Srinagar Terror Attack: శ్రీనగర్ లో పోలీసుల బస్సుపై ఉగ్రదాడి... ఇద్దరు మృతి, 12 మందికి గాయాలు... విచారణకు ప్రధాని ఆదేశం
జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. పోలీసుల బస్సుపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.
జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. శ్రీనగర్ శివార్లలోని పంతా చౌక్ జెవాన్ ప్రాంతంలో పోలీసుల బస్సుపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా 12 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
Terrorists fired upon a police vehicle near Zewan in Pantha Chowk area of Srinagar. 14 personnel injured in the attack. All the injured personnel evacuated to hospital. Area cordoned off. Further details shall follow: Kashmir Zone Police
— ANI (@ANI) December 13, 2021
(Visuals deferred by unspecified time) pic.twitter.com/IfEXEh3wii
జమ్ము కశ్మీర్‌లో ఉగ్రవాదులు మరో ఘాతుకానికి తెగబడ్డారు. శ్రీనగర్ సమీపంలో పోలీసులు ప్రయాణిస్తున్న బస్సుపై కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో 14 మంది పోలీసులు గాయపడగా.. వారిలో చికిత్సపొందుతూ ఏఎస్సై, సెలెక్షన్ గ్రేడ్ కానిస్టేబుల్ మృతి చెందారు. పాంతాచౌక్ వద్ద జెవాన్ ప్రాంతంలోని పోలీస్ క్యాంపు సమీపంలో ఈ కాల్పులు చోటుచేసుకున్నాయి. సోమవారం సాయంత్రం సాయుధ పోలీస్ బెటాలియన్ బస్సుపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడినట్టు పోలీస్ వర్గాలు తెలిపారు. ఈ ఘటనలో గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనతో అప్రమత్తమైన ఆర్మీ బలగాలు పాంతా చౌక్‌లోని జెవాన్ ప్రాంతంలో ఉగ్రవాదుల కోసం గాలిస్తున్నాయి.
PM @narendramodi has sought details on the terror attack in Jammu and Kashmir. He has also expressed condolences to the families of those security personnel who have been martyred in the attack.
— PMO India (@PMOIndia) December 13, 2021
ప్రధాని దిగ్భ్రాంతి
శ్రీనగర్ ఉగ్రదాడిపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దాడిలో చనిపోయిన పోలీసుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. ఉగ్రదాడిపై సమగ్ర విచారణకు ప్రధాని ఆదేశించారు.
రాహుల్, ఒమర్, మమతా విచారం వ్యక్తం
శ్రీనగర్ పోలీస్ బస్సుపై కాల్పుల ఘటనను జమ్ము కశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనలో మృతిచెందిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. శ్రీనగర్ ఉగ్రదాడిలో మృతి చెందిన పోలీసులకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సంతాపం తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని రాహుల్ ఆకాంక్షించారు. ఉగ్రదాడిపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రాణాలు కోల్పోయిన పోలీసులకు సెల్యూట్ చేస్తున్నానన్నారు.
Also Read: Covid Vaccination: 'మోదీ ఫొటో ఉంటే తప్పేంటి? 100 కోట్ల మందికి లేని బాధ మీకెందుకు?'
Also Read: Kashi Vishwanath Corridor: సామాన్యుడికి మోదీ సర్‌ప్రైజ్.. కారు ఆపి బహుమతి తీసుకున్న ప్రధాని
Also Read: Corona Cases: దేశంలో తగ్గిన కరోనా కేసులు.. కొత్తగా 7,350 మందికి వైరస్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి