School Bus Accident: అదుపు తప్పి బోల్తాపడిన బస్సు, పెద్ద ఎత్తున మంటలు - విద్యార్థులు సజీవదహనం
South Africa: సౌతాఫ్రికాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్కూల్ బస్‌ని ట్రక్ ఢీకొట్టిన ఘటనలో బస్ అదుపు తప్పి బోల్తా పడింది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగడం వల్ల 12 మంది విద్యార్థులు సజీవదహనమయ్యారు.
South Africa School Bus Accident: సౌతాఫ్రికాలో ఘోర ప్రమాదం జరిగింది. స్కూల్ బస్‌ని మరో వాహనం ఢీకొట్టడం వల్ల అదుపు తప్పి బోల్తా పడింది. ఉన్నట్టుండి మంటలు చెలరేగడం వల్ల 12 మంది విద్యార్థులు సజీవదహనమయ్యారు. డ్రైవర్ కూడా ప్రాణాలు కోల్పోయాడు. మరో 7గురు విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతానికి వాళ్లకు చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంలో బస్ పూర్తిగా దగ్ధమైపోయింది. స్థానిక మీడియా విడుదల చేసిన ఫొటోలు, వీడియోలను విడుదల చేసింది. జొహన్నస్‌బర్గ్ వద్ద గౌతెంగ్ ప్రావిన్స్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. చిన్నారుల స్కూల్ బుక్స్ పేజీలన్నీ ఘటనా స్థలంలో చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. అయితే మృతి చెందిన విద్యార్థుల పూర్తి వివరాలు ఇంకా వెల్లడించాల్సి ఉంది. అందరూ ప్రైమరీ స్కూల్ వాళ్లే కావడం వల్ల వయసు 6-13 ఏళ్ల మధ్యలో ఉంటుందని భావిస్తున్నారు. గాయపడిన విద్యార్థులకు మెరుగైన వైద్యం అందిస్తున్నామని అధికారులు వెల్లడించారు. ప్రాణాపాయ స్థితి నుంచి తప్పించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు.
అసలు ఈ ప్రమాదం ఎలా జరిగిందని పోలీసులు విచారణ చేపడుతున్నారు. అయితే స్కూల్ బస్ వెళ్తుండగా వెనక నుంచి ఓ ట్రక్ వచ్చి బలంగా ఢీకొట్టిందని, అందుకే బస్ అదుపు తప్పి పడిపోయి ఉంటుందని ప్రాథమికంగా చెబుతున్నారు. ఈ ప్రమాదంపై గౌతెంగ్ విద్యాశాఖ మంత్రి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. సౌతాఫ్రికాలో ఎక్కడా లేని స్థాయిలో రోడ్ల నిర్మాణం చేపట్టారు. కానీ...ఇక్కడే రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతుంటాయి. రోడ్ సేఫ్‌టీలో అట్టడుగున ఉంటుందీ దేశం. ఈ ఏడాది మరో ఘోర విషాదం జరిగింది. మార్చిలో ఈ ప్రమాదం సంభవించింది. బ్రిడ్జ్‌పై నుంచి బస్ పడిపోయిన ఘటనలో 45 మంది ప్రాణాలు కోల్పోయారు. అంతకు ముందు ఫిబ్రవరి నెలలో జరిగిన బస్ ప్రమాదంలో 9 మంది మృతి చెందారు.
Also Read: NEET Row: నీట్ పేపర్ సోషల్ మీడియాలో లీక్ అవ్వలేదు, CBI రిపోర్ట్‌లో కీలక విషయాలు