాష్ట్రంలో 9 కొవిడ్‌ యాక్టివ్‌ కేసులు ఉన్నట్టు వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. మరోవైపు  పెరుగుతుండటంతో అప్రమత్తమైన తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ, కరోనా చికిత్సలకు నోడల్‌ కేంద్రంగా ఉన్న గాంధీ ఆస్పత్రిలో  ఏర్పాట్లు చేసింది. సాధారణ రోగుల కోసం 30 పడకలు, గర్భిణుల కోసం మరో 20 ప్రత్యేకంగా కేటాయించారు. కేరళలో ఒమిక్రాన్‌ సబ్‌ వేరియంట్‌ జేఎన్‌1 కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. దీంతె కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది. కరోనా బాధితులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా గాంధీ ఆసుపత్రిలో సైతం అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 

రాష్ట్రాలతో ఇవాళ కేంద్రం సమీక్ష
కొవిడ్‌ అప్రమత్తత, ఆసుపత్రుల సన్నద్ధతపై ఇవాళ రాష్ట్రాల అధికారులతో కేంద్రం సమీక్ష నిర్వహించనుంది. కొవిడ్‌ జేఎన్‌.1 వేరియంట్‌ ప్రబలుతుండటంతో అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు కేంద్రం ఇప్పటికే లేఖ రాసింది. కొన్ని రాష్ట్రాల్లో కొవిడ్‌ కేసులు పెరిగాయని, ఇదే సమయంలో కొత్త వేరియంట్‌ ప్రభావం పెరిగిందని లేఖలో ప్రస్తావించింది.  అందరూ దగ్గేటప్పుడు, తుమ్మేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకునేలా ప్రోత్సహించాలి. జేఎన్‌.1 వేరియంట్‌ సోకిన వారిలో రోగ లక్షణాలు ఎలా ఉంటాయన్నది ఇంకా పూర్తిగా తెలియదు. సాధారణంగా కొవిడ్‌-19 సోకినప్పుడు కనిపించే లక్షణాలే కనిపించొచ్చు. అయితే ఈ వేరియంట్‌ సోకినప్పుడు ప్రభావం తీవ్రంగా ఉంటుందనే సంకేతం ఏమీలేదు. దీనివల్ల ప్రజారోగ్యానికి ముప్పు పెరిగే ప్రమాదం ఉందన్న సంకేతం కూడా లేదు.

ఇప్పుడున్న లేబొరేటరీల్లో ఆర్‌టీపీసీఆర్‌ టెస్టుల ద్వారా జేఎన్‌.1 వేరియంట్‌ను కనిపెట్టవచ్చు. వైరస్ కట్టడికి అన్ని ప్రభుత్వాలు నియంత్రణ చర్యలు చేపట్టాలని సూచించింది. జిల్లాల వారీగా ఆసుపత్రులకు వచ్చే ఇన్‌ఫ్లుయెంజా లైక్‌ ఇల్‌నెస్‌, సీవియర్‌ అక్యూట్‌ రెస్పిరేటరీ ఇల్‌నెస్‌ రోగులను నిరంతరం పర్యవేక్షించాలి. వారి వివరాలను ఇంటిగ్రేటెడ్‌ హెల్త్‌ ఇన్ఫర్మేషన్‌ ప్లాట్‌ఫామ్‌లో నమోదు చేసి కేసుల పెరుగుదలను తొలి దశలోనే పసిగట్టాలి. ఆర్‌టీపీసీఆర్‌ టెస్టులు అధికంగా చేపట్టి పాజిటివ్‌ నమూనాలను జన్యు పరిణామ విశ్లేషణ కోసం ఇన్సాకాగ్‌ లేబొరేటరీలకు పంపి కొత్త వేరియంట్లను సకాలంలో గుర్తించే ప్రయత్నం చేయాలి. రాబోయే పండగల సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని వైరస్‌ విస్తరించకుండా అడ్డుకోవడానికి తగిన నియంత్రణ చర్యలు చేపట్టాలి. శ్వాశకోశ సంబంధ పరిశుభ్రత పాటించేలా చూడాలి.

మిక్రాన్‌ సబ్‌ వేరియంట్‌ జేఎన్‌1 లక్షణాలు
జ్వరం, ముక్కు కారడం, గొంతునొప్పి, తలనొప్పి మిక్రాన్‌ సబ్‌ వేరియంట్‌ జేఎన్‌1 లక్షణాలు. కొంతమందిలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా వృద్ధులు, దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న వారు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.  తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా వృద్ధులతో పాటు ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నవారు.. గుంపుల్లోకి వెళ్లకపోవడం, మాస్క్‌ ధరించడం తప్పనిసరిగా పాటించాలి. కేసులు పెరిగితే మళ్లీ టెస్టులు చేసేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు.

