Spelling Bee 2022 Harini : అమెరికా స్పెల్లింగ్ బీ పోటీల్లో భారత సంతతి విద్యార్థులతే హవా - విజేతగా హరిణి
అమెరికాలో ప్రతీ ఏటా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే స్పెల్లింగ్ బీ పోటీల్లో భారత సంతతి విద్యార్థులు మరోసారి సత్తా చాటారు. విజత హరిణి, రెండో స్థానంలో విక్రమ్ రాజు నిలిచారు.
Spelling Bee 2022 Harini : అమెరికాలోని ప్రతిష్టాత్మక జాతీయ స్పెల్లింగ్ బి పోటీల్లో మరోసారి భారతీయ సంతతికి చెందిన హరిణి విజయం సాధించింది. 2022 స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బి పోటీల్లో టెక్సాస్‌లోని శాంటోనియాకు చెందిన 14 ఏళ్ల హరిణి లోగాన్ విజేతగా నిలిచింది. హరిణి 90 నిమిషాల్లో 21 పదాలకు కరెక్ట్‌గా స్పెల్లింగ్‌లు చెప్పింది. హరిణి స్పెల్లింగ్ కరెక్ట్‌గా చెప్పిన చివరి పదం 'మూర్హెన్ '. ఈ పోటీల్లో 230 మంది పాల్గొనగా.. వీరందరినీ వెనక్కి నెట్టి ముందు నిలవడం విశేషం.
Congrats! 14-year-old Harini Logan — an eighth-grader from San Antonio — won the Scripps National Spelling Bee last night by spelling 21 words correctly during a first-of-its-kind 90-second spell-off. pic.twitter.com/ped5oZacUS
— The Recount (@therecount) June 3, 2022
14 ఏళ్ల హరిణి శాన్ ఆంటోనియోలో 8వ గ్రేడ్ చదువుతోంది.స్పెల్ ఆఫ్ ఫైనల్లో డెన్వర్ కు చెందిన 12 ఏళ్ల విక్రమ్ రాజును ఓడించింది.కేవలం 90 సెకన్ల స్పీడ్ తో స్పెల్లింగ్ బీ కాంపిటీషన్ ట్రోఫీని ఎగురేసుకుపోయింది హరిణి. 21 పదాలను తప్పు లేకుండా చెప్పింది. ఇక విక్రమ్ రాజు 15 పదాలను తప్పులేకుండా చెప్పాడు.
By correctly spelling 22 words in the Spell-off, the 2022 Scripps National Spelling Bee Champion is #Speller231 Harini Logan! #spellingbee pic.twitter.com/pl0NTznYVr
— Scripps National Spelling Bee (@ScrippsBee) June 3, 2022
ఫైనల్ రౌండ్‌లో scyllarian, pyrrolidone, Otukian, Senijextee వంటి కఠిన పదాలకి సైతం ఆమె ఏమాత్రం తడబాటుకు గురికాకుండా కరెక్ట్ స్పెల్లింగ్స్ చెప్పడంతో విజేతగా నిలిచింది.హరిణికి నిర్వాహకులు జ్ఞాపికతో పాటు రూ.38లక్షల నగదు పారితోషికం అందజేశారు. ఇక రన్నరప్‌గా నిలిచిన విక్రమ్ రాజుకు రూ.22లక్షల ప్రైజ్‌మనీ దక్కింది.
తాను సృజనాత్మక రచనలను ఇష్టపడతానని, అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ను చూసి ప్రేరణ పొందినట్లు హరిణి వెల్లడించింది. హరిణి పియానో, రికార్డర్‌ను ప్లే చేస్తుంది. రకరకాల క్విజ్‌లు పూర్తి చేయడం, చదవడం, రాయడం, సంగీతం వినడం, సినిమాలు చూడటం ఇష్టమైనవిగా పేర్కొంది. గతేడాది 14 ఏళ్ల జైలా అవంట్ గార్డ్ స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బి పోటీలో నెగ్గి మొట్టమొదటి ఆఫ్రికన్-అమెరికన్‌గా నిలిచారు. ఈ పోటీల్లో అత్యధికంగా భారతీయ సంతతి విద్యార్థులే ప్రతిభ చూపుతూంటారు.