Viral News: రూ.11 కోట్ల విలువైన ఐఫోన్‌లు చోరీ, ట్రక్ డ్రైవర్‌కి మత్తు ఇచ్చి దొంగతనం
Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో ఐఫోన్‌లు చోరీకి గురయ్యాయి. రూ.11 కోట్ల విలువైన 1,500 ఫోన్‌లను దొంగిలించినట్టు విచారణలో తేలింది.

Viral News in Telugu: రూ.11 కోట్ల విలువైన ఐఫోన్‌లు చోరీకి గురయ్యాయి. మధ్యప్రదేశ్‌లో జరిగిందీ ఘటన. ఓ కంటెయినర్‌లో తరలిస్తున్న ఫోన్‌లను ఎవరో మాయం చేశారు. దాదాపు 1,500 iPhones చోరీకి గురైనట్టు తేలింది. ఈ ఘటన తరవాత ముగ్గురు పోలీసులను అధికారులు సస్పెండ్ చేశారు. నిర్లక్ష్యం కారణంగానే ఫోన్‌లు చోరీకి గురయ్యాయని మండి పడ్డారు. ఆగస్టు 15వ తేదీన ఈ ఘటన జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కంటెయినర్ డ్రైవర్‌కి మత్తు ఇచ్చి ఫోన్‌లో దొంగిలించినట్టు విచారలో వెల్లడైంది. అయితే...వేరే కోణాల్లోనూ విచారణ కొనసాగిస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు. ఇప్పటి వరకూ ఐఫోన్ కంపెనీ నుంచి పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు. గుడ్‌గావ్ నుంచి హరియాణాకి వెళ్తుండగా మార్గ మధ్యలో ఈ దొంగతనం జరిగింది. ఇప్పటికే కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్టు తెలిపారు. అయితే...విధుల్లో నిర్లక్ష్యంగా ఉన్న ముగ్గురిని సస్పెండ్ చేశారు. కంటెయినర్‌లో ఫోన్‌లు చోరీకి గురయ్యాయని డ్రైవర్ వచ్చి చెప్పినా వాళ్లు పట్టించుకోలేదన్న ఆరోపణలున్నాయి. ఈ కారణంగానే కేసు నమోదు చేయడం ఆలస్యమైంది. అందుకే..అధికారులు వెంటనే యాక్షన్ తీసుకున్నారు.
"యాపిల్ కంపెనీ నుంచి ఇప్పటి వరకూ మాకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు. పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌కి 35 కిలోమీటర్ల దూరంలో ఈ చోరీ జరిగింది. ట్రక్‌ని పూర్తిగా వీడియో తీస్తున్నాం. కేసు నమోదు చేసి త్వరలోనే విచారణ పూర్తి చేస్తాం. నిర్లక్ష్యం వహించిన ముగ్గురు పోలీసులపైన చర్యలు తీసుకున్నాం"
- పోలీస్ ఉన్నతాధికారులు
తనకు మత్తు ఇచ్చి ఆ తరవాత నోరు మూసేశారని, ఏం జరుగుతోందో అర్థం అయ్యేలోగా చోరీ జరిగిపోయిందని కంటెయినర్ డ్రైవర్ పోలీసులకు వివరించారు. డ్రైవర్ ఇచ్చిన స్టేట్‌మెంట్‌ని రికార్డ్ చేసుకుని ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. త్వరలోనే ఆ ఫోన్‌లన్నీ రికవరీ చేస్తామని చెబుతున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