టాప్ హెడ్ లైన్స్

Noida Mamura Village Fire: చార్జింగ్‌లో పేలిన ఎలక్ట్రిక్ బైక్ - ఐదు అంతస్తుల భవనం బుగ్గి - భారీ ప్రాణనష్టం
చార్జింగ్‌లో పేలిన ఎలక్ట్రిక్ బైక్ - ఐదు అంతస్తుల భవనం బుగ్గి - భారీ ప్రాణనష్టం
Breaking News: ఎలక్ట్రిక్ స్కూటిలో మంటలు! నొయిడాలోని బిల్డింగ్‌లో అగ్ని ప్రమాదం! ఇద్దరు మృతి!
ఎలక్ట్రిక్ స్కూటిలో మంటలు! నొయిడాలోని బిల్డింగ్‌లో అగ్ని ప్రమాదం! ఇద్దరు మృతి!
2027 ODI World Cup Plan: వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ కు బీసీసీఐ రోడ్ మ్యాప్ సిద్ధం.. తొలి వ‌న్డే ముగిశాక దీనిపై గిల్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు.. కోహ్లీ, రోహిత్ స్థానాలపై..
వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ కు బీసీసీఐ రోడ్ మ్యాప్ సిద్ధం.. తొలి వ‌న్డే ముగిశాక దీనిపై గిల్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు.. కోహ్లీ, రోహిత్ స్థానాలపై..
FIFA World Cup ENG VS ARG Semis: ఆర్జెంటీనాతో సెమీస్ కు ముందు ఇంగ్లాండ్ కి గుడ్ న్యూస్.. డెక్లాన్ రైస్ కంబ్యాక్ తో పటిష్టంగా ఇంగ్లీష్ టీమ్.. చిరకాల ప్రత్యర్థుల మధ్య ఆస‌క్తిక‌ర పోరు
ఆర్జెంటీనాతో సెమీస్ కు ముందు ఇంగ్లాండ్ కి గుడ్ న్యూస్.. డెక్లాన్ రైస్ కంబ్యాక్ తో పటిష్టంగా ఇంగ్లీష్ టీమ్.. చిరకాల ప్రత్యర్థుల మధ్య ఆస‌క్తిక‌ర పోరు

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: సొంత ఖర్చులతోనే పవన్ కల్యాణ్ సర్జరీలు! డిప్యూటీ సీఎం ఆఫీస్ కీలక ప్రకటన!
సొంత ఖర్చులతోనే పవన్ కల్యాణ్ సర్జరీలు! డిప్యూటీ సీఎం ఆఫీస్ కీలక ప్రకటన!
Mudragada Padmanabham Funeral:ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల్లో వివాదం! కుమార్తె రాకను అడ్డుకున్న కుటుంబం! కిర్లంపూడిలో ఉద్రిక్తత!
ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల్లో వివాదం! కుమార్తె రాకను అడ్డుకున్న కుటుంబం! కిర్లంపూడిలో ఉద్రిక్తత!
Varanasi Update : స్లో మోషన్స్ జంప్స్ చేశా - 14 నెలలుగా వారణాసి షూటింగ్‌లోనే... విజువల్ వండర్‌పై మందాకిని రియాక్షన్
స్లో మోషన్స్ జంప్స్ చేశా - 14 నెలలుగా వారణాసి షూటింగ్‌లోనే... విజువల్ వండర్‌పై మందాకిని రియాక్షన్
Pallichattambi OTT : పళ్లిచట్టంబి ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ - తెలుగులోనూ స్ట్రీమింగ్... ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
పళ్లిచట్టంబి ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ - తెలుగులోనూ స్ట్రీమింగ్... ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
2027 ODI World Cup Plan: వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ కు బీసీసీఐ రోడ్ మ్యాప్ సిద్ధం.. తొలి వ‌న్డే ముగిశాక దీనిపై గిల్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు.. కోహ్లీ, రోహిత్ స్థానాలపై..
వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ కు బీసీసీఐ రోడ్ మ్యాప్ సిద్ధం.. తొలి వ‌న్డే ముగిశాక దీనిపై గిల్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు.. కోహ్లీ, రోహిత్ స్థానాలపై..
Posani Krishna Murali : మీరు మారిపోయారు సార్ - అరెస్ట్ చేస్తారని భయమా రాజా?
మీరు మారిపోయారు సార్ - అరెస్ట్ చేస్తారని భయమా రాజా?
HYDRAA Demolitions: హైడ్రా టార్గెట్ చేస్తున్న ప్రాజెక్టులన్నీ కేటీఆర్ సన్నిహితులవేనా ? - తెలంగాణ రాజకీయాల్లో తెర వెనుక ఏం జరుగుతోంది?
హైడ్రా టార్గెట్ చేస్తున్న ప్రాజెక్టులన్నీ కేటీఆర్ సన్నిహితులవేనా ? - తెలంగాణ రాజకీయాల్లో తెర వెనుక ఏం జరుగుతోంది?
Eesha OTT : మరో ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - 7 నెలల తర్వాత స్ట్రీమింగ్... స్పెషల్ ఏంటో తెలుసా?
మరో ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - 7 నెలల తర్వాత స్ట్రీమింగ్... స్పెషల్ ఏంటో తెలుసా?
Embed widget