Top Headlines:రేవతి కుటుంబానికి 2 కోట్ల సాయం- తప్పుడు ప్రచారం చేయొద్దని పోలీసుల వార్నింగ్ - నేటి టాప్ న్యూస్
Top News: శ్రీతేేజ్‌ను అల్లు అర్జున్ తండ్రి అరవింద్ పరామర్శ నుంచి పోలీసు వార్నింగ్ వరకు టాప్ న్యూస్. మూడు గంటల వరకు ఆంధ్రప్రదేశ్, తెలంగామలో ఉన్న టాప్ హెడ్ లైన్స్ చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
Today Top Headlines In Andhra Pradesh And Telangana:
రేవతి కుటుంబానికి రెండు కోట్ల సాయం
సంధ్య థియేటర్ తొక్కిసలాటలో గాయపడి చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను నిర్మాత అల్లు అరవింద్, తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ దిల్‌రాజు, పుష్ప-2 నిర్మాత రవిశంకర్ పరామర్శించారు. కిమ్స్ ఆసుపత్రిలో బాలుడిని చూసి వైద్యులతో మాట్లాడారు. యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఆ కుటుంబానికి పుష్ప -2 టీమ్ రూ.2 కోట్ల నష్ట పరిహారం ప్రకటించింది. బాలుడు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఇంకా చదవండి.
అటల్ బిహారీ వాజ్‌పేయికి ఘన నివాళి
దివంగత ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి జయంతి సందర్బంగా ఏపీ సీఎం చంద్రబాబు ఘన నివాళులర్పించారు. భారతజాతి గర్వించదగిన నేత, భారతరత్న అటల్ బిహారీ వాజ్ పేయి శతజయంతి సందర్భంగా ఘననివాళి అర్పిస్తున్నాను అని సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. దేశగతిని మార్చిన వాజ్ పేయి దూరదృష్టి కారణంగానే నేడు మన దేశం ప్రపంచ దేశాలతో పోటీ పడుతున్నది అని అభిప్రాయపడ్డారు. ఆయనతో కలిసి పని చేసిన సందర్భాలను ఈ సందర్భంగా చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. ఇంకా చదవండి.
కౌశిక్ రెడ్డికి నోటీసులు
బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి మరోసారి పోలీసులు నోటీసులు ఇచ్చారు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో వాగ్వాదం జరిపి విధులకు ఆటంకం కలిగించిన కేసులు శుక్రవారం (డిసెంబర్ 27)న ఉదయం విచారణకు హాజరు కావాలని ఆదేసించారు. తన ఫోన్‌ను రేవంత్ రెడ్డి ప్రభుత్వం ట్యాప్ చేసిందని ఆరోపించిన ఆయన ఫిర్యాదు ఇచ్చేందుకు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. అక్కడ ఫిర్యాదు తీసుకోలేదని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో ఆయనపై కేసు నమోదు అయింది. ఇంకా చదవండి.
అన్ని మతాల వారు ప్రార్థనలు చేసే చర్చి
కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి యానాంలో సెయింట్ ఆన్స్ రోమన్ కాథలిక్ చర్చికి మతాలకు అతీతంగా ప్రజలు వెళ్తుంటారు.అన్నివర్గాలు వెళ్లిమరీ ప్రార్ధన చేసే ఆలయం అది. అక్కడ ప్రార్ధనలు చేస్తే సంకల్పం నెరవేరుతుందన్నది ప్రగాఢ విశ్వాసం. అత్యంత పురాతన చర్చిల్లో ఇది ఒకటిగా ఉంది. ఫ్రెంచ్ వర్తకులు ఫ్రెంచ్ ఎన్‌క్లేవ్‌గా యానాం ఉన్నందున 1750 సంవత్సరంలో నీలిమందు కర్మాగారాన్ని నిర్మించారని అప్పుడే చర్చి కూడా నిర్మించి ఉంటారని చెబుతారు. ఇంకా చదవండి.
దెబ్బలు పడతయిరో... దెబ దెబలు పడతయిరో...
అల్లు అర్జున్ అరెస్టైన సంధ్య థియేటర్ కేసులో తప్పుడు ప్రచారం చేస్తే తాట తీస్తామంటున్నారు పోలీసులు. ప్రజలను అపోహలకు గురి చేసేలా తప్పుడు వీడియోలు పోస్టు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ పోలీసులు హెచ్చరించారు. ‘పుష్ప 2 హీరో అల్లు అర్జున్ రాకముందే తొక్కిసలాట జరిగినట్టు.. కొందరు తప్పుడు వీడియోలు పోస్టు చేసిన అంశం తమ దృష్టికి వచ్చిందని పోలీసులు వివరించారు. విచారణ క్రమంలో తెలిసిన నిజాలను వీడియో రూపంలో ప్రజల ముందు ఉంచామని ఇంకా దర్యాప్తు సాగుతోందని అన్నారు. ఈలోపు అపోహలు సృష్టించవద్దని హెచ్చరించారు. ఇంకా చదవండి.
Also Read: యానాంలో మౌంట్ ఆఫ్ మెర్సీ జీసస్ స్టాట్యూను చూశారా..?